పశ్చిమగోదావరి

కత్తి కడితే ఖబడ్దార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకివీడు పోలీసుల సంక్రాంతి ముందస్తు జాగ్రత్తలు: ఎనిమిది మంది ‘కత్తుల రత్తయ్యలు’ బైండోవర్
ఆకివీడు, డిసెంబర్ 18: సంక్రాంతి సందర్భంగా చోటుచేసుకునే కోడిపందాల నిరోధానికి పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. కోడిపందాల్లో కీలకమైన కత్తులు కట్టేవారిని అదుపులోకి తీసుకుని, వారి నుండి భారీగా కత్తులు స్వాధీనం చేసుకుంటున్నారు. జిల్లాలో కోడిపందాలకు పేరొందిన ఆకివీడు ప్రాంతం నుండే ఈ చర్యలకు శ్రీకారం చుట్టడం విశేషం. ఆకివీడు మండలంలోని అయిభీమవరం, తాళ్ళకోడు, దుంపగడప, ఆకివీడు ప్రాంతాలకు సంబంధించి కోళ్లకు కత్తులు కట్టే ఎనిమిది మందిని పోలీసులు బైండోవర్ చేసుకున్నారు. వారి నుండి 200 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. సంక్రాంతి సందర్భంగా కోళ్లకు కత్తులు ఎవరైనా కడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై కడియాల అశోక్‌కుమార్ హెచ్చరించారు. అనంతరం కత్తులు కట్టేవారిని రూ.లక్ష మేర పూచికత్తుపై విడుదల చేశారు. అయితే వీరిలో ఎవరైనా కత్తులు కట్టినట్లు తెలిస్తే వీరి నుంచి రూ. లక్ష వసూలు చేసి, కేసులు పెడతామని ఎస్సై తెలిపారు. సంక్రాంతి నేపథ్యంలో కోడిపందాలు, జూదాలు ఆడేవారిని బైండోవర్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. ఇప్పటికే ఆయాగ్రామాల్లో విఆర్వోల, గ్రామపెద్దలను జూదాలు ఆడేవారి వివరాలు అందించాలని కోరామని ఎస్సై అశోక్‌కుమార్ తెలిపారు. ఈకార్యక్రమంలో రైటర్ కోళ్ల శ్రీనివాస్, కానిస్టేబుల్ భాను, నాగేశ్వరరావు తదితరులున్నారు.