మెయిన్ ఫీచర్

అడుగులు పడేది అక్కడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నారులకు ‘బడి’ అలవాటుచేసే యత్నం
ప్లే, నర్సరీ స్కూల్ ఎంపికకు ప్రాధాన్యం
నడత.. నడకకు దారిచూపే కేంద్రాలు ఇవే

వేసవి పిల్లలకు ఆటవిడుపుకాలం. కానీ తల్లిదండ్రులకు హైరానా కలిగించే సమయం. ఎందుకంటే ఇంకా సరిగా నడక కూడా రాని తమ పిల్లల్ని ఏ స్కూల్లో వేయాలని వాకబు చేసేస్తుంటారు. తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే స్కూళ్లు తెరిచిన తరువాత వారిని పంపటం కష్టం అని ఇప్పటి నుంచి ప్రీ ప్రైమరీ స్కూలుకు రెడీ చేస్తున్నారు. చిన్నారుల్లో ఉన్న ఆసక్తి, అనురక్తి, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని రెట్టింపుచేసే వాతావరణం ఉండేలా ప్రీప్రైమరీ స్కూలును ఎంపిక చేసుకోవటం కూడా తల్లిదండ్రులకు పరీక్షే. తమ ముద్దుల బిడ్డ ఆడుతూ..పాడుతూ ప్రైమరీ స్కూలుకు వెళ్లాలంటే స్కూలు ఎంపికలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకతప్పదు.
* స్కూలు ఇంటికి దగ్గరగా ఉండేటట్లు చూసుకోవాలి. ఆ స్కూల్లో ఎలాంటి పద్ధతిలో పిల్లలకు ఆసక్తికరంగ ఏమేమి నేర్పుతున్నారో తెలుసుకుని చేర్పించాలి.
* సంవత్సరానికి వసూలు చేస్తున్న ఫీజు వివరాలు, ఆటస్థలం, ఆధునిక సాంకేతికి పరిజ్ఞానాన్ని అందించే సౌకర్యాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. పిల్లల సంఖ్యకు తగ్గట్లు టీచర్లు ఉన్నారో లేదో తెలుసుకోవాలి.
* ప్రీప్రైమరీ స్కూల్లో ప్రతిరోజూ విద్యార్థులతో ప్రార్థన చేయిస్తున్నారో లేదో గమనించండి.
* బడి అంటే ఆడుతూ పాడుతూ తమకు నేర్పే నేస్తమే అనుకునే విధంగా ఆ బడిలో వాతావరణం ఉండాలి.
* ఇంటి దగ్గర్లో ఉన్న అన్ని ప్రీప్రైమరీ స్కూళ్ల వివరాలను తెలుసుకుని అందులో మేలైన స్కూలును ఎంపికచేసుకుంటే మంచిది.
* కొంతమంది పిల్లలు ఆటలు నేర్పిస్తే చాలు అనుకుంటారు. చదువు అవసరం లేదనుకుంటారు. కాని ఎదిగే పిల్లల్లో ఆసక్తి మెండుగా ఉంటుందనే విషయం గుర్తించి వారికి చదువు పట్ల మమకారాన్ని పెంచేలా చేయాలి.
* తోటి పిల్లల నుంచి ఎంతో నేర్చుకుంటారు. తమనుతాము మార్చుకుంటారు. కాబట్టే మంచి అలవాట్లు అలవర్చుకునేలా ప్రైమరీ పాఠశాల ఉండాలి.
* క్షణం తీరకలేని ఉద్యోగంలో తలమునకలయ్యే తల్లులు వారితో కనీసం రెండు గంటలైనా గడపాలి. లేకపోతే కనీసం పెద్దవారిని వారికి తోడుగా ఉంచండి. దీనివల్ల వారితో అనుబంధం పెరిగి చక్కటి అలవాట్లు వస్తాయి.
* ఈ వయసులో వారికి కథలు చెప్పటం వల్ల వారిలో నైతికస్థయిర్యాన్ని కలిగించినవారవుతారు. బొమ్మల కథలే వారిలోని భయాన్ని తొలగిస్తుంది.
* చదువుతో పాటు డ్యాన్స్, సంగీతం, ఆటలు తదితర వ్యాపకాల్లో ఆసక్తిని పెంచితే వారిలో నమ్మకాన్ని కలిగిస్తోంది.
* భవిష్యత్తులో ఉపయోగపడే నైపుణ్యాలను అలవర్చుకునేలా వారిని తీర్చిదిద్దేలా ఉండాలి.
* నలుగురిలో చక్కగా మెలిగే నైపుణ్యాన్ని వారికి ప్రాధమికంగా నేర్పించేలా సన్నద్ధం చేయండి.
*పుట్టిన బిడ్డలో సగటున వంద మిలియన్ల బ్రెయిన్ కణాలు ఉంటాయి. ఇవి బిడ్డ మూడేళ్లు వచ్చేవరకు మెదడును వృద్ధి చేసేందుకు తోడ్పడతాయి. ప్రతి సెకనుకు 700 కొత్త సినాప్టిక్ కనెక్షన్లు తయారవుతుంటాయి. ఈ వయసులో వారికి ఏదైనా నేర్పితే బ్రెయిన్ బాగా వృద్ధిచెందుతుంది. ఈ మెదడు ఇలా అభివృద్ధిచెందటం పెద్దవారికంటే పిల్లల్లో రెండురెట్లు అధికంగా ఉంటుంది. అందుకే ఈ వయసులో వారిలో ఆసక్తిని మెండుగా కలిగిస్తే అది కొన్ని దశాబ్దాలపాటు అదేక్రమంలో సాగుతుంది.