మెయిన్ ఫీచర్

ప్రియతమా .. నా హృదయమా ( ఏకపక్ష ప్రేమలో మిగిలేది విషాదమే!)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమించే స్వభావం ఇరువైపులా ఉన్నపుడు వాళ్ల జీవితాల్లో ఆనందం ప్రకాశిస్తుంది. అయితే అలాంటివారు అరుదు. ఆ స్వభావాన్ని నిలుపుకోవాలంటే ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. లోకం చెప్పినట్టు కాకుండా తమ మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకునే నైజం ఉండాలి. జీవితంలో ప్రేమగా, శాంతిగా ఉండటమే తమకు ముఖ్యమన్న ధోరణి ఉండాలి. కానీ అలా ఉండకపోవడంవల్లనే ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు సైతం ఏదో ఒక సందర్భాన ప్రేమ రాహిత్యానికి లోనవుతారు.

ప్రేమించిన వాళ్ళకే ప్రేమ రాహిత్యం అంటే ఏమిటో తెలుస్తుంది. జీవితంలో ప్రేమానుభవం ఒక్కసారైనా పొందిన వాళ్ళు.. ఏ కారణాలవల్ల ప్రేమకు దూరమైనా విలవిలలాడిపోతారు. ప్రేమ రాహిత్యం ఎందుకు ఏర్పడుతుందో, దాని నుంచి బయటపడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేయవచ్చో చూద్దాం.
ప్రేమ రాహిత్యం గురించి మాట్లాడుకునేముందు, అసలు ప్రేమంటే ఏమిటో తెలుసుకుందాం! నువ్వు ప్రేమించే వ్యక్తికోసం, ఆమె లేదా అతని ఆనందం కోసం నువ్వు ఏమైనా చేయడానికి త్రికరణశుద్ధిగా సంసిద్ధమై ఉండటమే ప్రేమ అంటాడు చలం. దీన్ని ప్రేమకు ప్రాతిపదికగా చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి ప్రేమే ఇరువైపులా ఉన్నపుడే అద్భుతంగా ఉంటుంది. ఏకపక్షమైనప్పుడు ఒకరు ఆ ప్రేమలో దగ్ధమవుతారు. త్యాగాలు వృధా అవుతాయి. చివరకు ఒకరు ప్రేమ రాహిత్యంతో అల్లాడిపోవడమే మిగులుతుంది.
ప్రేమ ఏ విధంగానైనా, ఏ క్షణంలోనైనా మొగ్గ తొడగవచ్చు. ప్రేమ ఎవరిపైనైనా కలగవచ్చు. ఆ ప్రేమ కొనసాగింపు ఆయా వ్యక్తులమీద ఆధారపడి ఉంటుంది. ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమలో నిలబడటం ముఖ్యం అంటాడు ఎరిక్ ప్రామ్. అలా ఒకరు ప్రేమకోసం నిలిచి, మరొకరు ఆ ప్రేమను పట్టించుకోనివారైతే ప్రేమ రాహిత్యం ఏర్పడుతుంది.
ప్రేమకు ప్రధాన అడ్డంకి ఈగో. ఈ అహాన్ని వదులుకోలేనివాళ్ళు ప్రేమించలేరు. ప్రేమను అందించలేరు. ప్రేమను సరిగా స్వీకరించలేరు. ఇలాంటివారు ఎదుటివాళ్ళ ప్రేమనే ఆశిస్తారు. తామ ప్రేమను వ్యక్తం చేయాల్సి వచ్చినపుడు లోలోపలే దాచుకుంటారు. ప్రేమను వ్యక్తీకరిస్తే ఎదుటివాళ్ళ ముందు తమ అహం ఎక్కడ దెబ్బతింటుందోనని గాంభీర్యం వహిస్తారు.
భార్య లేదా భర్త ఉన్నప్పటికీ మరొకరిమీద ప్రేమ ఏర్పడే సందర్భాలుంటాయి. వాటిలోని మంచి చెడ్డలకన్నా, వాటి తీవ్రతను గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. ఇలాంటి ప్రేమలు ఇద్దరిలో ఎంతకాలం వుంటాయన్నది సమస్య. ఒకవేళ మగవాడు ఆ ప్రేమను కొనసాగించడానికి సంసిద్ధం కాకపోతే ప్రేమించిన అమ్మాయి దూరమవుతుంది. అప్పుడామె అనివార్యంగా ప్రేమ రాహిత్యానికి లోనవుతుంది.
చాలా గొప్పగా ప్రేమించే అమ్మాయిని జీవితభాగస్వామిగా చేసుకున్న వ్యక్తి ప్రేమలో లోపం కనిపిస్తే అప్పుడు సైతం ఆమె ప్రేమ రాహిత్యంతో బెంగపడుతుంది. దిగులుతో తనలో తానే ముడుచుకుపోతుంది. అదేవిధంగా ఎంతగానో ప్రేమించే అమ్మాయి పెళ్లి దగ్గరికి వచ్చేసరికి నిర్ణయాలు మార్చుకొని దూరం జరిగిపోతే అప్పుడు అతగాడు పడే బాధ కూడా వర్ణనాతీతం. ఆ వ్యక్తి ప్రేమ రాహిత్యానికి లోను కావడమే కాదు, అది జీవిత పర్యంతం వరకూ వెంటాడుతుంది.
ప్రేమ కేవలం దేహ సంబంధమైంది కాదు. కనుకనే శారీరక ఉద్వేగాలు తీరడంతో మాసిపోదు. ప్రేమ నిజంగా ఒక జ్వాల. అది కాంతినిస్తుంది లేదా కాల్చేస్తుంది. ఇది ప్రేమభావాన్ని మనసున నిలుపుకున్నవాళ్ళ సమస్య. అలా కాకుండా అనేక వ్యాపకాలతో జీవితాన్ని నెట్టకొచ్చేవాళ్ళు ఈ జ్వాలను తాక్కుంటూ సునాయాసంగా నడిచిపోగలరు. అలాంటివారికి ఏ బాధా ఉండదు.
ప్రేమలో విఫలమైన ప్రతి ఒక్కరూ తిరిగి తమ ప్రియురాలు లేదా ప్రియుడికోసమే ఎదురుచూస్తూ కూర్చుంటే ఎనభై శాతం మందికి పెళ్లిళ్ళు కావు. అనుకోకుండా జరిగిపోయే పెళ్లిళ్ళల్లో ఇతర వ్యక్తులు జీవితాల్లోకి వస్తారు. అలా వచ్చినవారు తమ భాగస్వామిని పరమాద్భుతంగా ప్రేమించగలిగితే తమ తొలి ప్రేమల తాలూకు వైఫల్యంలోంచి బయటకొచ్చి ప్రేమను పంచగలరు.
ప్రేమ రాహిత్యం నుంచి బయటపడటానికి ఎలాం టి చిట్కాలు లేవు. ప్రేమించడం ఒక స్థితి అయినట్టే ప్రేమ రాహిత్యంతో బతకడమూ అనివార్యమైన స్థితి. ప్రేమించడం, ప్రేమను నిలుపుకోవడం తెలుసుకోవాలి.

- పి.ఎం.సుందరరావు