మెయిన్ ఫీచర్

యోగాతో క్రమశిక్షణ ( బాలీవుడ్ నటి నర్గీస్ ఫిట్‌నెస్ పాఠాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు.. బరువును తగ్గించుకోవాలని, చెడు అలవాట్లకు స్వస్తిపలకాలని చాలామంది సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, ఆచరణలో కొద్దిమంది మాత్రమే ఆశాజనకమైన ఫలితాలను సాధిస్తుంటారు. బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ ఫిట్‌నెస్ కోసం ఈ ఏడాది రెండు భిన్నమైన వ్యాయామాలను ప్రాక్టీస్ చేస్తోంది. చైనాలో ప్రసిద్ధి చెందిన ‘టై చై’, ‘క్విగాంగ్’ అనే సాంప్రదాయ యుద్ధవిద్యల్లో నైపుణ్యం సాధించాలని ఆమె గట్టిగా నిర్ణయించుకుందట!
ఆత్మరక్షణకు, మంచి దేహదారుఢ్యానికి ‘టై చై’ యుద్ధవిద్య ఎంతగానో దోహదపడుతుందని, నాజూకైన శరీరాకృతితో పాటు శ్వాసవ్యవస్థ మెరుగుపడేందుకు ‘క్విగాంగ్’ వ్యాయామం అవసరమని ఆమె చెబుతోంది. నిత్యం ఫిట్‌నెస్ తరగతులకు హాజరయ్యే నర్గీస్ ఈ ఏడాది విభిన్నమైన యోగా, వ్యాయామ పద్ధతుల వైపు దృష్టి సారిస్తోంది. మూస పద్ధతుల్లో కాకుండా వినూత్న వ్యాయామ విధానాల వల్ల బరువు తగ్గి మంచి శరీరాకృతి లభిస్తుందని ఫిట్‌నెస్ రహస్యాలను ఆమె చెబుతోంది. ఎప్పుడూ చేసే వ్యాయామ పద్ధతులతో ఎవరికైనా మొహం మొత్తేస్తుందని, నూతనత్వాన్ని ఆకాంక్షించే వారికి యోగాలో అనేక కొత్త విధానాలున్నాయని నర్గీస్ అంటోంది. రెగ్యులర్‌గా జిమ్‌కు వెళుతూ యాంత్రికంగా వ్యాయామం చేస్తే సరిపోదని, ఇతర దేశాలకు చెందిన వ్యాయామ పద్ధతులనూ తెలుసుకోవాలని సూచిస్తోంది. కాలం మారుతున్నకొద్దీ వివిధ వయసుల వారి అభిరుచులు, ఆసక్తులకు తగ్గట్టు ఎనె్నన్నో వ్యాయామ పద్ధతులున్నాయని చెబుతోంది. మసాలా భాంగ్రా, నీటిలో యోగా, క్రాస్-్ఫట్ విధానాలు ఎంతో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తాయని అంటోంది. భిన్నమైన కొన్ని వ్యాయామాలు, యుద్ధవిద్యలు సరదాగానూ ఉంటాయంటోంది. వినూత్న విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే జీవితంలో వైవిధ్యానికి ఎలాంటి లోటు ఉండదని నర్గీస్ వివరిస్తోంది. యోగా వల్ల మనసు, శరీరం ఎంతో తేలిగ్గా ఉంటాయని, ఈ ఏడాది సరికొత్త యోగాసనాలు తెలుసుకోవాలని ఉందని ఆమె తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తోంది. ఎముకల దృఢత్వం కోసం ఇకపై ప్రతిరోజూ కనీసం 25 పుష్ అప్స్, వంద సిట్ అప్స్ చేయాలన్నది తన ఆలోచన అని చెబుతోంది. అందంగా కనిపించాలంటే వ్యాయామం, యోగా అవసరమేనని అయితే, ముందుగా ప్రతి ఒక్కరిలోనూ ఆశావహ దృక్పథం ఉండాలంటోంది. సరైన వ్యాయామ పద్ధతుల గురించి తెలుసుకుని వాటిని క్రమం తప్పక పాటిస్తేనే నిజమైన అందం, ఆనందం లభిస్తాయంటోంది. యోగా, వ్యాయామం వల్ల మంచి శరీరాకృతే కాదు, అంతకుమించి క్రమశిక్షణ, మంచి జీవనశైలి అలవడతాయని నర్గీస్ చెబుతోంది.

*