మంచి మాట

కష్ట్ఫేలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రమకు తగిన ఫలితం ఎపుడూ ఉంటుంది. శ్రమ వలన ఏ మనిషికైనా విజయం లభిస్తుంది. ఆయువు, ఆరోగ్యము కూడా శ్రమ వల్లే లభిస్తాయి. మంచి ఆలోచనలతో కూడిన శ్రమ ఎన్నో నూతన ఆవిష్కారములకు పునాది అవుతుంది. సామాన్య మానవుడు తన జీవితంలో కష్టపడకుండా సుఖపడడానికి సులభమార్గాలను అనే్వషిస్తుంటాడు. శాస్తవ్రేత్తలు, ఆధ్యాత్మిక వేత్తలు, మంత్రాంగం, యంత్రాంగం నిర్వహించే వారు, చక్రవర్తులు ఎవరైనా సరే శ్రమ ఏవ జయతే అను ఆర్షవాక్యములను విశ్వసించి అనుసరించి తమ తమ రంగములలో రాటుదేలి శాశ్వత కీర్తిని ఆర్జించినారు. శ్రమ పట్ల భక్తి శ్రద్ధ నమ్మకం ఉంచితే విజయం తథ్యం అని రమణ మహర్షి అనేకమార్లు తన శిష్యులకు తెలిపేవారు. ఈవిషయాన్ని తెలిపే కథనొకటి రమణుల వారు ఇలా చెప్పారు.
పూర్వము సముద్ర తీర ప్రాంతమునందు గొప్ప అడవి ఉండేది.అందులోని ఒక చెట్టుపై పిచ్చుక ఒకటి ఉండేది. చాలా రోజులకు ఆ పిచ్చుక ఒక గుడ్డు పెట్టింది. పిచ్చుక ఆనందానికి అవధులు లేవు. ఆ గ్రుడ్డును చాలా చాలా జాగ్రత్తగా చూచుకుంటోంది. ఒక సారి ఎడతెరిపి లేకుండా వానలు కురిసాయి. ఆ వానలకు ఆ పిచ్చుక గూడు చెదిరింది. తను కన్ను గుడ్డు ఎచట చెడిపోతోంని అనుమానము వచ్చింది. అందుకని గుడ్డును ముక్కున కరచుకుని సురక్షిత ప్రదేశమునకు బయలుదేరింది. ఎంత వెతికినా దానికి సురక్షిత ప్రదేశము దొరకలేదు. ఇంతలో నోట కరుచుకున్న పిచ్చుక గుడ్డు నీటిలో జారి పడిపోయింది.
ఆ గుడ్డును నీటి పాలైనందుకు ఎంతగానో కుమిలిపోయింది. లేక లేక పెట్టిన గుడ్డు నీటిపాలైంది. దాన్ని వదిలి వేరే చోటికి వెళ్లవలసి వచ్చిందని అమితంగా దుఃఖిస్తూ అక్కడే కూర్చుని బాగా ఆలోచించి చూడగా గుడ్డు పడిపోయిన నీరు ఒక సముద్రంగా పిచ్చుక తెలుసుకొంది. ఈ సముద్రపు నీటినంతా మరొక చోట పోసేస్తే అడుగున పడిపోయిన నా గుడ్డును నేను తిరిగి పొందవచ్చుననుకొంది. వెంటనే సముద్రం నీటిని తీరం ఇవతల పోయడానికి బయలుదేరింది. నీటిలో మునిగింది. నోటిలో నీరు పట్టింది. ఇవతల వచ్చి తన శరీరాన్ని విదిల్చి కొంత, తన నోటిలో నీరును ఉమ్మివేసి మరికొంత నీటిని సముద్రం నుంచి వేరు చేయసాగింది. ఇలా చేయడం కూడా వున్న పిచ్చుకలన్నీ చూచాయి. ఆ పిచ్చుక చేసే పని పిచ్చిదని సముద్రపు నీరును తోడి వేయడం చాలా కష్టమని ఆ పిచుకకు హితవు చెప్పాయి.
ఆ సమయంలోనే నారదుల వారు వచ్చారు. పిచ్చుక కఠోర దీక్షతో చేసేపనిని చూశాడు. పిచుక పై జాలి పడ్డాడు. వృథాశ్రమ చేస్తున్నావెందుకు అని అడిగాడు. దానికా పిచ్చుక నారదుల వారు మీరు అన్ని తెలిసిన వారు. నా పని నేను చేస్తున్నాను. ఫలితం దేవుని ఇష్టం. నేను శ్రమ పడడం మాత్రం నా విధి కనుక నేను చేస్తున్నాను అనిచెప్పింది. నారదుడు మెచ్చుకుని నీవు అనుకొన్నట్లు చేయి అని చెప్పి అక్కడనుంచి వైకుంఠానికి వెళ్లి మహావిష్ణువు పిచ్చుక సంగతి చెప్పాడు. దానికా మహావిష్ణువు గరుడస్వామిని పిలిచి నీవు వెళ్లి ఆ పిచుకకు సాయం చేసి రమ్మని పంపించాడు. గరుడుడు పిచ్చుక దగ్గరకు వచ్చి ఓ పిచ్చుక ఈ నీరు తోడే విషయంలో ఒక ఉపాయం చెప్తాను. నీవు నా వీపు మీద ఎక్కు అన్నాడు. సరే నని పిచుక గరుడుని వీపుమీద ఎక్కింది. సముద్రం మధ్యకు గరుడుడు వెళ్లి తన రెక్కలతో నీటిని చరచగా అవి రెండుగా చీలిపోయాయి. అక్కడ పిచ్చుక గుడ్డు కనిపించింది. పిచ్చుక ఎంతో సంతోషంతో తన గుడ్డును తాను తీసుకొని సురక్షిత ప్రదేశానికి వెళ్దామని చెప్పింది. గరుడుడు పిచ్చుక దాని గుడ్డును సురక్షిత ప్రదేశానికి చేర్చాడు. ఇక అపుడు ఆ మహావిష్ణువు కు నమస్కరించి గరుడస్వామి నీ మేలును నేను ఎప్పటికి మరచిపోను అంటూ పిచ్చుక గరుడస్వామికి నమస్కారం చేసింది.
అట్లానే మనుష్యులందరూ కూడా ఫలితాన్ని ఆశించకుండా వారి వారి పనులను చేస్తూ ఉంటే భగవంతుడైన శ్రీమన్నానారాయణుడు తప్పక వారికి తగిన ఫలితాలను ఇస్తాడు.

- వేదగిరి రామకృష్ణ