మెయిన్ ఫీచర్

శ్రీమంతుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఫ్యాక్షన్ గ్రామాన్ని దత్తత తీసుకున్న ఐపీఎస్ అధికారి
* అభివృద్ధి, సామాజిక చైతన్యమే శాంతి మంత్రాలు

ఎస్పీ రవికృష్ణ మంచి మనసున్న పోలీసు అధికారే కాదు. ఈయనలో కళాకారుడు కూడా దాగి ఉన్నాడు. తానే స్వయంగా పాటలు రాసి వాటిని పాడతారు. ఆయన పాడిన పాటల ఆల్బమ్‌లపై వచ్చిన ఆదాయాన్నంతా ఆడపిల్లల చదువు కోసం ఖర్చు చేస్తున్నారు.

‘ఈ ఊరు నీకెంతో ఇచ్చింది. ఈ ఊరుకి ఎంతోకొంత ఇవ్వకపోతే లావైపోతావు’ - శ్రీమంతుడు సినిమాలోని ఈ డైలాగ్‌కు విపరీతమైన ప్రజాదరణ లభించింది. ఈ సినిమాను ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది రాజకీయ నాయకులు, సినిమా నటులు గ్రామాలను దత్తతు తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ఇదే బాటలో ఓ పోలీసు అధికారి కూడా కదిలారు. కాకపోతే ఫ్యాక్షన్ గొడవలతో నిత్యం అతలాకుతలమయ్యే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. మూడు హత్యలు ఆరు గొడవలతో నిత్యం రగిలిపోతున్న ఆ ఊరు ప్రజలు ప్రశాంతంగా జీవించాలంటే ఊరి అభివృద్ధే శాంతిమంత్రం అని నమ్మిన ఈ యువ ఐపీఎస్ అధికారి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ ఊరి ప్రజలకు మహారాజు అయ్యారు. ఆయనే కర్నూలు ఎస్‌పి రవికృష్ణ, ఆ ఊరు పేరు కప్పట్రాళ్ల. కొందరి ఫ్యాక్షన్ రాజకీయాలకు ఎంతోమంది అమాయక గ్రామ ప్రజలు బలవుతున్న విషయాన్ని గుర్తించిన ఈ అధికారి వీటికి ముగింపు పలికేందుకు నడుం బిగించారు. ఈయనకు గ్రామస్తులు సహకారం లభించటం విశేషం.
21 హత్యలతో కకావికలం
కప్పట్రాళ్లలో మూడు వేలమంది ప్రజలు, 800 కుటుంబాలు నివశిస్తున్నాయి. ఐదు దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతున్న ఫ్యాక్షన్ గొడవలకు ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. దాదాపు 21 హత్యలలో నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించబడి జైళ్లలో మగ్గుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో కర్నూలు జిల్లా ఎస్పీగా వచ్చిన ఆకే. రవికృష్ణ తొలుత ఈ గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని సంకల్పించారు. ఇందుకు గ్రామస్తుల సహకారం ఉంటేనే సాధ్యమని గ్రహించారు. అందుకే ఆ ఊరుని దత్తత తీసుకున్నారు. దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా శ్రమించారు. కలెక్టర్‌తో మాట్లాడి అరవై లక్షలు రూపాయలు మంజూరు చేయించి పది గదులతో పెద్ద స్కూలు కట్టించారు. రాబోయే తరం అవిద్యలో మగ్గిపోకుండా వారిలో విజ్ఞాన కుసుమాలు పూయించారు. ప్రధానమంత్రి ‘్భటీ పడావో..్భటీ బచావో’ పథకం ద్వారా గ్రామంలో ఉన్న ఆడపిల్లలందర్నీ స్కూలుకు పంపేవిధంగా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం గ్రామస్తులను ఒప్పించారు.
భార్య సహకారంతో..
ఎస్పీ భార్య కూడా ఈ గ్రామాభివృద్ధిలో తనువంతు సహకారం అందించటం విశేషం. ఆమె స్వయం సహాయక గ్రూపులను ఏర్పాటు చేయించారు. అంతేకాదు ఈమె గ్రామస్తులతో మాట్లాడి వారిని అవయవదానానికి సైతం ఒప్పించారు. ఫ్యాక్షన్ గొడవల్లో భర్తలను, పిల్లలను కోల్పోయిన ఎంతోమంది మహిళలు చిరునవ్వులు పూయిస్తూ.. వారికి ఆర్థికంగా చేయూతనందిస్తూ సాధికారిత దిశగా అడుగులు వేసేలా చేశారు. ప్రస్తుతం ఎస్పీ రవికృష్ణ స్ర్తిశక్తి భవన్ నిర్మించి అందులో విభిన్న వృత్తుల్లో మహిళలకు శిక్షణ ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటుకల తయారీ, సబ్బులు, పచ్చళ్లు, జ్యూట్ బ్యాగ్స్ తదితర వస్తువులను మహిళల చేత తయారుచేయించి మార్కెట్లో విక్రయించే సదుపాయాన్ని కల్పిస్తే వారు సామాజికంగా అభివృద్ది చెందుతారని ఎస్పీ రవికృష్ణ అభిప్రాయం.
పాటలు రాసి
పాడతారు..
ఎస్పీ రవికృష్ణ మంచి మనసున్న పోలీసు అధికారే కాదు. ఈయనలో కళాకారుడు కూడా కూడా దాగి ఉన్నాడు. తానే స్వయంగా పాటలు రాసి వాటిని పాడతారు. ఆ యన పాడిన పాటల ఆల్బమ్‌లపై వచ్చిన ఆదాయాన్నంతా ఆడపిల్లల చదువు కోసం ఖర్చు చేస్తున్నారు. అంతేకాదు కళ్లదానానికి తాను సంసిద్ధుడనవ్వటమే కాదు అనేకమంది గ్రామస్తుల చేత ప్రతిజ్ఞ చేయించారు. వారంతా ఎస్పీ మహాయజ్ఞంలో పాలుపంచుకోవటానికి ముందుకు వచ్చారు. ఇంకా యువకులలో సామాజిక చైతన్యానికి నడుం బిగించారు. ఇలా నిజ జీవితంలో మరో శ్రీమంతుడుగా మారిన ఈ ఐపీఎస్ అధికారి మరిన్ని సేవాకార్యక్రామాలు నిర్వహించాలని ఆశిద్దాం.