మెయిన్ ఫీచర్

‘చిన్న‘పనైన ‘పరిశుభ్రత’పై నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఆధునిక యుగంలో మానవుడు అన్ని రంగాల్లో కొంగొత్త ఆవిష్కరణలు చేస్తున్నప్పటికీ ‘చిన్న‘పనైన ‘పరిశుభ్రత’పై నిర్లక్ష్యం వహిస్తున్నాడు. ఆ అశ్రద్ధ ఫలితమే వ్యాధుల విజృంభణ.. మరణాలు! డెంగ్యూ జ్వరానికి సం బంధించి నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం (మినిస్టరీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్) గణాంకాల ప్రకారం మన రాష్ట్రంలో 2010లో 776 కేసులు నమోదు కాగా, ముగ్గురు చనిపోయారు. 2011లో 1209 కేసులకు ఆరుగురు, 2012లో 2299 కేసులకు ఇద్దరు, 2013లో 910 కేసులకు ఒకరు, 2014లో 1262 కేసులకు ఐదుగురు, 2015లో 3159కి ఇద్దరు, 2016 అక్టోబర్ 2వ తేదీ వరకు 1712 కేసులు నమోదయ్యాయి. 2012లో దేశ వ్యాప్తంగా అత్యధికంగా 242 మంది మృత్యువాతపడ్డారు. ఇవి చూశాక ఇక మిగతా వ్యాధుల గురించి ప్రస్తావించుకోనక్కర్లేదనిపిస్తోంది. ఈ శోకాలపై లోతుగా విశే్లషించుకొని, ‘స్వచ్ఛ’ ముఖం చూడని సమాజం యథాలాపంగానే నడుచుకుంటుండడం అత్యంత విషాద పరిణామం!