మెయిన్ ఫీచర్

పాటే ప్రాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-ఇండియన్ ఐడల్ జూనియర్స్ రన్నరప్ నహిద్
-ఫత్వాలకు బెదరిపోనంటున్న గాయని

ఆమె స్వరఝరిలో ఎవరైనా సరే ఓలలాడాల్సిందే..
నిండా పదహారేళ్లు రాని నహిద్ గొంతు విప్పితే
చెవులప్పగించాల్సిందే..
ఆమె పోటీకి వెళితే పాటతో మైమరపించి బహుమతితో
రావలసిందే..
కానీ ఆమె గొంతులోని మాధుర్యం, మార్దవం కొందరికి నచ్చలేదు. బహిరంగ వేదికలపై పాడటం తప్పన్నారు. కట్టుతప్పితే జాగ్రత్త అని హెచ్చరించారు. కానీ ఆ పదహారేళ్ల పాటగత్తె..చస్తానుగానీ పాట ఆపనంటూ
తెగేసి చెప్పింది.

ఆమె తెగువ చూసి దేశం తెగమెచ్చుకుంటోంది. పొడవాటి జుట్టు, చామనఛాయతో, అందమైన కళ్లను చక్రాల్లా తిప్పుతూ భావానికి తగ్గట్టుగా మధురంగా పాడే గాయని నహిద్ ఆఫ్రిన్. యువ సంచలనంగా మారిన ఈ ఇండియన్ ఐడల్ జూనియర్ స్వరఝరితో యావద్భారతాన్ని ఉర్రూతలూగిస్తూ నేపథ్య గాయనిగా బిజీ అవుతోంది. దేశమంతా ఆమె గొంతువిని సేదదీరుతూంటే కొందరు మత కారణాలు చూపుతూ పాటపాడటానికి వీల్లేదన్నారు. ఆంక్షలు విధించారు. భగవంతుడే తనకు మంచి స్వరాన్నిస్తే ఇంకెవరో పాడద్దనడం సరికాదని, ప్రాణం ఉన్నంతవరకూ పాడతానన్న నహ్రిద్ పేరు ఇప్పుడు పతాక శీర్షికల్లో కనిపిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు 46 ముస్లిం సంస్థలు పాటపాడటానికి వీల్లేదంటూ ఫత్వా జారీ చేశాయి. ముస్లిం మతంలో ఫత్వా అంటే చాలామందికి భయం. ఆ ఆజ్ఞ అమలు చేసేందుకు పట్టుదలగా పనిచేసే చాందసులున్నందువల్ల, ఫత్వాకు చాలామంది గౌరవం ఇచ్చే సంప్రదాయంవల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అందరిలాగానే 16 ఏళ్ల గాయని నహిద్ చిగురుటాకులా ఒణికిపోతుందని అనుకున్నారు. నేపథ్యగాయనిగా ఇపుడిపుడే అడుగులు పడుతున్న తరుణంలో మతసంస్థల ఛాందసం ఈ చిన్నారి కెరీర్‌లో చిన్న కుదుపులాంటిది కలిగించింది. తానే గనుక మగపిల్లాడినైతే ఇలా ఫత్వా జారీచేసేవారా అని లింగ వివక్షపై సూటిగా ప్రశ్నిస్తూ.. భయపడేది లేదు అని కరాఖండీగా చెబుతోంది.
ఇదీ కుటుంబ నేపథ్యం..
ఆమెకు పాటంటే ప్రాణం. ఆ పాట కోసం ఎంతవరకైనా ప్రయాణించే నహిద్ అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది. తల్లిదండ్రులు ఫాతిమా అన్సారీ, అన్వర్ అన్సారీల పెద్ద కుమార్తె ఆమె.
* చిన్నప్పటి నుంచి ఎన్నో పాటల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ నిర్వహించే ఇండియన్ ఐడల్ మనదేశంలో అతిపెద్ద పాటల పోటీ. ఇందులో జూనియర్ చాంపియన్‌గా నిలిచింది.
* అస్సామీ, హిందీ, బెంగాల్ భాషల్లో పాటలు పాడుతుంది. అస్సాంలోని భక్తకందే కళా కేంద్రంలో శిక్షణ తీసుకుంది.
*బిస్వంత్ చరియాలిలోని లిటిల్ స్టార్ హైస్కూల్‌లో చదువుకుంటోంది.
* ఆమెది సామాన్య మధ్యతరగతి కుటుంబం. తండ్రి డిఆర్‌డిఎలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరు సోదరులు ఉన్నారు.
* అఖిర చిత్రంలోని పాట పాడి బాలీవుడ్ నటి సోనాక్షీసిన్హా అభిమానాన్ని సంపాదించింది.
* వీటన్నింటికంటే అతి ముఖ్యమైన అంశం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఈ చిన్నారి గాత్ర మాధుర్యానికి ఫిదా అయిపోయారంటే నమ్మాలి.