మెయిన్ ఫీచర్

ఆ ఇద్దరు.. నిర్భయ కేసులో కీలక పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ రాజధానిలో జరిగిన ఆ కర్కశ సంఘటనతో ప్రతి ఒక్క భారతీయుడు కన్నీరు కార్చాడు. కోట్లాది హృదయాలు ఆక్రోశించాయి. దేశం యావత్తు ఆగ్రహాంతో ఊగిపోయింది. నిర్భయకు జరిగిన అన్యాయంపై అందరి గుండె పగిలింది. ప్రపంచాన్ని నిశే్ఛష్టులను చేసిన నిర్భయ కేసులో వెలువడిన తీర్పుపై సర్వత్రా హర్షాతీరేకాలు వ్యక్తం అవుతున్న వేళ. ఈ కేసులో కీలక భూమిక పోషించి, నిందితులకు తగిన శిక్షపడేలా చేసిన ఆ ఇద్దరు మహిళలను అంతా మెచ్చుకుంటున్నారు. ‘‘నాకు ఇంత అన్యాయం చేసినవారిని విడిచిపెట్టవద్దు’’ అని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు నిర్భయ చెప్పిన విషయాలను తెలుసుకుని నిందితులకు శిక్షపడేలా చేశారు. నిర్భయ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఆర్.్భనుమతి ఒకరైతే, ఢిల్లీ పోలీసు అధికారిగా పనిచేసిన ఛాయాశర్మ రెండోవ్యక్తి. ఈమె ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్‌లో పనిచేస్తున్నారు.
సుప్రీంలో తొలి ఎస్సీ మహిళా న్యాయమూర్తి
‘మహిళల పట్ల ఎలా వ్యవహరిస్తున్నాం అన్నదే ఒక దేశ పురోగతికి కొలమానం’ అని స్వామి వివేకానంద మాటలను తన తీర్పు సందర్భంగా జస్టిస్ భానుమతి ఉటంకిస్తూ..ఈ తీర్పు సందర్భంగా ఆమె గుండెలోతుల్లో నుంచి పలికిన పలుకులు నేటి సామాజిక జీవనంలో ఆధునిక స్ర్తి జీవితానికి అద్దం పడు తున్నాయి. నిర్భయ కేసులో తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఏకైక మహిళా న్యాయమూర్తిగా మిగిలిన ఇద్దరి న్యాయమూర్తుల తీర్పుతో ఏకీభవిస్తూ.. ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింప చేశాయి. సమాజంలో మార్పునకు చట్టాలు మాత్రమే సరిపోవని, ఆడపిల్లలను గౌరవించాలని తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లలకు చెప్పాల్సిన అవసరాన్ని నొక్కివక్కాణించారు. అంతేకాదు పాఠ్యాంశాల్లోను సైతం స్ర్తి, పురుష సమానత్వం గురించి చెప్పాలని ఆమె చేసిన వ్యాఖ్యలు న్యాయం కోసం పిడికిలి బిగించినవారికి మనోనిబ్బరాన్ని కలిగించాయి.
సంచలనాత్మక తీర్పులు
సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా నియమితులైనవారిలో ఆమె ఆరవ మహిళ. జస్టిస్ భానుమతి తమిళనాడు వాస్తవ్యరాలు. ఆ రాష్ట్ర హైకోర్టుకు తొలి మహిళా జడ్జిగా పనిచేశారు. ఎన్నో కీలకమైన తీర్పులు
ఆమె నుంచి వెలువడ్డాయి. ముఖ్యంగా తమిళనాడులో దేవుడి అవతారంగా చెప్పుకునే ప్రేమానంద ఆశ్రమంలో జరిగిన లైంగిక వేధింపుల కేసులో ప్రేమానందకు రెండు జీవిత ఖైదు శిక్షను విధిస్తూ జస్టిస్ భానుమతి తీర్పునిచ్చారు. రెండవ జీవితఖైదు శిక్ష అనుభవిస్తుండగానే ప్రేమానంద జైలులోనే మరణించారు. తమిళనాడులో సంచలనం సృష్టంచిన జల్లికట్టును ఆమె నిషేధిస్తూ తీర్పు చెప్పారు. ఈ తీర్పు సంప్రదాయ క్రీడలలో మార్పు తీసుకురావాల్సిన విషయాన్ని గుర్తుచేస్తుందని చెప్పవచ్చు. అలాగే పోలీసులకు-న్యాయవాదులకు మధ్య వివాదం సందర్భంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఆర్డర్ జారీ చేశారు. 2010లో చిదంబరంలో ఐదవ శతాబ్దంనాటి నందుజార్జర్ ఆలయ నిర్వహణను ప్రభుత్వం తీసుకోవటాన్ని ఆమె సమర్ధిస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును ఆ తరువాత సుప్రీం కోర్టు కొట్టివేసింది. అలాగే వీరప్పన్ ఆపరేషన్ కేసులోనూ, ఇసుక క్వారీల నిషేధంపై ఆమె వెలువరించిన తీర్పులు తమిళనాడులో సంచలనం కలిగించాయి.
ఆ సాక్ష్యాలే కీలకమయ్యాయి
నిర్భయ కేసుకు పనిచేయటం, సంఘటన జరిగిన 18 గంటల్లోనే డ్రైవర్ రాంసింగ్‌ను అరెస్టు చేసి పోలీసు వ్యవస్థపై నమ్మకం కలిగించిన పోలీసు అధికారిణి ఛాయాశర్మ. నిర్భయ ఘటన జరిగినపుడు ఢిల్లీ అసిస్టెంట్ పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్న ఛాయాశర్మ ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో పనిచేస్తున్నారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని ఆమె సేకరించిన సాక్ష్యాలే నేడు ఈ తీర్పులో కీలకంగా పనిచేశాయి. తిరుగులేని సాక్ష్యాలను సేకరించి, న్యాయస్థానం ముందుంచిన ఈ అధికారిణి తన కెరీర్‌లోనే ఈ తీర్పు తనకెంతో సంతృప్తినిచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. మహిళలు శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలని విశ్వసించే ఛాయాశర్మ ఆసుపత్రిలో న్యాయమూర్తికి నిర్భయ వాంగ్మూలం ఇస్తూ పలికిన మాటలు తనలో ఆమెలో పట్టుదలను పెంచాయంటారు. ఢిల్లీలో పనిచేసినపుడు ఎన్నో కేసులను ఆమె పరిశోధించారు. దీపక్ భరద్వాజ్ అరెస్టు, చద్దా కేసు వంటివాటిని ఛేదించారు. నిర్భయ స్నేహితుడి పాత్రపై ఎన్నో సందేహాలు ఆనాడు ఎంతోమంది వెలిబుచ్చారు. కాని అతని సాక్ష్యం, అన్నింటికంటే నిర్భయ వాంగ్మూలమే ఈ కేసులో నిందితులకు శిక్షపడేలా చేసిందని ఆమె అంటారు. ఢిల్లీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఓ పోలీసు అధికారిణిగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ మహిళలు బయటకు వెళుతున్నపుడు కొన్ని ప్రాధమిక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు. వెళ్లే ప్రదేశాన్ని, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను గమనిస్తుండాలని అంటారు. తన హయాంలో ఢిల్లీలో జరిగిన ఎన్నో కీలక కేసుల్లో ఈఐపీఎస్ అధికారిణి తనదైన ముద్రవేశారు.
నిర్భయ కేసుతో వచ్చిన మార్పులు
* మహిళలపై లైంగిక అకృత్యాలకు పాల్పడే దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాల్లో మార్పులు వచ్చాయి. ఎన్నో కేసులు పదునెక్కాయి.
* రెండువారాల పాటు జీవనపోరాటం చేసిన నిర్భయ చివరి శ్వాస వరకు తనపై లైంగిక దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలనే ఆరాటం వ్యక్తం చేసింది. అందుకే ఆమె లేకపోయినా తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం, కనబరచిన మనోనిబ్బరం స్ఫూర్తిదాయకంగా మారింది.
* అంతిమ క్షణం వరకు అసమాన ధైర్యాన్ని ప్రదర్శించిన నిర్భయ ప్రతి యువతి హృదయంలో జ్ఞాపకంగా నిలిచిపోవాలని తల్లి ఆశాదేవి కోరిక. ఆమె కోరికను నిజం చేస్తూ దాడి చేసినవాడికి నిశ్శబ్దంగా కనబడకుండా ధైర్యంతో బయటకు వచ్చిననాడు ఇలాంటి దుర్మార్గుల అకృత్యాల కోట కుప్పకూలుతుంది. అదే నిర్భయకు ప్రతి యువతి అందించే నిజమైన నివాళి.

cshitram... 1. భానుమతి

2. ఛాయాశర్మ

-టి.ఆశాలత