ఈ వారం కథ

విత్తనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మా! అమ్మా! నేను స్కూల్‌కు వెళ్లను’ అన్నాడు రాహుల్
‘ఎందుకు ఏమైంది ’అడిగింది శాంతి
‘కార్తిక్ ఈరోజు అందరికీ చాక్లెట్స్ ఇచ్చాడు. అందుకని మిగతా వాళ్లందరూ వాడి దగ్గరే ఉన్నారు. నాతో ఎవరూ మాట్లాడలేదు. పైగా వాడు నా దగ్గరకు వచ్చి చూశావా నేను రోజూ వీళ్లందరికీ చాక్లెట్స్ ఇస్తాను. ఎప్పుడూ వీళ్లందరూ నా దగ్గరే ఉంటారు. నీతో ఎవరూ మాట్లాడరు.’అన్నాడు
నేను ‘నేను కూడా రేపు చాక్లెట్స్ ఇస్తాను. అపుడు నువ్వు కూడా నా దగ్గరికే వస్తావు’ అని అన్నాను.
కానీ వాడు‘అట్లా నీవు ఒక్కరోజు ఇవ్వగలవు. నేనైతే రోజూ ఇస్తాను. మేము ధనవంతులం. మీ అమ్మనాన్న చిన్న ఉద్యోగంలో ఉన్నారు. కనుక నువ్వు అట్లా ఇవ్వలేవు. నాకైతే మా అమ్మ నాన్న ఇద్దరూ పెద్ద ఉద్యోగంలో ఉన్నారు కదా. రోజూ నాకు డబ్బులు ఇస్తారు. మా అమ్మే ఈ విషయం చెప్పింది. కనుక మీ అమ్మ నీకు డబ్బులు ఇవ్వదు’ అన్నాడు.
నేను ఏమీ మాట్లాడలేక వౌనంగా వచ్చేసాను. ఆలోచించాను. నిజమే కదా. మీరిద్దరూ చిన్న ఉద్యోగం చేస్తున్నారు కదా. ఎపుడూ డబ్బులు లేవు అనుకొంటూ ఉంటారు కదా అన్నాడు రాహుల్
శాంతికి ఒక్కక్షణం ఏమీ తోచలేదు.
తర్వాత రాహుల్‌కి సర్దిచెప్పి స్కూల్‌కు పంపించింది. మామూలుగాతన ఆఫీసుకు వెళ్లింది. శాంతి పనిచేసే చోటే కార్తిక్ వాళ్ల అమ్మ మేనేజర్‌గా చేస్తోంది. శాంతి పక్క సెక్షన్‌లో ఉంటుంది కాని కంప్యూటర్ పోగ్రామర్‌గా పనిచేస్తుంది. కనుక కార్తిక్ అమ్మ మనస్తత్వం గురించి కొద్దిగా తెలుసు. అయినా తాను ఏం చేయగలదు అనుకొని తన పని చేసుకొంటూ ఉండిపోయింది.
మరుసటి రోజు మళ్లీ రాహుల్ ముఖం చిన్నబుచ్చుకుని వచ్చాడు. ఏంటిరా అంటే కథ మళ్లీ మామూలే. అట్లా కాదనుకొని పిల్లలందరినీ రేపు నీ పుట్టిన రోజు కదా మనింటికి పిలువు. మంచి ఆరేంజ్‌మెంట్స్ చేస్తాను. వాళ్లకు మంచి కథ కూడా చెప్తాను. అప్పటి నుంచి వాళ్లు నీకు ఫ్రెండ్స్ గా ఉంటారులే. అయినా నువ్వు ఏదైనా ఇస్తే ఫ్రెండ్‌షిప్ చేస్తాం అంటే అది స్నేహం కాదురా’ అంటూ ఎంతో సేపు స్నేహం గురించి చెప్పింది. అప్పటికి తలూపి వెళ్లాడు రాహుల్.
శాంతి తన భర్తతో మాట్లాడి కార్తిక్ అమ్మనాన్నలను కూడా తమ ఇంటికి రాహుల్ పుట్టిన రోజు అని పిలిచారు.
ఆ వేడుకలకు రాహుల్ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. పిల్లలంతా కలసి మెలసి చక్కగా పుట్టిన రోజుకు రాహుల్ చేత కేక్ కట్ చేయించారు. పిల్లలంతా స్వీట్స్ హాట్స్ తిని కూల్‌డ్రింక్స్ తాగి అందరూ సంతోషంగా ఉన్నారు.
అపుడు శాంతి వారినందరినీ కూర్చోబెట్టుకొని వేటగాడు దగ్గర నుంచి తప్పించుకున్న పావురాళ్ల కథ చెప్పింది. చివరల్లో స్నేహం అంటే ఏమిటో వారి చిన్నప్పటి నుంచో ఎలా ఉండాలో ఏట్లాంటి స్నేహం చేయాలో అన్నీ చెప్పింది. అందరు పిల్లలూ సంతోషంగా విన్నారు. అందరూ మంచిస్నేహితుల్లా ఉంటామని చెప్పారు. వారందరి మధ్య ఉన్నకార్తిక్ మాత్రం లేచి ‘‘ఆంటీ నువ్వు మంచిది దానివి కావని మా అమ్మ చెప్పింది. అందుకే మీకు డబ్బులు లేవని కూడా చెప్పింది. రాహుల్‌తో స్నేహం చేయద్దు అని మా అమ్మ చెప్పింది. ఇప్పుడు మేము మీరు మమ్ముల్ని చూసి ఏడవకుండా ఉండాలని వచ్చాము అంతే ’అన్నాడు.
ఆ మాటలు విన్న వారంతా ఒక్కసారిగా కార్తిక్ అమ్మవైపు చూశారు. ఆమెకు ఏం చేయాలో తోచలేదు.
శాంతికి ఒక్కసారిగా ఆమె పై ఉన్న లేశమాత్రపు అభిమానం అంతరించుకుపోయింది. కార్తిక్ వాళ్ల అమ్మ గబగబా ముందుకు వచ్చి ‘ఏ కార్తిక్ ఏం మాట్లాడుతున్నావు. నేను ఇవి అన్నీ నీకు ఎపుడు చెప్పాను. అన్నీ అబద్దాలు చెబుతున్నావు. అట్లా మాట్లాడకూడదు’అంది.
వాడు ‘అదేంటి అమ్మా. నువ్వే కదా చెప్పావు వీళ్లింటిలో అందరూ చెడ్డవాళ్లే ఉన్నారు. రాహుల్ తో స్నేహం చేయొద్దు అని అన్నావు కదా ’అని వాడు నిలదీస్తున్నాడు.
‘నేను చెప్పింది ఈ రాహుల్ గురించి కాదు నాన్నా. ఇంతకుముందు ఉన్న మనం ఆ బెంగుళూర్‌లో ఉండేవాళ్లం .. అక్కడ.. ’ఇంకా ఏదో చెబుతూ వాడ్ని బులింపుచ్చడానికి మాటలు చెబుతోంది.
విత్తనం ఏది వేస్తే ఆ చెట్టే వస్తుంది. అంతేకాని వేప చెట్టు వేసి మల్లెపూలు పూయమంటే పూస్తాయా? అని శాంతి అనుకొంది.
పిల్లలంతా రాహుల్‌కు బాయ్ చెప్పి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. రాహుల్ మాత్రం మూఢీగా ఉండి పోయాడు. అంతలో కార్తిక్ వచ్చి ‘సారీరా! నేను నీకు మంచి ఫ్రెండుగా ఉంటాను. మీ అమ్మ, మా అమ్మ ఇద్దరి మాటలు విన్నాను. నేను నిర్ణయంచుకున్నాను’ అన్నాడు.
రాహుల్ విచిత్రంగా నవ్వు, ఏడుపు కలిపి చూస్తున్నాడు.
కార్తిక్ చిన్న చిరునవ్వుతో ‘సరేలే. రాహుల్ అసలు మనం ఈ పెద్దవాళ్ల మాటలు పట్టించుకోకుండా మనం మనం హాయిగా ఉందాం. ఎప్పుడూ మన మధ్యకు పెద్దవాళ్లను రానివ్వను’ అంటూ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వారిద్దరూ హాయిగా నవ్వుతూ ముందుకు వెళ్లారు.

- మానస