బిజినెస్

డిజిటల్ లావాదేవీలు మరింత వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 3: తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ లావాదేవీలను వేగవంతం చేయడంలో భాగంగా బ్యాంకర్లు ఎస్‌బి అకౌంట్ల ఆధార్ సీడింగ్‌ను వెంటనే పూర్తి చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఎస్‌బి అకౌంట్ ఉన్న ఖాతాదారులందరికీ రూపేకార్డులు ఇవ్వాలని, బీమ్ యాప్‌ను ప్రజల్లోకి పూర్తిగా తీసుకుపోవాలని ఆదేశించారు. ఈ నెల 8న జరిగే రాష్టస్థ్రాయి బ్యాంకర్ల స్టీరింగ్ కమిటీ సమావేశానికి జిల్లాల నుండి లీడ్‌బ్యాంక్ మేనేజర్లు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగువేల మీ-సేవా కేంద్రాల్లో డిజిటల్ లావాదేవీలకోసం బయోమెట్రిక్ పరికరాలు సిద్ధంగా ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 838 పోస్ట్ఫాసుల్లో డిజిటల్ లావాదేవీల కోసం పరికరాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జూన్ 5 నుండి 9 వరకు జాతీయ స్థాయి ఫైనాన్షియల్ లిట్రసీ ప్రచారం నిర్వహిస్తున్నామని, జిల్లా కలెక్టర్లు ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఫార్చ్యునర్, ఇన్నోవా
ధరలను పెంచిన టొయోటా
న్యూఢిల్లీ, మే 3: టొయోటా కిర్లోస్కర్ మోటార్.. తమ అత్యుత్తమ మోడల్స్ అయిన ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యునర్ ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ నెల నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయంది. వివిధ శ్రేణిల ఆధారంగా ఫార్చ్యునర్ ధర 26.6 లక్షల రూపాయల నుంచి 31.86 లక్షల రూపాయల మధ్య ఉండగా 2 శాతం, ఇన్నోవా క్రిస్టా ధర 13.99 లక్షల రూపాయల నుంచి 21.19 లక్షల రూపాయలుగా ఉండగా 1 శాతం మేర పెంచుతున్నట్లు తెలిపింది. కాగా, ఎషియోస్, సెడాన్ కరోల్లా, ప్రీమియం సెడాన్ కామ్రి తదితర వాహనాల ధరలను పెంచలేదు.
దేశీయంగా టూవీలర్ అమ్మకాల్లో
రెండో స్థానంలో హోండా
ముంబయి, మే 3: జపాన్‌కు చెందిన ఆటో రంగ దిగ్గజం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా.. భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో రెండో అతిపెద్ద సంస్థగా అవతరించింది. అమ్మకాలపరంగా ఏప్రిల్‌లో బజాజ్ ఆటోను వెనక్కి నెట్టడమేగాక, హీరో మోటోకార్ప్‌ను సమీపించింది. గత నెల హోండా అమ్మకాలు (దేశీయంగా, ఎగుమతులతో కలిపి) 5,78,929 యూనిట్లుండగా, హీరో విక్రయాలు 5,91,306 యూనిట్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో బజాజ్ ఆటో అమ్మకాలు 3 లక్షల దిగువకే పరిమితమయ్యాయి.
ఫిలిప్పీన్స్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు
అభివృద్ధి రేసులో జిఎమ్‌ఆర్
హైదరాబాద్, మే 3: ఫిలిప్పీన్స్‌లో మరో ఎయిర్‌పోర్టు నిర్వహణ రేసులో పోటీపడుతోంది జిఎమ్‌ఆర్ సంస్థ. ఇప్పటికే ఇక్కడి మాక్టన్ సెబు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్వహణను చూస్తున్న జిఎమ్‌ఆర్.. 800 మిలియన్ డాలర్ల దావో ఎయిర్‌పోర్టు ప్రాజెక్టుపట్ల కూడా ఆసక్తి కనబరుస్తోంది. దీనికి సంబంధించిన పోటీలో జిఎమ్‌ఆర్ ప్రీ-క్వాలిఫైడ్ బిడ్డర్‌గా నిలిచిందని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు బుధవారం ఇక్కడ జిఎమ్‌ఆర్ స్పష్టం చేసింది. దావో ఎయిర్‌పోర్టు అభివృద్ధి లైసెన్సుకు కృషి చేస్తున్నామంది.
‘దేశంలోకి 770 బిలియన్ డాలర్ల
నల్లధనం వచ్చింది’
న్యూఢిల్లీ, మే 3: దేశంలోకి 2005-14 మధ్య కాలంలో 770 బిలియన్ డాలర్ల నల్లధనం వచ్చినట్లు ఓ తాజా నివేదిక అంచనా వేసింది. ఇదే సమయంలో 165 బిలియన్ డాలర్లు ఇతర దేశాలకు పోయినట్లు తెలుస్తోంది. కేవలం 2014లోనే దాదాపు 101 బిలియన్ డాలర్ల అక్రమ సంపద దేశంలోకి వచ్చిందని, 23 బిలియన్ డాలర్లు పోయిందని సదరు నివేదిక చెబుతోంది. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అక్రమ ఆర్థిక లావాదేవీలు: 2005-2014’ శీర్షికన ఈ నివేదిక వెల్లడైంది.
ఫరీదాబాద్‌లో హ్యూందాయ్
గ్లోబల్ క్వాలిటీ, ట్రైనింగ్ సెంటర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 3: దేశంలోనే రెండో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ హ్యూందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) తన గ్లోబల్ క్వాలిటీ, ట్రైనింగ్ సెంటర్‌ను హర్యానాలోని ఫరీదాబాద్‌లో ప్రారంభించింది. ప్రపంచలో ఉన్న ఐదు ఇండియా క్వాలిటీ సెంటర్లలో ఇదొకటి అని ఆ కంపెనీ ఎండి, సిఇఒ వైకె కూ తెలిపారు. ఈ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రాన్ని ఫరీదాబాద్‌లో ఏర్పాటు చేయడం ద్వారా జీరో డిఫెక్ట్ లేని, పూర్తి నాణ్యవంతమైన సేవలను తమ వినియోగదారులకు అందించేందుకు తాము మరింత అంకితభావంతో పని చేస్తామని తెలిపారు. వాహన భద్రత, ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ సేవలను అందించడం వంటి వాటిపై మరింత దృష్టిసారిస్తామని వెల్లడించారు.