బిజినెస్

విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో మెగా కనె్వన్షన్ సెంటర్లు, హైపర్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముందుకొచ్చిన లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ * చంద్రబాబుతో భేటీ

విజయవాడ, నవంబర్ 23: విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో మెగా కనె్వన్షన్ సెంటర్లు, హైపర్ మార్కెట్లు, హోటళ్లను ఏర్పాటు చేసేందుకు లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎగుమతి, దిగుమతులు, షిప్పింగ్, ట్రేడింగ్, ఐటీ, ట్రావెల్ అండ్ టూరిజంలో అగ్రగామిగా వున్న దుబాయ్ కంపెనీ లులూ ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ముందుకొచ్చింది. సోమవారం లులూ ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి పెట్టుబడులకు వున్న అవకాశాలపై చర్చించారు.మెగా కనె్వన్షన్ సెంటర్లు, మాల్స్, హోటళ్ల ఏర్పాటుపై అధ్యయనం చేసి త్వరలో డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ అందిస్తామని గ్రూపు ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. వౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి అజయ్ జైన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, సిఎంవో ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర ఈ సమావేశంలో పాల్గొన్నారు.