బిజినెస్

ఐఎంటి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మార్కెటింగ్ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎంటి) హైదరాబాద్ ఆధ్వర్యంలో రెండురోజులపాటు జరిగిన అంతర్జాతీయ సదస్సు ఆదివారం ముగిసింది. ఫ్రాన్స్‌కు చెందిన ఈకోల్ డి మేనేజ్‌మెంట్ డి నార్మండి, హంగేరికి చెందిన కోర్వినస్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. ఇందులో నూతనంగా ఆవిర్భవిస్తున్న మార్కెట్లు, మార్కెటింగ్ సవాళ్లు అనే అంశంపై దాదాపు 15 పరిశోధనాత్మక పత్రాలను పలువురు మార్కెట్ నిపుణులు ప్రవేశపెట్టారు. నూతనంగా విస్తరిస్తున్న మార్కెట్లలో సవాళ్లను ఎదుర్కోవడంలో తీసుకోవాల్సిన చర్యలపై పలువురు నిపుణులు ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్కెట్లతోనే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యం గా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉద్భవిస్తున్న ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేందుకు ఉత్పాదకతను పెంచాలని సూచించారు. అలాగే సంప్రదాయ ఆర్థిక వ్యవస్థల నుండి కొత్త ఆర్థిక విధానానికి దారితీస్తున్న పరిస్థితులనూ వారు విశే్లషించారు. కాగా, ఐఎంటి డైరక్టర్ డాక్టర్ సతీష్ ఐలవాడి మాట్లాడుతూ నూతన మార్కెట్లకు సామాజిక, రాజకీయ పాలన, వౌలిక వసతుల లేమి, వనరుల లోటు, బలహీన సరఫరా వ్యవస్థ సవాళ్లను విసురుతున్నాయన్నారు. వీటిని ఎదుర్కొనేందుకు కొత్త విధానాలను అవలంభించాలని సూచించారు.