పశ్చిమగోదావరి

ఉద్యోగులకు, ఉపాధ్యాయలకు సొంత గృహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొల్లు, ఏప్రిల్ 9: తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సొంత గృహాలు నిర్మించుకునేందుకు ఒక పథకం ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. పాలకొల్లు గాంధీ బొమ్మల వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఉద్యోగులతో సమాన వేతనం ఇవ్వడానికి ఒక కమీషన్ ఏర్పాటు చేస్తానని, తాను అధికారంలోకి రాగానే 33 శాతం ఇంటీరియం రిలీఫ్ ఇస్తానని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించి దశలవారీగా వారిని ప్రభుత్వ ఉదోగులుగా చేస్తానని వెల్లడించారు. కేసీఆర్ అంటే తనకు గౌరవమని, కాని ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించమని ఆయన హెచ్చరించారు. గత ఐదేళ్లుగా చేస్తున్న ప్రత్యేక హోదా పోరాటంలో పార్లమెంటులో ఒక్కసారి కూడా మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు హోదాకు మద్దతు ఇస్తామంటున్నారని ఆయన విమర్శించారు. రాయలసీమ అంటే రత్నాల సీమని, రాయలు పరిపాలించిన ప్రాంతమని, అక్కడ కవులు, సంస్కృతి చాల గొప్పదని, అయితే జగన్ కుటుంబంతోనే ఈ ప్రాంతమంతా ఫ్యాక్షన్ ప్రాంతంగా మారిందని పవన్ విమర్శించారు. సొంత ఇంటిలో హత్య జరిగితే రక్తమరకలు కనిపించకుండా చేయటమేమిటో వారే చెప్పాలన్నారు. చెప్పులు విడవకుండా తిరుమల వెంకన్నను దర్శనం చేసుకున్న జగన్‌ను దేవుడు ఎందుకు దీవిస్తాడని ఆయన ప్రశ్నించారు. సంప్రదాయాలను, సంస్కృతిని కాపాడటం కూడ నేర్చుకోవాలి కదా అని జగన్‌ను ఆయన ప్రశ్నించారు. ఆంధ్ర రాజకీయాలలో ఒక నేరస్ఢుడికి కేసీఆర్ ఎందుకు అండగా నిలిచారని ఆయన ప్రశ్నించారు. పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు ఓటర్లను బెదిరించి ఎవరి మీటింగులకు వెళ్లవద్దని, ఓటు వేయవద్దని భయపెడుతున్నారని, హద్దు దాటితే తగిన గుణపాఠం చెబుతామని పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. ఒక మంచి వ్యక్తిగా ఉన్న డాక్టర్ బాబ్జి మురుగుకాల్వలో మంచినీరు పోసినట్లుగా నేరస్థులకు అండగా వెళ్లటంతో ఆయన పెద్దరికం ఏమైందని, తలమెరిసిన వారు ఇలా చేయవచ్చా అని ఆయన ప్రశ్నించారు. తాను పార్టీని ఎన్నో కష్టాలు ఎదుర్కొని పెట్టానని, చిరంజీవీ పార్టీ పెట్టినప్పుడు నమ్మిన వారందరూ పార్టీకి ద్రోహం చేయటం వల్ల ఆయన పార్టీని వదిలేశారని, నాటిచెంచాలే నేడు తన వద్దకు వచ్చారని వద్దని చెప్పటంతో తిరిగి టీడీపీలోకి వెళ్లి పోయారని ఆయన వెల్లడించారు. పాలనలో మార్పు తేవాలని కోట్ల సంపాదనను వదులుకొని వచ్చానని, తన వద్ద సొమ్ము లేక పోయినా జనసేన కార్యకర్తలు, అక్కాక్కచెళ్ళల్లు, తల్లులు తనకు అండగా ఉన్నారని చెప్పారు. ఏ పార్టీ వారు ప్రకటించిన మేనిఫెస్టోలు చూసి నమ్మవద్దని, వాటికన్నా తానే పది రూపాయలు ఎక్కువ ఇస్తానని ఆయన చెప్పారు. చిరు వ్యాపారులకు రూ. 10 వేలు రికరింగ్ రుణాలు ఇస్తామన్నారు. విద్య, వైద్య అందరికీ అందాలని, ప్రజలకు నీతివంతమైన పాలన ఇవ్వాలని వచ్చానని ఆయన చెప్పారు. తెలుగుదేశం అవినీతిలో మునిగిపోయిందని, పంచ భూతాలను కాజేశారని, నీరు, భూమి, ఇసుక అన్నిటా ముడుపుల కంపు కొట్టిందని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి సంవత్సరానికి ఆరు నుండి పది గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. రైతులకు ప్రతి సంవత్సరం 8వేలు ఇస్తామని, పేద రైతులకు రూ. 5 వేలు పింఛను ఇస్తామన్నారు. పాలకొల్లులో ఉన్న డంపింగ్ యార్డు మూడు నెలలో తొలగిస్తామని, విజ్జేశ్వరం నుండి పైపులైను ద్వారా మంచినీరు అందిస్తామని, వంద పడకల అసుపత్రి మంజూరు చేయిస్తానని ఆయన చెప్పారు. నర్సాపురంలో చిన్నప్పుడు మారిపోతే చిన్న వ్యాపారి తనను కాపాడాడని, చిన్న వ్యాపారులకు కూడ తాను అండగా ఉంటానని ఆయన చెప్పారు. వైసీపీలో పనిచేసే మంచి కార్యకర్తకు టిక్కెట్టు ఇవ్వలేదని తెలిసిన జనసేన కార్యకర్తలు తమకు సీటు ఇవ్వటం కన్నా మంచి వ్యక్తికి సీటు ఇవ్వాలని చెప్పడంతో గుణ్ణం నాగబాబుకు టిక్కెట్ ఇచ్చామని, ఆయన బాగా పనిచేస్తున్నారని చెప్పారు. తన సోదరుడు నాగబాబును ఆహ్వానించిన వెంటనే నర్సాపురం పార్లమెంటుకు పోటీ చేయటానికి అంగీకరించారని, తనకు గురువు మార్గదర్శకుడిని పార్లమెంటుకు పంపాలని, అసెంబ్లీకి, పార్లమెంటుకు ఉన్న ఇద్దరు నాగబాబుల విజయానికి గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపించారని పవన్‌కల్యాణ్ అభ్యర్థించారు. ఈ సభలో ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ పాల్గొనటంతో యువతలో ఆనందం వెల్లివిరిసింది. పార్లమెంటు అభ్యర్థి నాగేంద్రబాబు, అసెంబ్లీ అభ్యర్థి గుణ్ణం నాగబాబు, జనసేన నాయకులు చేగొండి సూర్యప్రకాష్, అల్లు రాథాకృష్ణ, పోలిశెట్టి చంద్రశేఖర్, నల్లమోతు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.