బిజినెస్

చెక్కు బౌన్స్‌ కేసుల్లో కింగ్‌ఫిషర్‌ మాజీ సీఎఫ్‌వోకు 18 నెలల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: కింగ్‌ఫిషర్‌ మాజీ సీఎఫ్‌వో రఘునాథన్‌కు రెండు చెక్కు బౌన్స్‌ కేసుల్లో మూడో ప్రత్యేక న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షను గురువారం విధించింది. జైలు శిక్షతోపాటు రూ.20,000 జరిమానా కూడా విధించారు. జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి కింగ్‌ఫిషర్‌ ఇచ్చిన రెండు చెక్కులు బౌన్స్‌ కాగా, వ్యాపారవేత్త విజయ్‌మాల్యా, రఘునాథన్‌లపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు పలుమార్లు వాయిదా పడింది. ఎర్రమంజిల్‌లోని మూడో ప్రత్యేక న్యాయస్థానం మేజిస్ట్రేట్‌ ఎం. కృష్ణారావు ఈ తీర్పును వెలువరించారు. తీర్పుపై రఘునాథన్‌ పైకోర్టులో అప్పీలుకు వెళ్లవచ్చని మేజిస్ట్రేట్‌ పేర్కొన్నారు.