భక్తి కథలు

జైమిని భారతం - 99

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిభక్తి పరాయణుడైన చంద్రహాస మహారాజు ప్రజానురంజకంగా రాజ్యాన్ని మూడు వందల ఏళ్లు పరిపాలించేడు.
అర్జునా! ఇతరులెన్ని అపకారాలు తలపెట్టినా అవి విష్ణ్భుక్తుల్ని బాధింపలేవు. పైగా చంద్రహాసుడు గొప్ప సాలగ్రామ అర్చనాపరుడు. నిరంతరం నిత్య సాలగ్రామ పూజా పరాయణుడు. సాలగ్రామ తీర్థం శిరస్సుపై చల్లుకొన్నవానికి సర్వతీర్థ ఫలములూ లభిస్తాయి.
సాలగ్రామాన్ని ధరించడంవల్ల పధ్నాలుగు లోకాలను భరించిన ఫలం కలుగుతుంది. దానిని దానం చేయడం సమస్త భూమండలాన్నీ దానం చేయడంతో సమానం. సాలగ్రామాన్ని పూజించడం అంటే సమస్త దేవతల్నీ పూజించడమే.
సాలగ్రామ మహిమను నోరార చెప్పడం ఉందే- అది పవిత్ర వేదపారాయణ ఫలం లాంటిదే. సాలగ్రామం అంటే శేషశాయియైన శ్రీహరికి చరాచరాత్మకమైన శరీరం వంటిది. దీనిని నిరంతరం బ్రహ్మాది దేవతలు కొనియాడుతూనే ఉంటారు.
ఇంతకంటే శ్రేష్ఠమైనది శ్రీతులసి మహిమ. దానిని ఎంతని వర్ణించను? శిరస్సుపై పింఛం, చెవుల మకర కుండలాలూ, వృక్షభాగంపై కౌస్త్భుమణి ధరించే శ్రీమహావిష్ణువు శ్రీ తులసీదళాన్ని ఎంతో ఇష్టపడతాడు’’.
ఈ చంద్రహాస చరిత్ర విన్న నరులకు అభీష్టములు సిద్ధిస్తాయని చెప్పి నారదుడు దేవలోకానికి వెళ్లిపోయేడు.
అర్జునుడు చంద్రహాస చరిత్ర విని ఎంతో విస్మయాన్ని పొందేడు. విష్ణ్భుక్తులకు ఆపదలు కూడా సంపదలుగా పరిణమిస్తాయని భావిస్తూ కృష్ణునితో కలిసి కుంతల పురాన్ని చేరాడు అర్జునుడు.
కుంతల పురానికి చేరిన యాగాశ్వాలను చంద్రహాసుని కుమారులు మకర ధ్వజుడూ, పద్మాక్షుడూ బంధించి తండ్రి సన్నిధికి కొనిపోయేడు. యాగాశ్వాల వివరాలను విన్న చంద్రహాసుడు కుమారులతో అన్నాడు- ‘‘నాయనలారా! ఇవి ధర్మరాజు చేయతలపెట్టిన అశ్వమేధ యాగ అశ్వాలు.
దీనికి రక్షకునిగా సైన్య సేతంగా అర్జునుడు తిరుగుతున్నాడని విన్నాను. మనం ఈ గుఱ్ఱాల్ని బంధిస్తే ధర్మజుని యజ్ఞం విఘ్నవౌతుంది. మీరు పది పదిహేను దినాలు ఈ అశ్వాలను రక్షించి యజ్ఞ ప్రారంభ సమయానికి హస్తినాపురికి చేర్చండి’’.
చంద్రహాసుడు ఈ విధంగా కుమారులకు హిత వచనాలు చెప్పుచున్న సమయంలోనే కలకలంతో పాండవ సైన్యం అక్కడ మోహరించింది. చంద్రహాసుడూ మరియూ యువరాజులిద్దరూ యుద్ధానికి సిద్ధపడ్డారు. శ్రీకృష్ణ దర్శనంవల్ల చంద్రహాసుడు అవ్యక్తానందాన్ని పొందుతున్నాడు.
‘‘అర్జునా! పరమ వైష్ణవుడైన చంద్రహాసుని చూడు. ఇతడు జ్ఞాన తపోవయోవృద్ధుడే కాని యుద్ధరంగంలో నిలబడితే మాత్రం యువకుడే సుమా ఇప్పటికీ’’ అన్నాడు శ్రీకృష్ణుడు.
ఇంతలో చంద్రహాసుడు రథం దిగి వచ్చి దేవ దేవుడూ చక్ర ఖడ్గ గదా పద్మ హస్తుడూ, ముని జన సేవితుడూ అయిన శ్రీకృష్ణునికి సాష్టాంగ నమస్కారం చేసేడు.
శ్రీకృష్ణుడు ఆదరంగా చంద్రహాసుని కౌగిట చేర్చుకొన్నాడు.
‘‘అర్జునా శ్రీకృష్ణుడు చంద్రహాసుడు నా ప్రియమైన భక్తుడు. వీనితో యుద్ధకాంక్షను మాని, ప్రేమతో ఆలింగనం చేసుకో’’.
‘నేడు నా కులమంతా ధన్యత పొందింది’ అని అర్జునుడు చంద్రహాసుణ్ణి కౌగిలించుకొన్నాడు.
చంద్రహాసుడు మకరధ్వజుణ్ణి పిలిచి యాగాశ్వాలను క్రీడికి అప్పగించుమనగా అతడు అర్జునుకు నమస్కరించి అశ్వాలను రప్పించి అప్పగించేడు.
- ఇంకా ఉంది

-బులుసు వేంకటేశ్వర్లు