మంచి మాట

జైమిని భారతం - 103

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు యాగాశ్వాలను అలంకరించి సైన్యం జయ జయధ్వానాలు చేస్తుండగా విజయుడు విజయమూర్తియై రథంపై అక్కడికి చేరుకొన్నారు.
పౌరకాంతలు అర్జునునిపై పూవులు రత్నాలూ చల్లి భూమిని గంధవతినీ, రత్నగర్భనూ చేసేరు.
అర్జునుని అనుసరించి వచ్చిన రాజలోకం ధర్మరాజుకు వివిధమైన కానుకలు సమర్పించి పాద ప్రణామాలు చేసేరు. విదురాది వృద్ధులతో కొలువు తీరిన ధర్మజునకు రాజులందరినీ పరిచయం గావించేడు శ్రీకృష్ణుడు.
‘‘్ధర్మరాజా! ఇతడు నీలధ్వజుడు. అగ్ని ఇతనికి ఇల్లరికపుటల్లుడు. ఇతడు బభ్రువాహనుడు. అర్జునుని కుమారుడు. జీవరత్నంతో మన అర్జునుని బ్రతికించిన ఘనుడు. ఇతడు మహానుభావుడైన చంద్రహాస నృపాలుడు.
ఇతడు కోపగిస్తే దేవతలు ఆందోళన పడతారు. ఇతడు మయూర ధ్వజుడు. నేను అడగగానే శరీరంలోని సగ భాగాన్ని కోసి ఇచ్చిన మహాసత్యవ్రతుడు. ఇతడు హంసధ్వజుడు. వీని కుమారుల శిరస్సులు పరమేశ్వరుడు కంఠహారాలుగా ధరించేడు. ఇతడు వీరవర్మ. యముని మామగారు. ఇలా వీరందరూ ఒకరికంటే ఒకరు అధికులు సుమా!’’
ధర్మరాజు అందర్నీ సాదరంగా పలుకరించి గౌరవించేడు. అర్జునుడు వచ్చి ధర్మజునకు పాదాభివందనమాచరించేడు. కుంతీదేవి అర్జునుని శరీరాన్ని నిమురుతూ కన్నీరు తుడుచుకుంది. ఆ మహావీరుని శరీరం అంతటా యుద్ధ గాయాల మచ్చలే! అవి విజయ చిహ్నాలై పార్థునికి అందగించేయి.
కర్ణపుత్రుణ్ణీ కుంతి కౌగిలించుకొని ముద్దాడింది.
యాగం ప్రారంభం
ద్రౌపది ఓషధులు చేత పట్టుకొని నడువగా సకల రాజన్య సేవితుడైన ధర్మరాజు ఆరు ఎద్దుల్ని కట్టిన నాగలితో యజ్ఞ్భూమిని దున్ని శుద్ధి చేసేడు. దేవకీ యశోదలూ కుంతీదేవీ ఆ దంపతుల్ని సువర్ణ కలశాలతో గంధ సార పరిమళ పవిత్ర జలాలతో అభిషేకించేరు. సకల మునివర్యులూ ఏక కంఠంతో వేద మంత్రాలు పఠిస్తుంటే ఋత్విక్కులు బంగారు ఇటికలతో గరుడవేదిని నిర్మించేరు.
శాస్త్రోక్తంగా ఇటికలను సేకరించి ఎనిమిది ద్వారములు కల్గునట్లు యజ్ఞమండపం నిర్మించేరు. దాని చుట్టూ బంగారు ఇటికలు పేర్పి వివిధ తోరణాలు రత్న విలసితమైన వాటితో ధ్వజాలు నిలిపేరు. బదరి బిల్వ పలాశ మొదలగు పవిత్ర వృక్షకాండల్ని పదకొండు - పది ప్రదేశాల్లో యూపస్తంభాలుగా పాలించేరు. యజ్ఞ సంభారాలు, ఇతర పరికరాలు అందుబాటులో వేరువేరుగా ఏర్పరుచుకొన్నారు. ఇరవై బ్రహ్మకల్పాలు జీవించిన తపోమూర్తి బకదాల్భ్యుని యాగానికి బ్రహ్మగా నియమించుకొని, వేద రహస్య జ్ఞాని అయిన వ్యాస భగవానుని ఆచార్య పీఠంపై అధివసింపజేశారు.

ధర్మజుడు అశ్వమేధం
అశ్వమేధానికి ఋత్విక్కులు వశిష్ఠుడు - వామదేవుడు- రోమశుడు- సుమంతుడు- గాలవుడు- కపిలుడు- సౌబరి- భరద్వాజుడు- భాగురి- రైభ్యుడు- జమదగ్ని- జతుకర్ణి- కౌండిన్యుడు- గౌతముడు.
ఇంక రాక్షస విఘ్నాలను పరిహరించే మంత్రాలు పఠిస్తూ యజ్ఞశాల బహిర్వ్దారాల్లో నియమింపబడిన మహాత్ములు- అరుణి- పులహ- ఉపమన్యు- విశ్వామిత్ర- మధుచ్ఛంద- విభాండక- ధౌమ్య- వాయుభక్షులు.
లేడి కొమ్ము చేత ధరించి- జింక చర్మం మేన ధరించి, ధర్భాసనముపై తేజోమూర్తియై కూర్చున్నాడు ధర్మరాజు.

- ఇంకా ఉంది

- బులుసు వేంకటేశ్వర్లు