భక్తి కథలు

హరివంశం - 11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపుడు నేను రుధిర మాంస దుర్గంధపూరితనైనాను. రక్తపంకిలనైనాను. కేశ సంస్కారం లేని రజస్వలలాగా మైలపడ్డాను. దీనురాలినైనాను. పరశురాముడప్పుడొక గొప్ప యజ్ఞం చేసి సకల ధరిత్రిని కశ్యప మహర్షికి యజ్ఞదక్షిణగా ఇచ్చాడు. అపుడు నేను కశ్యప మహర్షిని ఆశ్రయించాను. ఆయనకు మొరపెట్టుకున్నాను. నన్ను రక్షించే పాలించే క్షత్రియులంతా హతులైనారు.
ఇపుడు భూనాథుడంటూ లేడు. నేను అనాథనైపోయినాను. కాబట్టి నన్ను పరిపాలించే సంరక్షణ చేసే ఒక నాధుణ్ణి అనుగ్రహించాలి సన్మునీంద్రా! అని ఆయనను వేడుకున్నాను. అపుడాయన నాకు మనువును ఇచ్చాడు. ఆ తరువాత ఆయన సంతానం నన్ను పరిపాలించింది. ఎన్నో మన్వంతరాలు ఈ విధంగా సాగాయి. ఆ మనువులంతా మహాకులీనులు. ధీరులు. శూరులు. ముని జన సమ్మతాచారులు. చాలా యుగాలు జగత్తును నిరుపద్రవంగా పరిపాలించారు.
అయితే ఎవరికైనా కాలవశులు కాక తప్పదు. ఇప్పటి పరిస్థితి నాకు దుస్సహంగావుంది. రాజవంశాలు తామర తంపరలాగా వృద్ధి చెందాయి. వాళ్ళందరూ సన్మార్గగాములే. అయితేనేమి భూమి భరించాలి కదా! నేను భరించలేకుండా ఉన్నాను. నా భారం కాస్త తగ్గాలి. ఈ పనికి మహా విష్ణువు సంకల్పించాలి. పూనుకోవాలి. అపుడు కాని నేను ఊపిరి పీల్చుకోలేను. మీ పెద్దలందరికీ విన్నపాలు చేసుకుంటున్నాను. మీరంతా కూడబలుక్కొని ఒక నిశ్చయానికి రావాలి అని భూదేవి / దీనానన అయి ఆ దేవతా ప్రముఖులందరినీ అర్థించింది. వాళ్ళు తమలో తాము సంప్రదించుకొని విరించికి ఇట్లా విన్నవించారు. ఈ సృష్టి క్రమంలో మొదలు ప్రభవించినవాడవు నీవు. తరువాత సృష్టికర్తవగు ఆ బాధ్యత నిర్వహించిన వాడవు నీవు. ఇపుడు భూదేవి ఇట్లా దుఃఖాలాపాలతో ఉస్సురుస్సురని వ్యధ చెందుతున్నది. కాబట్టి మా ఉద్దేశం ఏమంటే వాసుదేవుడు, మహేశ్వరుడు, కుమారస్వామి (విశాఖుడు), వాసవుడు (ఇంద్రుడు) వరుణుడు, యముడు, కుబేరుడు, సూర్యచంద్రులు, వాయుదేవుడు, అగ్ని, బృహస్పతి, శుక్రుడు, యముడు, కుబేరుడు, సూర్యచంద్రులు, వాయుదేవుడు, అగ్ని, బృహస్పతి, శుక్రుడు, విశ్వదేవతలు, రుద్రులు, అశ్వినులు, యక్షరాక్షస గంధర్వ గరుడ, పన్నగ, కిన్నర ప్రముఖులంతా తమ తమ అంశావతారాలుగా వసుధపై జన్మించాలి. గిరులు, సరిత్తులు, జలధులు కూడా తమ తమ అంశాలతో భువి మీద పుట్టాలి.
వీళ్ళంతా పుడమిపై యోనిజనులుగా, అయోనిజులుగా జన్మించాల్సి వుంటుంది. తమ తమ ఇచ్ఛానుసారం బ్రాహ్మణ వంశాలలో, క్షత్రియ వంశాలలో తమ తమ అంశావతారలతో దేవ ప్రముఖులూ, రాక్షస ప్రముఖులూ జన్మించాలి. భూభారాన్ని తొలగించాలి అని బ్రహ్మదేవుడికి వాళ్ళు చెప్పారు.
చతుర్ముఖుడప్పుడు ‘అవును ఇప్పిడిట్లా చేయవలసిందే’ అంటూ అక్కడ కూడిన దేవతలకు ఇందుకు సంబంధించిన ఒక వృత్తాంతం చెప్పాడు. ‘ఒక రోజు చల్లని సాయంకాలం నేను సముద్ర తీరంలో కశ్యప మహర్షితో తత్త్వగోష్ఠిలో ఆసక్తుడినైనాను. ప్రజ్ఞాఘనుడైన కశ్యపర్షితో తత్త్వచింతన చేయడం నాకు ప్రీతికరం. ఇంతలో చంద్రోదయమైంది. ఇక సముద్రుడి ఆటోపోత్సాహోల్లాసం విజృంభించింది. సముద్రుడు దర్పంతో ఉప్పొంగిపోతూ వినువీధి మందాకినిని తనలోకి తీసుకుందామనుకొంటూ అంబర చుంబిగా ఉత్తుంగ తరంగాలతో ఉద్వేగం చెందాడు. అంతటితో ఊరుకోకుండా మేమున్న చోటికి కూడా ఉరవడించి మమ్ములను తడిసేట్లు చేశాడు. నాకు నవ్వొచ్చింది. ఏమిటయ్యా! ఈ ఆగడం. కాస్త శాంతుడివి కావయ్యా! అన్నాను.
-ఇంకాఉంది

అక్కిరాజు రమాపతిరావు