బిజినెస్

మాటలు ఘనం.. చేతలు పూజ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 19: ముంబయిలో గురువారం ముగిసిన ‘మేక్ ఇన్ ఇండియా’ ఫెయిర్‌లో భారీగా 222 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు అవగాహనా ఒప్పందాలు (ఎంఓయులు) కుదిరాయి. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమై వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి విదేశీ సంస్థల హాజరు పలుచగా ఉండటాన్ని చూస్తుంటే పైన పేర్కొన్నంత భారీ మొత్తంలో పెట్టుబడులు రాకపోవచ్చని స్పష్టమవుతోంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు దేశంలో ఇప్పటివరకూ నిర్వహించిన కార్యక్రమాల్లో ముంబయి జంబోరీయే అతిపెద్దది. గుజరాత్‌లో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘వైబ్రెంట్ గుజరాత్’ పేరుతో ఆయన ప్రారంభించిన కార్యక్రమంలో కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడులకు హామీలు వచ్చినప్పటికీ వాటిలో కేవలం 13 శాతం మాత్రమే కార్యరూపం దాల్చినట్లు స్వతంత్ర సర్వే స్పష్టం చేసింది.
కాగా, ప్రస్తుతం ముంబయి ‘మేక్ ఇన్ ఇండియా’ ఫెయిర్‌లో మొత్తం 15.2 ట్రిలియన్ రూపాయల (222 బిలియన్ డాలర్ల) పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని డిఐపిపి (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్) కార్యదర్శి అమితాబ్ కాంత్ వెల్లడించారు. అయితే ఏడాది క్రితం గుజరాత్‌లో కేవలం మూడు రోజుల పాటు నిర్వహించిన ‘వైబ్రెంట్ గుజరాత్’ కార్యక్రమంలో 25 ట్రిలియన్ రూపాయల పెట్టుబడులకు అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. వీటితో పోలిస్తే ముంబయి ‘మేక్ ఇన్ ఇండియా’ ఫెయిర్‌లో కుదిరిన అవగాహనా ఒప్పందాల విలువ చాలా తక్కువ. అయితే పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇప్పటివరకూ ఆసియా ఖండంలో నిర్వహించిన కార్యక్రమాలన్నింటి కంటే ముంబయిలో నిర్వహించిన ‘మేక్ ఇన్ ఇండియా’ ఫెయిర్ అతిపెద్దదని, ఈ కార్యక్రమంలో విదేశీ పెట్టుబడిదారులే అధిక మొత్తంలో ఎంఓయులు కుదుర్చుకున్నారని, వీటిలో 80 నుంచి 85 వరకు కార్యరూపం దాలుస్తాయని భావిస్తున్నానని అమితాబ్ కాంత్ తెలిపారు. ఎంఓయులు కార్యరూపం దాల్చి పెట్టుబడులుగా మారేందుకు 18 నెలల నుంచి మూడేళ్ల వరకు సమయం పడుతుందని ఆయన చెప్పారు.
అయితే ఇప్పటివరకూ భారత్‌లో ఇటువంటి అవగాహనా ఒప్పందాలు పెట్టుబడులుగా మారడం చాలా తక్కువగా జరుగుతోందని, ఏ రాష్ట్రంలోనూ 20 శాతం కంటే ఎక్కువ ఎంఓయులు పెట్టుబడులుగా మారలేదని ‘ఫ్రైడ్‌రిచ్ నౌమన్, కాటో ఇన్‌స్టిట్యూట్స్’ నిర్వహించిన పరిశోధనలో తేలింది.
ముంబయి ‘మేక్ ఇన్ ఇండియా’ ఫెయిర్‌లో అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేసిన సంస్థల్లో అంతర్జాతీయ ఐటి దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఒరాకిల్ కార్పొరేషన్ ఒకటి. తొమ్మిది ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని ఆ సంస్థ ఎంఓయు కుదుర్చుకుంది. ముంబయిలో ‘మేక్ ఇన్ ఇండియా’ ఫెయిర్ చాలా చక్కగా జరిగిందని ఆ కార్యక్రమంలో పాల్గొన్న కొంత మంది ప్రశంసిస్తున్నప్పటికీ, ఈ కార్యక్రమంలో విదేశీ పెట్టుబడిదారులు పెద్దగా పాల్గొనలేదని చాలా మంది పెదవి విరుస్తున్నారు. ‘ముంబయిలో మేక్ ఇన్ ఇండియా ఫెయిర్‌కు విశేష స్పందన వచ్చింది. కానీ అదంతా భారతీయుల నుంచే. ఈ కార్యక్రమంలో ఎటుచూసినా భారతీయులే కనిపించారు. సాధారణంగా జర్మనీలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు స్టాళ్లన్నీ విదేశీయులతో కిటకిటలాడుతుంటాయి’ అని జర్మన్ తయారీ సంస్థ ‘స్నైదర్ ఇంటర్నేషనల్’ ప్రతినిధి ఇంగో ఇబ్బెక్ తెలిపారు.
రూ.30 వేలకోట్ల ఒప్పందాలు
కుదుర్చుకున్న సిడ్కో
థానే: ముంబయిలో ముగిసిన ‘మేక్ ఇన్ ఇండియా’ వారోత్సవంలో మహారాష్ట్ర సిడ్కో (సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) భారీ మొత్తంలో 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అవగాహనా ఒప్పందాలు (ఎంఓయులు) కుదర్చుకుంది. వీటిలో ఖలాపూర్ స్మార్ట్ సిటీతో పాటు ‘నైనా’ (నవీ ముంబయి ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ నోటిఫైడ్ ఏరియా) ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధించిన ఎంఓయులు ఉన్నాయని సిడ్కో ఎండి, వైస్-చైర్మన్ సంజయ్ భాటియా తమ సంస్థ ప్రధాన కార్యాలయంలో విలేఖర్లకు తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఈ అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నామని ఆయన చెప్పారు.