మెయిన్ ఫీచర్

తరచి చూడాల్సిన సమయమిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

**కుటుంబ వ్యవస్థలో ఊహించని మార్పులెన్నో వచ్చాయి. కళకళలాడే ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. ఒకప్పుడు ఆడపిల్లలకు చదువు చెప్పించేవారు కాదు. గడప దాటి బయటికి పోనిచ్చేవారు కాదు. ఇంటి పనులను, వంట పనులను నేర్పించి పెండ్లి పేరంటాలు చేసి ఎంతో కొంత కట్నం ఇచ్చి అత్తగారింటికి పంపేవారు. పెండ్లి అయిన స్ర్తి తన భర్తకు, అత్తమామలకు ఆడపడుచులకు సేవలు చేస్తూ వారిని మెప్పిస్తూ ఎంతో అణకువగా ఉండవలసి వచ్చేది. ఈ పరిస్థితుల్లో అత్యధిక స్ర్తిలు విజయాన్ని సాధించి వారి మనుగడను సుఖవంతం చేసుకున్నారనే చెప్పవచ్చు. అది అలా ఉంచుదాం. మార్పునూ ఆహ్వానిద్దాం.

నేడు తల్లిదండ్రులు మగ పిల్లల చదువును గూర్చి ఎంత శ్రద్ధ తీసుకొంటున్నారో ఆడపిల్లల చదువును గూర్చి కూడా అంతే శ్రద్ధ వహిస్తున్నారు. మంచి కళాశాలల్లో చదువు చెప్పిస్తున్నారు. పెద్ద ఉద్యోగులై, డబ్బు సంపాదించి తమ కాళ్ళపై తాము నిలబడి ఆత్మస్థైర్యంతో, ఆత్మగౌరవాన్ని కాపాడుకొంటూ హుందాగా బ్రతకాలని ఆశిస్తున్నారు. అంతవరకూ అంతా బాగానే ఉంది. తల్లిదండ్రులు వృద్ధులై, శక్తిహీనులై, రోగపీడితులై మంచాన పడినపుడు మొదలవుతుంది అసలు సమస్య. బాగా విద్యావంతులైన స్ర్తిల దృష్టిలో కూడా పెద్ద మార్పు కనబడదు. వృద్ధ తల్లిదండ్రుల బాధ్యత కొడుకులదే గాని కూతుళ్ళది కాదంటారు. తల్లిదండ్రులను ఆడపిల్లలు తమ ఇండ్లలో పెట్టుకొని చూసుకొమ్మని ఏ శాస్తమ్రూ చెప్పలేదంటారు. మాతృదేవోభవ, పితృదేవోభవ అన్నది కొడుకులకే గాని కూతుళ్ళకు కాదంటారు. ఒకవేళ వాళ్ళ ఇండ్లల్లో వృద్ధులైన అత్తమామలలుంటేనో, ఆర్థిక పరిస్థితులు బాగులేకుంటేనో వారి కష్టాన్ని అర్థం చేసుకోవచ్చు. అట్లేమీ లేదు. అన్నీ బాగున్నా, వారి కాన్పులు కార్యాలు అయ్యేంతవరకు తల్లిదండ్రులను వారి దగ్గరేంచుకొని అన్నీ అయిపోతూనే ‘ఇక మీరు మీ కొడుకుల వద్ద ఉండడమే ధర్మం, శాస్త్ర సమ్మతం’అని చెప్పి పంపివేస్తున్నారు.
ఏ వృద్ధులకైనా కూతుళ్ళ దగ్గర వున్నంత చనువు కోడళ్ళ వద్ద ఉండదు. దాన్ని అర్థం చేసుకోక వారితో పొందాల్సినదంతా పొంది, చేయించుకోవలసిన కార్యాలన్నీ చేయించుకొని చివరకు కొడుకు దగ్గరకు పంపితే వారు, వారి భార్యలు ఆ ముసలివారికి సేవలు చేస్తారా?
మరొక ముఖ్య విషయాన్ని గమనించాలి. ఈ రోజుల్లో ఒకరో, ఇద్దరో పిల్లలు పుడుతూనే కుటుంబ నియంత్రణ చేయించుకొంటున్నారు. ఆ పుట్టిన ఇద్దరూ ఆడపిల్లలైనా సరే, వారిని బాగా చదివించి, పెండ్లిచేసి, కాన్పులు చేసి సంతృప్తి చెందుతున్నారు పెద్దవారు. అలాంటి తల్లిదండ్రులు వృద్ధులై మంచాన పడితే, వారి బాధ్యత కూతుళ్ళు తీసికోకపోతే వారి గతి ఏమిటి? వృద్ధాశ్రమాల్లో దిక్కులేని చావు చావాల్సిందేనా? కొడుకులైనా, కూతుళ్ళయినా ఆస్తులను వదలుకోవచ్చు గానీ తల్లిదండ్రులకు సేవ చేసే సదవకాశాన్ని జారవిడుచుకోరాదు.
తల్లిదండ్రులు చనిపోతే వారి శవాలను స్మశానాలకు మోసుకుపోతున్న కూతుళ్ళు, తామే తలకొరివి పెట్టి అంత్యక్రియలు జరుపుతున్న కూతుళ్ళు ఉన్నట్టు అప్పుడప్పుడు వార్తాపత్రికలు ఫొటోలతో సహా వార్తలను ప్రచురిస్తున్నాయి. అలాంటి స్ర్తి మూర్తుల గురించి చదివినపుడు వారి పాదాలకు నమస్కరించాలనిపిస్తుంది. అలాంటివారు ఉండటంవల్లే కదా మనది పవిత్ర దేశమని, గొప్ప సంస్కృతని మనం చెప్పుకొంటున్నది. ఒకవేళ ఏ ఇంట్లోని వృద్ధులైనా మేము ఆశ్రమానికి పోతాము అని అంటే, వద్దే వద్దు, మన ఇంటినే ఒక ఆశ్రమంగా మారుద్దాం. మీరు ఇక్కడే వుండి మీ దీవెనలను మాకు అందిస్తూ ఉండండి. మీకు ఎప్పుడు ఏం కావాలో మాకు చెప్పి చేయించుకోండి అని చెప్పే సంస్కారంగల కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు కావాలిప్పుడు. అప్పుడు కదా మనం వేదమాత, భరతమాత ముద్దుబిడ్డలం కాగలిగేది.

--రాచమడుగు శ్రీనివాసులు