భక్తి కథలు

హరివంశం 121

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక చిక్కక ఎక్కడకు తప్పించుకుంటాడు అని ఆశపడ్డాడు కాలయవనుడు.
ఇక ఆ గుహ వృత్తాంతం ఎటువంటిదో కాలయవనుడికేం తెలుసు?
మాంధాత చక్రవర్తి కుమారుడైన ముచికుందుడు దేవతలను వరం వేడుకొని తనకు ఎటువంటి నిద్రాభంగం లేకుండా సుఖసుప్తుడై నిద్రిస్తున్న గుహ అది. అక్కడాయన ఎందుకు నిద్రపోతున్నాడంటే, దేవాసుర యుద్ధంలో ముచికుంద మహారాజు దేవతల పక్షాన చాలాకాలం యుద్ధం చేసి దేవతలకు జయం కలిగించాడు. దేవతలు ఆయనపట్ల ఎంతో సంప్రీతులైనారు. మాకింత సహాయం చేసి మమ్ముల్ని రక్షించావు, నీకేం కావాలి కోరుకోవలసిందని ఆయనను అర్థించారు. అప్పుడు ముచికుందుడు, నాయనలారా! నేను ఏండ్లూ పూండ్లూ యుద్ధం చేసి కంటిమీద కూరుకులేకుండా బడలిపోయాను, చాలా శ్రమకు ఓర్చుకున్నాను, తృప్తిదీరా, చాలా కాలం నిద్రపోవాలని ఉంది.
కాబట్టి నాకు నిద్రాభంగం లేకుండా వరమిమ్వండి. నాకు నిద్రాభంగం ఎవడైనా కలిగించాడో, వాడిమీద నా చూపు పడగానే వాడు దగ్ధమైపోవాలి అని కూడా ఒక వరం నాకు అనుగ్రహించండి అని కోరుకుని ఈ గుహలో పడుకుని ఆయన నిద్రపోతున్నాడు. కాలయవనుడి ఆయువు మూడింది కాబట్టి వాడు కృష్ణుడిని తరుముకుంటూ వచ్చి ఆ గుహలో జొరబడ్డాడు. కృష్ణుడు ఆ గుహలో ప్రవేశించి ముచికుంద మహారాజు సుఖ నిద్రా పర్యంకం తల దిక్కున ఒదిగి, నక్కి చూస్తున్నాడు. కాలయవనుడు మూర్ఖుడు, దుష్టుడు కాబట్టి గుహలో ప్రవేశించి ‘ఓరీ! కృష్ణా! ఎంత కపట నాటకమాడుతున్నావు? దొంగ వేషాలు కట్టి పెట్టి వెంటనే లేచి నాతో యుద్ధం చేయి. ఇదా నీ బల పరాక్రమం. నిద్రపోతున్నాడు అని నేను పాపం తలుస్తాననుకుంటున్నావు కదా! అని ఆ గుహ అంతా ప్రతిధ్వనించేట్లు వికటాట్టహాసం చేసి ముచికుంద మహారాజును ఒక తాపు తన్నాడు. హుంకరించాడు. అపుడు ముచికుందుడు నిద్రాభంగమై కళ్ళు తెరచి చూశాడు. ఆయన చూపు కాలయవనుడిపై పడగానే వాడు నిలువునా కాలిపోయినాడు. ఒక చెట్టుమీద పెద్ద పిడుగు పడి ఆ చెట్టు సమూలంగా దహించుకొని పోయినట్లు కాలయవనుడు కాలగతి చెందాడు.
అపుడు కృష్ణుడు ముచికుంద మహారాజు ఎదుటకు వచ్చి ఆయనకు నమస్కరించాడు. ‘నీవిక్కడ నిద్రపోతున్న విషయం నాకు తెలుసు. మహారాజా! నాకు నారదుడు ఇదివరకే నీ వృత్తాంతమంతా తెలిపాడు. నాకు మహోపకారం చేశావు. నేను చేయవలసిన పని నీవల్ల సఫలమై నాకు శ్రమ తప్పిపోయింది. ఇక నాకు అనుజ్ఞ ఇవ్వు. చిరకాలం నీ కీర్తి లోకంలో నిలిచి ఉంటుంది’ అన్నాడు కృష్ణుడు.
ముచికుందుడప్పుడు చాలా ఆశ్చర్యం పొందాడు. ‘మహానుభావా! నీవు ఎవరవయ్యా! ఇక్కడకు ఎందుకు వచ్చావు? ఏ పనిమీద వచ్చావు? నా నిద్ర పాడు చేశాడే, వీడెవడు? నీకు తెలిస్తే నేను ఎప్పటినుంచి నిద్రపోతున్నానో కూడా చెప్పగలిగితే చెప్పు!’ అని కృష్ణుణ్ణి అడిగాడు. అప్పుడు మాధవుడా మహారాజుతో ఇట్లా చెప్పాడు.
అచ్ఛ స్వచ్ఛ ధవళకాంతులతో ఒప్పారిన కీర్తిమంతుడు నహుషుడనే చక్రవర్తి. ఆయన నందనుడు యయాతి. యయాతి మహారాజుకు ఐదుగురు కుమారులు. అందులో పెద్దవాడు యదువు. ఆయన పేరిట యదు వంశం ప్రవర్థిల్లింది. ఆ వంశంలో పుట్టినవాడు పుణ్యశీలి అయిన వసుదేవుడు. ఆయనకు దేవకికి జన్మించాను నేను. నన్ను కృష్ణుడంటారు. వసుదేవుడికే రోహిణీదేవి అనే ఇంకొక ఇల్లాలికి జన్మించాడు బలదేవుడు. కాబట్టి మేము అన్నదమ్ములం. ఇపుడు నీ చూపుకు ఆహుతి అయినవాడు నా ప్రబల శత్రువు.

ఇంకాఉంది