ఈ వారం కథ

గాలి మళ్లిపోయింది (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాఘవరావుగారికి నిద్రపట్టడం లేదు. టైమెంతైందో తెలీటం లేదు. గదిలో వెలుగుతున్న గుడ్డి బల్బువల్ల గడియారంలో టైము తెలీటంలేదు.
‘సుజీ.. సుజీ. టైమెంతైంది.?’ నెమ్మదిగా పక్కనే పడుకున్న భార్యని తట్టి లేపుతూ అడిగారు.
‘‘అబ్బబ్బ.. యిప్పటికి యిది నాలుగోసారి అడగడం.. తెల్లవారితే నేనే లేపుతాగా.. నాకిప్పుడే నిద్ర పట్టింది.. అయినా లేచి చేసే నిర్వాకం ఏవిటంట..’ విసుక్కుంది ఆవిడ.
‘అదికాదు.. రేపేగా మనం మన యింటికి వెళిపోయేది..’ నసుగుతూ అన్నారు.
‘అవును రేపే.. తెల్లవారాలిగా.. అయినా వచ్చి వారం రోజులు కాలేదు.. అప్పుడే యింటిమీదకి గాలి మళ్లిపోయిందా? అయినా రావడం ఎందుకు.. వారానికే వెళ్లిపోవాలనుకోవడమెందుకు.. అనవసరంగా వాళ్లని యిబ్బంది పెట్టడం’. చిన్నాడితో గొప్పగా ‘ఈ మారు నెల్లాళ్లు వుంటామురా నీ దగ్గర’ అని చెప్పారు. దెప్పి పొడిచింది సుజాత.
‘అది కాదు సుజీ.. అప్పుడలా అనిపించింది. ఏమిటో ఇక్కడ వుండబుద్ధి కావడంలేదు’ నసిగారు. ఉదయం చిన్నాడితో ఆ మాటే అంటే మొదట ఆశ్చర్యపోయాడు. ‘ఈసారి నెల్లాళ్లు వుంటానన్నారుగా నాన్నగారూ. అప్పుడే వెళిపోతానంటారేం.. ఇక్కడ మీకేం యిబ్బందిగా లేదుగా..’ కంగారుగా అడిగాడు ఆయన చిన్నకొడుకు విశ్వం.
‘అబ్బేబ్బే.. ఇబ్బందేం లేదు..’ నసిగారు ఆయన.
‘అదేంటి మావయ్యగారూ.. నావల్ల ఏదన్నా పొరపాటు జరిగిందా..’ ఆందోళనగా అడిగింది చిన్నకోడలు శారద.
‘‘అబ్బే.. అలాంటిదేం లేదమ్మా..’
‘‘పోనీ పిల్లలేమన్నా.. మీకు అసౌకర్యం కలిగించారా?’ అడిగాడు విశ్వం.
‘్ఛ.. ఛ.. ఎంచక్కా వాళ్ళతో గడిపే సమయం తెలీకుండా గడిచిపోతుందిరా..’
‘ఉదయం పెందరాళే కాఫీ తాగి మార్నింగ్ వాక్కుకు కూడా వెళుతున్నారు’. ‘ఈ వాతావరణం ఎంతో బావుందిరా’ అంటూ పొగిడారు.. గుర్తుచేసాడు విశ్వం.
రాఘవరావుగారికి యిద్దరు మగ పిల్లలు, ఒక్కర్తే ఆడపిల్ల. అందరికి పెళ్లిళ్ళు చేసేసారు. రిటైర్ అయి సొంత యింట్లో భార్య సుజాతతో హాయిగానే గడిచిపోతోంది. ఒక్క పిల్లలే దూరంగా వున్నారన్న బెంగే ఆయనకి వుంది.
ఎప్పుడేనా పిల్లల దగ్గరికి వెళ్లాలనిపిస్తే.. ముందుగానే ప్లాన్ చేసుకుని ‘ఒరేయ్ .. నీ దగ్గర ఓ వారం.. అట్నుంచి అటే చిన్నాడి దగ్గరో వారం వుండి తిరుగు ప్రయాణం అయేలా టిక్కట్లు తియ్యండి’ అంటూ పెద్దకొడుకు శ్రీ్ధరంకి ఫోన్ చేస్తారు.
‘అలాగే నాన్నగారూ...’ అంటూ ఫోన్ పెట్టి తమ్ముడితో మాట్లాడి టిక్కట్లు తీస్తాడు పెద్దబ్బాయి శ్రీ్ధరం..
ప్రతిసారీ ఇలాగే జరుగుతోంది. ఆయనెక్కడా వారంపైగా ఎప్పుడూ వుండలేదు. రెండు నెలలు గడిచేసరికి మళ్లీ మామూలే...
‘ఒరేయ్.. సాగర్ పుట్టినరోజు వచ్చేనెల నాలుగోతారీఖున కదరా.. నేను మీ అమ్మ అప్పుడొద్దామని వుందిరా.. ఒరేయ్.. ఈ మారు నెల్లాళ్లు వుంటామురా నీ దగ్గర.. అందులో యిప్పుడు నువ్వు ఉద్యోగం కూడా మారేవు.. అక్కడ చాలా బావుందట కదా.. శారద చెప్పింది. ఫోన్లో పిల్లలు సంతోషంగా అక్కడ విషయాలు చెప్తుంటే.. మాకు మీ వూరు.. నీ కొత్త ఉద్యోగం చూడాలని వుంది’ అంటూ చిన్న కొడుకు విశ్వంకి ఫోనులో చెప్పారు.
‘అలాగే నాన్నగారూ.. సాగర్ పుట్టిన రోజుకి ముందుగానే మీరు, అమ్మ యిక్కడికి రండి. అన్నయ్యకి కూడా ఫోను చేస్తాను. వీలైతే వాళ్ల ఫ్యామిలీ కూడా అప్పటికి యిక్కడ వుండేలా చూడమని చెప్తాను. ఇకపోతే చెల్లీవాళ్ళు రాలేరేమో.. వాళ్ల అత్తగారికీమధ్య వంట్లో బావులేదట..’ అన్నాడు విశ్వం.
‘ఆ విషయం అది నాకు చెప్పలేదే..’ కూతురు అత్తగారికి వంట్లో బావులేదని తెలిసి గాభరాగా అన్నారు రాఘవరావుగారు.
‘అబ్బే మరేం భయపడవలసిందేం లేదు. ఈమధ్య వంట్లో నీరసంగా వుంటే డాక్టరు దగ్గరికి తీసుకెళితే.. మందులవీ రాసి, రెస్టు తీసుకోమన్నారట. అంతే.. అనవసరంగా దానికి ఫోను చేసి అడక్కండి. మీకు చెప్పినందుకు అది నన్ను తిడుతుంది’ అన్నాడు విశ్వం.
‘ఏవిటంటున్నాడు మీ చిన్నకొడుకు..’ ఆయన ఫోను పెట్టేసాక అడిగింది సుజాత.
‘మనమ్మాయి అత్తగారికి వంట్లో కాస్తంత నలతగా వుంటే డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళారట.. పెద్దగా గాభరాపడవలసిన విష యం కాదులే.. పెద్ద వయసుతో వచ్చే నీరసమే.. మనకి లేవూ...’ అంటూ చెప్పారు.
‘అది సరే.. ప్రయాణం విషయం ఏంటన్నాడు’ అడిగింది సుజాత.
‘సాగర్ పుట్టినరోజుకి ముందుగానే మనం అక్కడికెళ్లేలా టిక్కెట్లు పంపుతానన్నాడు. పెద్దబ్బాయి కూడా ఫామిలీ అక్కడకు ఆ సమయానికి రావచ్చట..’ చెప్పారు రాఘవరావుగారు.
‘పోనీలెండి.. వాళ్లు అక్కడికొచ్చేస్తే.. మనం మళ్లీ వాళ్ల వూరు అట్చుంచటు వెళ్లక్కర్లేదు. మీరన్నట్టు మనం నెల్లాళ్లపాటు చిన్నాడి దగ్గరే వుండి తిరిగి మన వూరు వచ్చేయవచ్చు..’ అంది సుజాత.
‘సరె.. సరె.. పిల్లలకి ఏవైనా తినడానికి నాలుగు రోజులకి సరిపడేలా తయారుచెయ్యి... పట్టుకెళదాం’ అన్నారు.
‘అక్కడికెళ్లాక చేసుకోవచ్చుగా.. కోడళ్లిద్దరూ కూడా సాయంగా వుంటారు.. పైగా నాకిప్పుడు ఓపిక లేదు..’ అంది సుజాత.
‘వెళ్లగానే పిల్లలు.. నానమ్మా... ఏం తెచ్చావ్.. అని మీద పడతారుగా..’ అన్నారు ఆయన.
‘అవుననుకోండీ.. ఈమారు నాకు ఓపిక లేదు..’ అంది ఆవిడ.
‘అలాగంటే ఎలా సుజీ.. నేను నీకు సాయం చేస్తానుగా.. జంతికలు చెయ్యి..’
‘ఏమిటీ మీరు నాకు సాయం చేస్తారా! నా కాళ్ళకడ్డం పడకుండా వుంటే అదే పదివేలు.. ఈలోగా మీరు మీ పనులవీ చేసుకోండి. నెల్లాళ్లు మనం యిక్కడ వుండమంటున్నారు. అద్దెకున్నవాళ్లకి మనింటి తాళాలు యిద్దాం. మధ్యమధ్య పనిమనిషి చేత తుడిపించమని చెప్దాం. లేకపోతే నెల తరవాత వస్తే.. ఈ యింటికి చాకిరీ చెయ్యలేక నేను చావాలి’ అంది సుజాత.
‘అలాగేలేవోయ్.. మంచి రోజు చూడు.. ఆ రోజుకి టిక్కెట్లు కొనమని చిన్నాడికి చెప్పొచ్చు..’
ప్రయాణం అనుకున్న రోజు రానే వచ్చింది. కొద్దిగా సామాన్లతో రైల్వే స్టేషన్‌కి బైల్దేరారు. సుజాత జంతికలు చేసి పట్టుకుంది. పెద్దబ్బాయి కూడా నాలుగు రోజులు అక్కడ తమ్ముడితో వుంటాడని తెలిసి యిద్దరూ సంతోషించారు.
స్టేషన్‌కి విశ్వం కారు తీసుకొచ్చాడు. సాగర్ కూడా వాళ్ల నాన్నతో స్టేషన్‌కి వచ్చాడు. అందరూ కార్లో యింటికి బైల్దేరారు.
‘ఊరికి దూరంగా వుందిరా మీ ఫాక్టరీ?’ అడిగారు ఆయన.
‘అవున్నాన్నగారూ.. వూరికి ఇరవై అయిదు కిలోమీటర్ల దూరం మా ఫ్యాక్టరీ.. ’ చెప్పాడు విశ్వం.
‘ఇల్లు అదీ సదుపాయంగా వుందా.. గాలీ వెలుతురూ బావున్నాయా? శారదెలా వుంది. చంటాడి అల్లరి తగ్గిందా..?’ ఆత్రంగా అడిగింది సుజాత.
‘అన్నీ చూద్దువుగాని కాస్త ఓపిక పట్టమ్మా’ నవ్వుతూ అన్నాడు విశ్వం.
‘కొత్త కారా..’ అడిగాడు రాఘవరావు.
‘అవును తాతగారూ.. ఆ డొక్కు కారు ఆ వూళ్లోనే వదిలేసాం’ సమాధానం సాగర్ చెప్పాడు.
‘మరి మాకు ఫోన్లో కూడా చెప్పలేదేంరా..’ అడిగింది సుజాత.
‘ఎలాగూ మీరొస్తున్నారుగా.. సస్పెన్స్‌లో వుంచమని.. సాగర్ చెప్పొద్దన్నాడు..’ విశ్వం అన్నాడు.
‘్భడవకానా.. మాతోటే పరాచికాలా..’ సుజాత ముద్దుగా మనవణ్ణి ముద్దాడింది.
‘నన్నీ కంపెనీ జనరల్ మేనేజర్‌గా ఇంటర్వ్యూకి పిలిచినపుడు ఫైనల్ రౌండ్‌లో కంపెనీ దగ్గర్లో ముఖ్యమైన ఉద్యోగులకి అన్ని సౌకర్యాలతో క్వార్టర్సు కట్టాలనే ఉద్దేశం వుంది.. దానికి మీ తరఫున ఒక రిపోర్టు ఇవ్వండి. అది కూడా మేము పరిశీలించి మీకు తెలియబరుస్తామన్నారు. నన్ను ఈ కంపెనీ జనరల్ మేనేజరుగా సెలెక్టు చెయ్యడంలో ముఖ్యంగా నేను యిచ్చిన రిపోర్టు బాగా పనిచేసిందని నాకు తరువాత తెలిసింది.
నా చిన్నప్పుడు మీరు చీఫ్ ఇంజనీరుగా పనిచేసిన కంపెనీ నేను ఆదర్శంగా (రోల్ మోడల్) తీసుకున్నాను. అప్పుడు నేను ఆ కంపెనీ ఉద్యోగస్తుల సౌకర్యాలన్నీ గమనించాను. అవే నా రిపోర్ట్‌లో యిచ్చాను. నా సూచనలు, సలహాలు వాళ్లకి నచ్చాయి. అందుకే ఫాక్టరీకి రెండు మైళ్ల దూరంలో అత్యవసరమనుకున్నవాళ్లకి క్వార్టర్సు కట్టేరు. మిగిలిన ఉద్యోగులు దగ్గర్లో వున్న వూరునుండి వస్తారు. వాళ్లకి డ్యూటీకి రావడానికి బస్సులు అన్ని షిఫ్టులకు వేసారు. వాళ్లకి వేరే రిక్రియేషన్ క్లబ్ కూడా ఏర్పాటుచేసారు.
ఇళ్లు కట్టిన పద్ధతి.. ముఖ్యంగా గాలీ వెలుతురు ధారాళంగా వుండేలా.. యింటికి యింటికి మధ్య విశాలమైన ప్రహరీ గోడ.. పూల మొక్కలు, పళ్ల చెట్లు వుండాలని.. చక్కటి లాన్ కూడా పెంచాలని.. అది కూడా ఆ యింటిలో నివాసముండే కుటుంబంవాళ్లే శ్రద్ధ తీసుకోవాలని, కంపెనీ వాళ్లు అప్పుడప్పుడు తినిఖీకి వచ్చి ఏ యింటి వాతావరణం ఎలా వుందో గమనించి మెరుగుపరిచే సలహాలు ఇవ్వాలని నా రిపోర్ట్‌లో సూచించాను.
అంతేకాకుండా ఆ క్వార్టర్సులో వుండేవాళ్లకి అన్ని రకాల సదుపాయాలు ఉండాలని.. దగ్గర్లో పిల్లలు ఆడుకోవడానికి, వాకర్సు క్లబ్బు, జిమ్ము, స్విమ్మింగ్ పూల్, యోగా సెంటర్లు, ఇంకా ఫంక్షన్లవీ జరుపుకోవడానికి మంచి హాలు.. ఒక్క మాటలో చెప్పాలంటే భూతల స్వర్గం అనిపించేలా వుండాలి. ఉద్యోగస్తులు.. వాళ్ళ కుటుంబాలు సంతోషంగా వుంటే.. కంపెనీకి మంచి ఉత్పత్తి, లాభాలు సమకూరుతాయి.
కంపెనీ వాళ్లు నా సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకున్నారు. చక్కటి కాలనీ సమకూర్చారు. మీరూ చూస్తారుగా.. అక్కడి వాతావరణం అదీ ఎంత బావుంటుందో..’ అని చెప్పాడు విశ్వం.
‘అవును.. నాకిప్పుడు నేను మొదట్లో పనిచేసిన కంపెనీ గుర్తుకొస్తోంది. ఆ రోజుల్లో నువ్వు నాతో పాటుగా అన్ని పంక్షన్లకి వచ్చేవాడివి. మనం కొన్నాళ్లు కంపెనీ ఇచ్చిన క్వార్టర్సులో వుండేవాళ్లం, మనం సొంతిల్లు కట్టుకునే ముందు. సొంతిల్లు తయారయ్యాక మనింటికి మారిపోయాం. అవన్నీ యిపుడు గుర్తుకొస్తున్నాయి’ అన్నారు రాఘవరావుగారు.
మాటలతోటే దూరం తెలీలేదు.
ఆ మర్నాడు పెద్దబ్బాయి శ్రీ్ధరం పెళ్లాం పిల్లలతో వచ్చాడు. అందరూ సంతోషంగా సాగర్ పుట్టిన్రోజు జరుపుకున్నారు ఆ మర్నాడు. అమ్మాయి ఫోన్లోనే మాట్లాడింది. ఆ మర్నాడు శ్రీ్ధరం ఫ్యామిలీతో వెళ్లిపోయాడు సెలవు లేదంటూ. పిల్లలు కూడా నిరుత్సాహంగా బైల్దేరారు.
‘ఈమారు మావూరు రావటంలేదా నాన్నగారూ..’ అని అగాడు వెళుతూ..
‘లేదురా.. ఈమారు యిక్కడ నెల్లాళ్లు వుండాలని మీ నాన్నగారు అన్నారు’ అంది సుజాత.
ఆ మర్నాడే విశ్వంతో ‘ఒరేయ్.. మేము మనింటికి వెళిపోతామురా..’ అంటూ నెమ్మదిగా అన్నారు రాఘవరావుగారు.
‘తెల్లారింది.. లేవండి.. రాత్రంతా నన్ను సతాయించారుగా..’ అంటూ తట్టి లేపింది సుజాత.
ఆయన ఎంతకీ లేవకపోతే గాభరా పడింది సుజాత. తెల్లవారు ఝామునే మంచి నిద్ర పట్టినట్లుంది రాఘవరావుగారికి. సుజాత తట్టి లేపగానే గభాలున లేచారు..
‘అదేమాటా మీది.. బట్టలవీ సర్దేయమంటారా’ అడిగింది సుజాత.
వౌనంగా తయారయ్యారు రాఘవరావుగారు.
‘నాన్నగారూ వెళిపోతారా’ చివరిసారిగా అడిగాడు విశ్వం.
‘ఈమారు వచ్చినప్పుడు ఎక్కువ రోజులు వుంటాంలేరా..’ ఎటో చూస్తూ అన్నారు రాఘవరావుగారు.
‘మామయ్యగారు.. ఆరోగ్యం జాగ్రత్త.. మీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు మళ్లీ రండి’ అంది కోడలు శారద.
పిల్లలు దిగులుగా సాగనంపారు. విశ్వం కారు తీశాడు. రాఘవరావుగారు, సుజాత వౌనంగా కారెక్కారు. *

-అంగర వెంకట శివప్రసాదరావు రచయిత సెల్ నెం:9393101132