బిజినెస్

7న ‘కింగ్‌ఫిషర్’ ఆస్తుల ఈ-వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 21: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చెందిన దేశీయ ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పలు స్థిర, చరాస్తులను బ్యాంకులు వచ్చే నెల 7న ఈ-వేలం వేయనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమి శనివారం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. దాదాపు 8,000 కోట్ల రూపాయల మేర బ్యాంకులకు బకాయిపడ్డ కింగ్‌ఫిషర్.. ప్రస్తుతం విమానయాన సేవలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.