భక్తి కథలు

హరివంశం120

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతేకాక నా విరోధులైన రాజులందరూ మన వృష్ణి వంశాలతో ఇదివరకే బద్ధ వైరంతో ఉన్నారు. ఇదివరకు జరాసంధుడితో కలసి వచ్చి మనమీద ఎన్నిసార్లో దండయాత్రలు చేశారు. మళ్లీ వాళ్ళు ఇప్పుడు ఏకమవుతారు. ఇదివరకటి యుద్ధాలలోనే మనం చాలామందిని మన వారిని కోల్పోయాము. కాబట్టి మీరంతా మధుర నుంచి సురక్షిత ప్రాంతానికి ముందుగా కదలండి అని చెప్పి ఒక మహా కాల సర్పాన్ని పట్టి తెప్పించి ఒక కుండలో ఉంచి దానికి గట్టి వాసెన గట్టి మూసివేయించి, దానిమీద మధుర రాజ్యముద్ర వేయించి ఒక దూత ద్వారా కమలాక్షుడు కాలయవనుడికి పంపించాడు.
అప్పుడా దూత కాలయవనుడి దగ్గరకు వెళ్ళి ఆ సర్పఘటం అతడికి సమర్పించి ఇంకా ఇట్లా దూత వాక్యాలుగా విన్పించాల్సిందని కృష్ణుడాజ్ఞాపించిన విధంగా చెప్పాడు. ‘కృష్ణుడు నిన్ను నల్లతాచులాగా చంపివేస్తాడు. ఆ కాటునకు చికిత్స లభించనే లభించదు. నినె్నవరూ ఏ ఔషధంతోనూ కాపాడలేరు. నన్ను అవలీలగా ఆయన తొక్కివేస్తాడు. ఆపైన నీకు సహాయంగా వచ్చిన రాజులందరూ తలొక దిక్కున పారిపోతారు.
అపారమైన నీ అశ్వ, రథ, గజ ఉష్ట్ర సేననంతా నీ సంపదనంతా ఆయన కొల్లగొడతాడు. తానే చక్రవర్తినని ప్రకటించుకుంటాడు అని ఆ దూత కాలయవనుడికి చెప్పి, అందుకు సంకేతంగా ఈ కృష్ణ సర్పఘటం నీకు పంపారు అని చెప్పాడు. ఇందుకు కాలయవనుడు ఏమి సమాధానం చెప్పకుండానే తక్షణం పెద్ద చీమల పుట్టనుంచి అసంఖ్యాకమైన చీమలను పట్టి తెప్పించి తన వద్దకు కృష్ణుడు పంపించిన ఆ సర్పఘటం వాసెన విప్పించి ఈ చీమలనన్నిటినీ ఆ కుండలో ప్రవేశింపచేసి మళ్లీ ఆ కుండకు గట్టిగా వాసెన బిగింపచేసి, దానిపై తన రాజముద్రను ముద్రింపచేసి దీనిని మళ్లీ తీసుకొనిపోయి మీ కృష్ణుడికే బహూకరించు అని ఆ దూతకు ఇచ్చివేశాడు కాలయవనుడు. దీనిని బట్టి కృష్ణుడేమని ఊహించాడంటే బలి మర్దనుడైనా గొప్ప వివేకశాలి కాబట్టి అల్పులు పెక్కురు చేరి అధికుడైనా అమిత బలశాలియైనా శత్రువును చిక్కులపాలు చేయగలరని, సంకట పరిస్థితులను సృష్టించగలరని తనకు కాలయవనుడు పంపిన సందేశంగా అర్థం చేసుకొని తాను కూడా మధురను విడిచిపెట్టిపోవడానికి నిశ్చయించుకున్నాడు. అంతకు పూర్వమే వారిని జలనిధి తీర ప్రాంతాలకు రమ్యకానన తోయ భూములకు తనవారిని చేర్చాడు జలజాక్షుడు.
అప్పుడిక ఒంటరిగా పాదచారియై కాలయవనుడు విడిది చేసిన చోటికి పోయినాడు. కృష్ణుణ్ణి చూసి సేనా సమూహమంతా వీడెవడో కృష్ణుడు, ఇడుగో ఇడుగో వచ్చాడు. పట్టుకోండి, బంధించండి, చుట్టముట్టండి అని కేకలు, బొబ్బలు పెడుతూ గొప్ప కలకలం సృష్టించారు. ఈ సంక్షోభం విని కాలయవనుడు తన సేనాని వేశనుంచి వచ్చి ఆ కలకలం రేగుతున్న చోటికి వచ్చాడు. అప్పుడు కృష్ణుడు, కాలయవనుడి కంటబడ్డాడు. రోష విస్మయాద్భుత పరీత చేతస్కుడైనాడు కాలయవనుడు. కృష్ణుణ్ణి పట్టుకొని బంధించాలని పరిగెత్తాడు. ఈ సందడిలో ఒక ఆయుధం కాని, ఒక రక్షణ కవచం కాని తన వెంట ఉంచుకోవడం మరచిపోయినాడు. తాను కూడా పాదచారిగానే కృష్ణుడి వెంటబడ్డాడు.
వాడు దగ్గరకు రాగానే చిక్కినట్లే కాలయవనుణ్ణి గికురించి చిక్కకుండా వాణ్ణి చాలాదూరం తన వెంట పరుగులు తీయించాడు. అందినట్లే ఆశ పెట్టాడు. అందక తప్పించుకున్నాడు. ఇట్లా ఇట్లా కాలయవనుణ్ణి పరుగులు పెట్టించి చాలా దూరం తీసుకొని వెళ్లి కృష్ణచంద్రుడు ఒక గుహలోకి దూరిపోయినాడు.

ఇంకా ఉంది