ఈ వారం కథ

గుంటూరు గోంగూర (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అల్లుడూ! నీతో అర్జెంట్‌గా మాట్లాడాలి’’ ఫోన్‌లో చెప్పాడు దామోదరం.
‘‘చెప్పు మామా!’’ అన్నాడు రంగనాయకులు.
‘‘్ఫన్‌లో కాదు, పర్సనల్‌గా మాట్లాడతా!’’
‘‘కొత్త కమీషనర్ వచ్చాడు మామా! ఆయనకంతా కొత్త. అన్నీ నన్ను బ్రీఫ్ చేయమంటాడు. ఆఫీసులో లేటవుతుంది మామా! ఆదివారం కలుద్దాం’’.
‘‘లేటైతే ఇంకా మంచిది. ఆఫీసు నుంచి సరాసరి కృష్ణా హోటల్‌కి వచ్చెయ్! గుటకలేస్తూ మాట్లాడుకుందాం.’’
‘‘సరే మామా!’’ అన్నాడు రంగనాయకులు.
కమీషనర్ ఏడింటికి కారెక్కి వెళ్లిపోయాక వూపిరి పీల్చుకున్నాడు రంగనాయకులు. సెల్‌ఫోన్‌లో దామోదరం యిచ్చిన మెసేజ్ కనిపించింది. ‘బయల్దేరా’ అని మెసేజ్ ఇచ్చాడు.
రంగనాయకులు వెళ్ళేసరికి అక్కడ ఇంకా నలుగురు వున్నారు దామోదరంతోపాటు.
‘‘వీళ్ళంతా ప్రముఖ కాంట్రాక్టర్లు. రంగనాయకులు మా అల్లుడు’’ అని అందర్నీ పరిచయం చేశాడు దామోదరం.
వాళ్ళు రంగనాయకులకు తెలిసినవారే.
‘‘మా అల్లుడు అనడమేగాని పిల్లనిచ్చావా ఏమైనానా మామా!’’ అన్నాడు రంగనాయకులు నవ్వుతూ.
‘‘నువ్వడిగితే పిల్లని ఎందుకియ్యనూ! అది ఇప్పుడేగా ఎల్.కే.జీలో చేరింది. డిగ్రీ పూర్తి చెయ్యనీ, నీకే ఇస్తాను. ఈ లోపల మీ ఆవిడకు విడాకులు ఇవ్వు’’.
దామోదరం మాటలకు అంతా పకపకా నవ్వారు.
రంగనాయకులు, దామోదరం చిన్నప్పటినుంచి ఒకే కాలనీలో పెరిగి పెద్దయ్యరు. చుట్టరికం ఏం లేకపోయినా అంతకంటే బాగా కలిసిపోయారు.
‘‘మామా! మీటింగ్ అజెండా ఏంటి?’’ అడిగాడు రంగనాయకులు.
‘‘మున్సిపాల్టీలో బి.టి. రోడ్ల పనుల కోసం మా కాంట్రాక్టర్లు అంతా రింగ్ అవ్వాలని నిర్ణయించుకున్నాం’’ చెప్పాడు దామోదరం.
‘‘లోగడ ఆన్‌లైన్‌లో ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్లకి ఇచ్చారు కదా మెయింటనెన్స్ డివిజన్ వాళ్ళు’’.
‘‘నిజమే అల్లుడూ! దాంతో మా వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. కార్పొరేటర్లతో ఒత్తిడి చేద్దామంటే వాళ్ళు పదవిలో లేరు. కమిషనర్ రాజ్యం జరుగుతున్నది. నీకు తెలుసుగా పోయిన కమీషనర్ చాదస్తుడు’’.
‘‘శాడిస్ట్‌గూడా!’’ దామోదరానికి అడ్డు తగిలి చెప్పాడు లింగారెడ్డి.
‘‘పనుల్లో నాణ్యత లేదు, సరిగా చెయ్యడం లేదని గొడవ పెట్టేవాడు. సకాలంలో బిల్లులు పాస్ కావు. ఈ పనులు ఎందుకు నెత్తిన వేసుకున్నాంరా దేవుడా అని మా కాంట్రాక్టర్లు తెగ ఫీలయ్యారు’’.
‘‘సరే! ఇప్పుడు టెండర్లు ఆన్‌లైన్‌లో కదా కాల్‌ఫర్ చేసేది? మీరెట్లా రింగవుతారు?’’ అన్నాడు రంగనాయకులు.
‘‘కమీషనర్ తల్చుకుంటే ఆన్‌లైన్ రద్దవుతుంది. ఎందుకంటే ఆన్‌లైన్ తక్కువకు కోట్ చసి పనులు తీసుకున్న కాంట్రాకటర్లు సరిగా పనులు చేయలేదనీ, చేసిన పనుల్లో నాణ్యత లేదనీ, వర్షానికి కొట్టుకుపోయి రాళ్ళు తేలాయనీ, అలా ఏవేవో వంకలు పెట్టి మళ్లీ యతాప్రకారం టెండర్లు బాక్సులో వెయ్యమనొచ్చు’’.
‘‘కాని కమీషనర్ తల్చుకోవాలిగా? ఆయన అసలే వచ్చింది కొత్త. మన ప్రపోజల్ ఒప్పుకుంటాడో లేదో తెలీదు’’ అన్నాడు రంగనాయకులు.
‘‘అందుకేగా నిన్ను పిలిచింది. కమీషనర్‌తో మీటింగ్ ఏర్పాటు చేయించు’’.
‘‘ఎలా? ఆయన అసలు సూట్‌కేసులు, కవర్లు తీసుకుంటాడో లేడో తెలీదు’’.
‘‘అదే తెలుసుకోవాలి. నువ్వు పి.ఎస్‌వి కదా! ఆ మాత్రం కూపీలాగలేవా?’’
‘‘లాగగలను. ఆయనొచ్చి ఇంకా రోజులే కదా! కొంచెం టైం పడుతుంది’’.
‘‘ఆయన ఓ.కె అంటే ఏ బ్యాంకాక్‌లోనో, సింగపూర్‌లోనో మీటింగ్ ఏర్పాటు చేస్తాం. విషయం ఏ మాత్రం లీక్ కాదు’’ చెప్పాడు దామోదరం.
‘‘సరే మామా! నేను ఆలోచిస్తాను’’ అని హామీ ఇచ్చాడు రంగనాయకులు.
ఆ తర్వాత అక్కడ మందు పార్టీ మొదలైంది.
****
కమీషనర్ మహేంద్రనాధ్ రంగనాయకులకు ఫోన్ చేశాడు.
‘‘జ్వరం వచ్చింది. నాట్ ఫీలింగ్ వెల్. అర్జెంట్ ఫైల్స్ ఇంటికి పట్టుకురా! బ్రీఫ్ చేసి సంతకాలు పెడతాను’’.
ఆ రోజు సాయంకాలం కమీషనర్ ఇంటికి వెళ్ళాడు రంగనాయకులు. కంట్రాక్టర్లు రింగ్ అవడం గురించి, ఆన్‌లైన్ టెండర్ల వలన సరిగా వర్క్ జరగనందున రద్దుచేసి మామూలుగా టెండర్లు పిలవడం గురించి ఆలోచిస్తున్నాడు రంగనాయకులు. ఐతే మహేంద్రనాధ్ కవర్లు పుచ్చుకుంటాడా లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. తను సూటిగా అడగలేడు. ఆయన ఎత్తితే తను చెప్పగలడు, సహకరించగలడు. ఇంతవరకు అదనపు ఆదాయం గురించి పెదవి విప్పడం లేదు. వర్కు టూ రూల్ అన్నట్లే ప్రవర్తిస్తున్నాడు.
ఇదేదో బి.టి. రోడ్లకు టెండర్లు పిలవడంలోగా తేల్చుకోవాలి. మాజీ కార్పొరేటర్లు కూడా రోడ్లు వెయ్యమని అడగడంలేదు. ఎలక్షన్లు దగ్గర కొస్తున్నయని తెలిస్తే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు వాలిపోతారు. రోడ్లు వేయించడం మా ఘనతే అని చెప్పుకుంటూ తిరగడానికి తహతహలాడతారు.
కమీషనర్‌తో సంతకాల కార్యక్రమం ముగిశాక ఇద్దరూ హాల్లోని సోఫాలో ఆశీనులయ్యారు. ఇద్దరికీ స్నాక్స్, కాఫీలు తెమ్మని పురమాయించాడు మహేంద్రనాధ్.
‘‘అబ్బాయ్ మీది ఏ వూరు?’’
రంగనాయకులు ఉలిక్కిపడ్డాడు. ఎదురుగా మహేంద్రనాధ్ పక్కనే కూర్చుని వుంది ఆయన తల్లి. ఏదో ఆలోచనలో వున్న అతను ఆమె ఎప్పుడొచ్చి అక్కడ కూర్చుందో గమనించలేదు.
‘‘మాది నెల్లూరమ్మా?’’ అన్నాడు.
‘‘నెల్లూరా? గుంటూరు ఏమో అనుకున్నాను’’ అన్నది ఆమె నవ్వుతూ.
‘‘కాదమ్మా! గుంటూర్లో ఏమైనా పని వుందామ్మా! వుంటే చెప్పండి. మా చుట్టాలు వున్నారు.’’
‘‘ఏం లేదయ్యా! గుంటూరు గోంగూర కావాలి’’.
‘‘ఎందుకమ్మా! ఇక్కడ రైతు బజార్లలో ఎర్రగోంగూర, తెల్ల గోంగూర బాగానే దొరుకుతుంది’’.
‘‘అబ్బే..!’’ ఆమె పెదవి విరిచింది.
విస్తుపోయాడు రంగనాయకులు.
‘‘గుంటూ గోంగుర రుచే వేరు. నా చిన్నప్పుడు మా అమ్మ పులిహోర గోంగూర అని పచ్చడి పెట్టేది. ఆకులు.. ఆకులుగా ఉంటుంది. ఏం రుచిలే! తల్చుకుంటే ఇప్పుడు గూడా నోట్లో నీళ్ళూరుతున్నాయి. ఇక గోంగూర, పండు మిరప కలిపి పెట్టిన పచ్చడిలో నెయ్యి వేసుకుని తింటే స్వర్గం బెత్తెడు దూరంలో వుంటుదన్నమాటే!’’ అని ఆమె గుంటూరు గోంగూరను పొగడ్డం మొదలుపెట్టింది.
‘‘అమ్మగారూ! పచ్చడి పెట్టుకోవడానికి గుంటూరు గోంగూర కావాలి. అంతేగా! ఇక నాకు వదిలేయండి. నేను తెప్పిస్తానుగా!’’ అని రంగనాయకులు హామీ ఇచ్చాడు.
‘‘డోండ్ బీ సీరియస్ రంగనాయకులూ! మా అమ్మ వాళ్ళది గుంటూరు. అందుకే గోంగూరని పొగుడుతుంటుంది..! నువ్వేం శ్రమ తీసుకోవద్దు. అక్కడ ఎవరికో చెప్పి తెప్పించడం అదీ వద్దు..’’ అన్నాడు మహేంద్రనాథ్.
రంగనాయకులు నవ్వి ఊరుకున్నాడు.
‘‘గోంగూరలో ఏదో ‘క్లూ’ దొరికింది అతనికి.
****
ఇంటికి వెళ్ళాక దామోదరానికి కాల్ చేశాడు రంగనాయకులు. తను కమీషనర్ ఇంటికి వెళ్ళడం, ఆయన తల్లి గుంటూరు గోంగూర కావాలని చెప్పడం అంతా వివరించాడు.
‘‘మామా!
గుంటూరునుంచి పెద్ద మోపుడు గోంగూర తెప్పించు’’ అన్నాడు.
‘‘అల్లుడూ! గోంగూరతో పనవుతుందంటావా?’’ సందేహంతో అడిగాడు దామోదరం.
‘‘ముందు తెప్పించు మామా! నేను అంతా చెప్తానుగా!’’ అన్నాడు రంగనాయకులు.
‘‘సరే.. సరే..!’’
‘‘ఫ్రెష్‌గా వుండాలి. రాత్రి బస్సులో వేయిస్తే తెల్లారేసరికి వస్తుంది. పదింటికంతా కమీషనర్ ఇంటికి చేర్చాలి’’.
‘‘ఓ.కె..’’ అన్నాడు దామోదరం.
ఈ గోంగూర సంగతేంటో అతనికి అర్థం కాలేదు.
తర్వాత దామోదరం గుంటూరు నుంచి గోంగూర తెప్పించాడు. రంగనాయకులు చక్కగా ప్యాక్ చేయించి కమీషనర్ ఇంటికి స్వయంగా తీసుకెళ్లి అందజేశాడు. కమీషనర్‌గారి తల్లి ఎంతగానో సంతోషించింది. రంగనాయకుల్ని బాగా మెచ్చుకుంది.
ఆ రాత్రి కమీషనర్ రంగనాయకులకి కాల్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మన్నాడు. అతను వెళ్ళేసరికి మహేంద్రనాధ్ హాల్లో కూర్చుని ఎదురుచూస్తున్నాడు.
‘‘రంగనాయకులూ! ఈ గోంగూర పంపించింది ఎవరు?’’ ప్రశ్నించాడు.
‘‘దామోదరం అని కాంట్రాక్టర్. నాకు చిన్ననాటి ఫ్రెండే. ఫ్యామిలీ ఫ్రెండ్స్ గూడా. ఎందుకు సార్? గుంటూరు నుంచి ఇంకా ఏమైనా మిర్చి, పసుపు కావాలా?’’
‘‘అబ్బే అదేం కాదు’’.
‘‘మరి ఏమిటి సార్?’’’
‘‘గోంగూర మా ఇంటికే అని చెప్పావా?’’
‘‘చెప్పాను సార్! ఇందులో రహస్యం ఏవుంది?’’
‘‘ఆ దామోదరానికి మనతో ఏదైనా పని వుందా?’’
‘‘ఎందుకు లేదు సార్! మున్సిపాల్టీ రద్దయి చాలాకాలమైంది. ఎప్పుడైనా ఎలక్షన్లు జరగవచ్చని పుకారు వుంది. ఎలక్షన్ల ముందు బి.టి. రోడ్లు వేయిస్తామని తెలుసుకదా సార్!’’
‘‘ఆఁ.. తెలిస్తే?’’
‘‘లాస్ట్ టరమ్‌లో ఆన్‌లైన్ టెండర్లు పిలిచి లోయస్ట్ కోట్ చేసిన వాళ్లకి పనులు ఇచ్చాం సార్! కాని అంతా నాసిరకం పనులు చేశారు సార్! మధ్యలో ఆపేసేవాళ్లు కొందరు. క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు గొడవ. బిల్లులు ఆలస్యమైపోతున్నాయని కంట్రాక్టర్ల ఏడుపు. అంతా రచ్చ రచ్చ అయింది సార్’’
‘‘సరే! ఐతే ఇప్పుడేంది?’’
‘‘మళ్లీ మామూలుగా టెండర్లు పిలవాలని కంట్రాక్టర్ల కోరిక. దామోదరం రింగ్ లీడర్ సార్!’’
‘‘అర్థమైంది. దామోదరం కంట్రాక్టర్లతో రింగవుతాడు. వాళ్ళు పనులు పంచుకుంటారు, అంతేగా?’’
‘‘అంతే! అంతే సార్!’’
‘‘మరైతే గోంగూర కట్టల్లో వెయ్యి రూపాయల కట్ట ఒకటే పెట్టారేమయ్యా? లక్షకి ఏమవుతుంది?’’ చెప్పాడు కమీషనర్.
‘‘అబ్బే! అది ఓన్లీ అడ్వాన్సు సార్! మీరు డేట్ చెప్తే నేను దామోదరంతో మీటింగ్ ఏర్పాటు చేస్తాను సార్!’’
‘‘ఇక్కడ వద్దయ్యా!’’
‘‘ఇక్కడ కాదు సార్! సింగపూర్, బ్యాంకాక్ ఎక్కడైనా సరే!’
‘‘బ్యాంకాక్ ఓ.కే.’’
‘‘్థంక్యూ సార్!’’ చెప్పాడు రంగనాయకులు ఆనందంతో.
*

-వాణిశ్రీ