గుంటూరు

279 జీవో రద్దు కోరుతూ మునిసిపల్ కార్మికుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట): మునిసిపల్ కార్మికుల హక్కులను కాలరాసే జీవో నెంబర్ 279ని రద్దు చేయాలంటూ పారిశుద్ధ్య కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి కమిషనర్ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ 279 జీవోను తీసుకువచ్చి బడా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం టెండర్లు అప్పగించే పనిలో నిమగ్నమైందన్నారు. రాష్టవ్య్రాప్తంగా మునిసిపల్ కార్మికులు ధర్నాలకు దిగి పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవడం అమానుషమన్నారు. చాలీచాలని జీతాలతో కాలం వెళ్లబుచ్చుతున్నారని, వీరికి వెంటనే జీతాలను పెంచి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ అట్టడుగువర్గాలైన పారిశుద్ధ్య కార్మికులు గత కొంతకాలంగా సమ్మె చేస్తున్నప్పటికీ రాష్ట్రప్రభుత్వం పట్టించుకోక పోవడం అమానుషమన్నారు. ఎఐటియుసి నగర కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా కార్పొరేట్, ప్రైవేటు రంగ సంస్థలకు తొత్తులుగా వ్యవహరిస్తూ కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. ధర్నాలో యూనియన్ నాయకులు మేకల నరసింహులు, కోటి వీరాంజనేయులు, ఎలీషారాణి, హుస్సేన్, కృష్ణయ్య, బుజ్జి, నాగేంద్రం, విజయకుమారి, సుబ్రహ్మణ్యం, పారిశద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.