మెయిన్ ఫీచర్

చిక్కొద్దు.. చిక్కులొద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొబైల్ వాడకం మరింత ఎక్కువైంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ అం టూ ఎక్కువ సమయాన్ని వాటికే కేటాయిస్తున్నారు. సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వీటిలో ముఖ్యంగా ఎక్కువ శాతం మోసాలకు గురవుతోంది యువతే. సాంకేతికత పేరుతో చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు.
ఫలితంగా బంగారు భవిష్యత్తును చేజేతులా నాశ నం చేసుకుంటున్నారు. మొత్తం వినియోగదారుల్లో 50 శాతం మంది యువత సాంకేతికతకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్లద్వారా ఇంటర్‌నెట్ సేవలు వినియోగించుకుంటున్నారు. వాటిలో సమస్త సమాచారం దొరకడంతోపాటు యువతను త్వరితగతిన పాడుచేసే కొన్ని రకాల సైట్లు క్షణాల్లో ప్రత్యక్షం కావడంతో ఇబ్బందులు వస్తున్నాయి.
ఫేస్‌బుక్ తరచూ వినియోగించడం వ్యసనమే. కొత్త పోస్టింగ్‌లు వచ్చాయా? తమ పోస్టింగ్‌లకు ఎన్ని లైట్‌లు వచ్చాయి అని తరచూ చూడడం యువతను వేధిస్తున్న పెద్ద సమస్య. కొత్తగా ఏమి కొన్నా అందులో అప్‌లోడ్ చేస్తూ గొప్పలకు పోతుంటారు. ఈ విధంగా చాలామందే ఉన్నారు. వారిని తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతుంటారు. ఒక చిన్న పోస్టింగ్ ఎంతోమంది స్నేహితుల్ని సంపాదించవచ్చు. మరో చిన్న కామెంట్ జీవితానే్న అధఃపాతాళంలోకి తోసేయవచ్చు. ఒక ఫొటో జీవితం రూపురేఖల్నే మార్చేయవచ్చు. ఇది నెట్ పుణ్యమే మరి. కత్తికి రెండువైపులా పదును ఉన్నట్టు ఫేస్‌బుక్‌కు మంచి, చెడు ఉన్నాయి.
ప్రస్తుతం యువత వేలంవెర్రిగా వెంటపడుతున్న ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలతో జాగ్రత్తగా ఉండకపోతే ముప్పు తప్పదు. మనం ఏదైనా వెబ్‌సైట్‌లోకి వెళ్లినప్పుడు ఒక్కోసారి అనుకోకుండా కొన్ని అసాంఘిక వెబ్‌సైట్‌లకు సంబంధించినవి వాటికవే ఓపెన్ అయిపోతాయి. ఒకవేళ వాటిపై మనం క్లిక్ చేస్తే, లైవ్‌లో మనం అక్కడి వారికి కనిపిస్తాం. మనం కంప్యూటర్‌కు వెబ్ కెమెరా ఉన్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. ఆ వెబ్ కెమెరాలోంచి మనం ఎలా ఉన్నామో అచ్చం అలాగే వీడియోలో క్యాప్చర్ అయిపోతాం. ఆ ఫుటేజ్‌ను అసాంఘిక వెబ్‌సైట్ నిర్వాహకులు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.
లైక్‌లు లేవని కుంగిపోవద్దు
తమ పోస్టులకు ఎన్ని ఎక్కువ లైక్‌లు వస్తే అంత పాపులర్ అయినట్లు, తక్కువ లైక్‌లువస్తే ఎవరూ పట్టించుకోవడం లేదని కుంగిపోవడం అర్ధంలేని చర్య.
కోట్లాది వెబ్‌సైట్ల లాగే ఇది కూడా ఓ వెబ్‌సైట్ అని భావించాలి. తమ అకౌంట్, పోస్టింగ్‌లు అందరినీ ఆకట్టుకునాలనే అతి తాపత్రయం సరికాదు. ఇంటర్నెట్‌లో వెతికి ఫొటోలు, కార్టూన్లను తెచ్చిపెట్టడం కాపీరైట్ చట్టాన్ని అతిక్రమించడమే.
సెట్టింగ్‌లతో శ్రేయస్కరం
అకౌంట్‌లోని ప్రైవసీ సెట్టింగ్‌లను అమర్చుకుంటే మంచిది. ప్రొఫైల్‌లోని పర్సనల్ సమాచారాన్ని తస్కరణకు గురికాకుండా చూసుకోవాలి. విలువైన వ్యక్తిగత సమాచారం అకౌంట్‌లో పెట్టకపోవడం మంచిది. పోస్ట్ చేసే చిత్రాలు, వ్యాఖ్యలు మీ స్నేహితులు మాత్రమే చూసేలా సెట్టింగ్‌ను మార్చుకోవచ్చు. వచ్చిన ప్రతి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను ఓకే చేయవద్దు. అవతలి వ్యక్తి ఎవరో, ఏం చేస్తారో, ఎక్కడుంటారో కూడా తెలియనప్పుడు రిక్వెస్ట్‌ను ఓకే చేయడం అంటే సమస్యలను కోరి తెచ్చికున్నట్టే.

ఇవి పాటిస్తే మేలు...
అందరికీ తెలిసేలా ఫోన్ నంబర్లు, ఇంటి చిరునామాలు, ఫొటోలు పెట్టవద్దు. మిత్రుల కామెంట్లపై తీవ్రంగా స్పందించడం, సవాల్ విసరడం చేయకూడదు. స్నేహితుల ఫొటోలను వారి అనుమతి లేకుండా పోస్ట్ చేయకూడదు. కోపంలోనో, బాధలోనో ఉన్నప్పుడు ఫేస్‌బుక్‌లోకి వెళ్లడం, వాటిలోని చిత్రా లు, వ్యాఖ్యలపై స్పందించకూడదు. పుకార్ల ప్రచారంలో మీరు భాగస్వాములు కావద్దు. రెచ్చగొట్టే అవమాన పరిచే ఫొటోలు, కామెంట్లను లైక్ చేయకూడదు. మందుకొట్టి వాహనం నడిపానని, ట్రాఫిక్ సిగ్నల్స్ రూల్స్‌ను బ్రేక్ చేశానని ఇలా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డానని గొప్పలు చెప్పుకుంటూ ఫొటోలు పెడితే చిక్కుల్లో పడడం ఖాయం. ఇలాంటి ఫొటోలు, కామెంట్లు ఎట్టి పరిస్థితిలోనూ పోస్ట్ చేయకూడదు. మంచి పనులకు ఫేస్‌బుక్‌ను వాడుదాం.. మంచిని పంచుదాం..

- నీలిమ, రాజానగరం