మెయిన్ ఫీచర్

వరండాలో వన సౌందర్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండే ఎండాకాలమైనా, వణికించే శీతాకాలమైనా ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నపుడే మానసికోల్లాసం ఎవరికైనా సాధ్యపడుతుంది. కాలానికి తగ్గట్టుగా ఇళ్లలో పూలమొక్కలు పెంచుకుంటే మన కళ్లముందు వన సౌందర్యం కాంతులీనుతుంది. చిన్న చిన్న పట్టణాల్లో సైతం అపార్ట్‌మెంట్ల సంస్కృతి విస్తరించడంతో నేడు ఇళ్లలో మొక్కలు పెంచడం కష్టతరమవుతోంది. పూలమొక్కలు పెంచేందుకు ఇంట్లో స్థలం లేదని దిగాలు పడకుండా వరండాలోనే మన అభిరుచికి తగ్గట్టు కుండీల్లో వీటిని పెంచుకునే వీలుంది. అపార్ట్‌మెంట్లలో కిచెన్, బెడ్‌రూమ్, హాల్‌కు అనుబంధంగా ఎంతోకొంత బాల్కనీ ఉంటుంది గనుక అందుబాటులో ఉన్న స్థలంలోనే అనువైన పూలమొక్కల్ని పెంచుకుంటే- ఆ ఇల్లే నందనవనంగా మారుతుంది.
కొద్దిపాటి జాగాలోనే కుండీలను అమర్చుకుని పూలమొక్కలు పెంచేందుకు జనవరి, ఫిబ్రవరి నెలలు ఎంతో అనుకూలం. పాతసామాన్లను పేర్చడానికి కాకుండా వరండాలను మొక్కలను పెంచేందుకు వాడుకుంటే మనకు స్వచ్ఛమైన గాలి అందడమే కాదు, ఇంటి పరిసరాలు నయనమనోహరంగా కనిపిస్తాయి. సహజంగా శీతాకాలంలో మొక్కల్లో పెరుగుదల తక్కువగా ఉంటుంది. గనుక వరండాలో సరిపడే రీతిలో పూలమొక్కల్ని ఎంపిక చేసుకుని కుండీల్లో లేదా ప్లాస్టిక్ కంటైనర్లలో పెంచుకోవాలి. కుండీల్లో వాడిన ఆకులను, పూలను, వృథాగా పోయే నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. కొన్ని రకాల మొక్కలకు సూర్యరశ్మి ఎక్కువగా ఉండాలి. మరికొన్ని పూలమొక్కలు నీడలోనూ పెరుగుతాయి. ఈ విషయమై అవగాహన పెంచుకుని కొన్నింటిని ఎండ తగిలే చోట, మిగతావాటిని నీడ ఉండే చోట పెంచాలి. మొక్కలను నాటే ముందు కుండీల్లో తాజా మట్టిని వేయాలి. తరచూ కుండీల్లో నీరు పోసి, గాలి, వెలుతురు తగిలే చోట ఉంచాలి. ముఖానికి కళ్లు ఎంత సోయగం తెస్తాయో- ఇంటికి పూలగుత్తులతో నిండిన వరండా అంత శోభను తెచ్చిపెడుతుంది. వరండా మొత్తాన్ని మొక్కలతో నింపేయకుండా, పూల గుబాళింపుల్ని మనం ఆస్వాదించేలా అటూ, ఇటూ తిరిగేందుకు వీలుగా కుండీలను ఏర్పాటు చేసుకోవాలి. వీటిని నేలకు తాకకుండా ఎత్తులో ఉంచితే వృథానీటిని, మట్టిని ఎప్పటికప్పుడు తొలగించవచ్చు. డైనింగ్ హాల్‌లో, బెడ్‌రూమ్‌లో గోడలకు చిన్న చిన్న కుండీలను వేలాడదీసి అందమైన పూలమొక్కలను పెంచుకోవచ్చు. క్రోటన్స్‌తో పాటు చామంతి, బంతి, మందారం, లిల్లీ, గులాబీ తదితర రకాల పూలమొక్కలను వరండాల్లో పెంచుకోవచ్చు. తక్కువ స్థలంలో పెరిగే హైబ్రిడ్ రకాలు కుండీల్లో పెరిగేందుకు ఎంతో అనువుగా ఉంటాయి. ఆర్కిడ్ జాతి మొక్కలు, బోన్సాయ్ రకాలు కూడా కుండీల్లో పొందికగా పెరుగుతాయి.