మెయిన్ ఫీచర్

పూల మొక్కల పొదరిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు కు రిసే వేళలో పచ్చటి ప్రకృతి పరిమళాలు వెదజల్లుతోంది. ఈ కాలంలో పూచే పూలపై కురిసే మంచు బిందువులు వింతైన అందాన్ని కలిగిస్తాయి. అందుకే వింటర్ సీజన్‌లో ప్రతి ఇంట్లో పూల వసంతాన్ని కురిపించటానికి ఆసక్తి చూపుతారు. అపార్ట్‌మెంట్‌లలోగానీ, ఇంటి ముందు ఖాళీ స్థలంలో గానీ పూల మొక్కలు ఉంటే ఆ ఇంటికి కొత్త అందం వచ్చినట్లే. ఈ సీజన్‌లో ఇంట్లో పూల మొక్కలు నాటుకుంటే చక్కటి సువాసనలు వెదజల్లుతూ స్వచ్ఛమైన గాలి వస్తోంది. సూర్యరశ్మి తక్కువగా వచ్చే ఇళ్లల్లోనూ పూల మొక్కలను పెంచుకోవచ్చు. రకరకాల గులాబీ మొక్కల సీడ్స్ తక్కువ ధరకే వస్తున్నాయి. మంచివి, ఏపుగా.. అందంగా పెరిగే విత్తనాలు ఎంచుకోవటం మంచిది. అపార్ట్‌మెంట్‌లలో పెంచుకోవటానికి అనువుగా రెయన్‌బో రోజ్, క్లయింబింగ్ రోజ్ రకాలు బాగుంటాయి. మూడు నెలల్లోనే పూస్తాయి. క్రీమ్, పసుపు, పింక్, ఆరంజ్ రంగుల్లో పూసే స్నాప్డ్రాగెన్ పూల మొక్కను పెంచటం తేలిక. బెడ్ రూమ్‌లలోనూ, ఇంటి ముంగిట కొత్త ఆకర్షణ తెచ్చిపెడుతోంది. 13 నుంచి 24 సెంటీగ్రేడ్ వేడి ఈ మొక్కకు అవసరం. మట్టి ఎక్కువగా కప్పేయకుండా నాటుకుంటే చాలు. వీటిని పూల కుండీల్లో పెంచిన తరువాత బెడ్ పక్కన పెట్టుకుంటే సువాసనలు వెదజల్లుతుంటాయి. అలాగే పెటూనియా మొక్క కూడా సంవత్సరం మొత్తం పూలనిస్తునే ఉంటుంది. నాలుగు అంగళాల ఉండే ఈ పూలు వేలాడే కుండీల్లో పెంచుకుంటే బాగుంటాయి. ఇండోర్‌లో పెంచేటప్పుడు తగినంత సూర్యరశ్మి అవసరం. ఈ మొక్క పువ్వులు వైట్, రెడ్, బ్లూ, వయోలెట్, పింక్, ఎల్లో రంగుల్లో కనువిందు చేస్తాయి. సూర్యరశ్మి కూడా 16 నుంచి 24 సెంటీగ్రేడు ఉంటే చాలు. మట్టి తేమగా ఉండేటట్లు చూసుకోవాలి. రాయల్ మిక్స్ మొక్కలు ఉంటే చాలు ఆ ఇంట్లో రాజసం ఒలకబోసినట్లే. జపనీస్ సాకురా బోన్సా య్ ప్లాంట్ సర్వ సాధారణంగా పెం చుకోవచ్చు. అతి తక్కువ సూర్యరశ్మి ఉంటే చాలు. బోగన్‌విల్లియా బోన్సా య్ ఔట్‌డోర్, ఇండోర్ ప్లాంట్స్‌గా పెంచుకోవచ్చు. పింక్ బిగోనియా అందమైన పూల నిస్తోంది. ఇండోర్‌లో పెంచేటపుడు ఈ మొక్కకు వేడి ఎక్కువగా తగలకుండా చూసుకోవాలి. సూర్యరశ్మి కూడా అవసరం కాబట్టి కిటికీకి చేరువలో పెట్టుకుంటే మంచిది. బాల్కనీ, లివింగ్ రూమ్, స్టడీ రూమ్‌లలో ఏర్పాటుచేస్తే అందంగా ఉంటుంది. ఇంటికి కొత్త అందాన్నిచ్చే ఇలాంటి పూల మొక్కల పెంపకం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం వెల్లివిరుస్తోంది.