మెయిన్ ఫీచర్

ఆత్మవిశ్వాసంతో జయం మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో గెలుపు సాధించాలంటే సత్యము, ధర్మము అనే చక్రాలూ
పట్టుకోవాలి. నీతి నియమాలు ఉంటే చాలు. అన్ని రంగాల్లో విజయావకాశాలు
ఉన్నట్టుగా భావించవచ్చు. దేనినైనా పాజిటివ్ వేవ్‌లో ఆలోచించి సంతోషాన్ని , ఆనందాన్ని ఎదుటివారితో పంచుకోగలిగే నేర్పు ఉంటే చాలు...

కొండలను పిండి చేయవచ్చు. లోయలను చదును చేయవచ్చు. పర్వతాలను ఎక్కవచ్చు. అనుకొంటే దేనినైనా సాధించవచ్చు. ఇదంతా కేవలం మన మనసుల్లో ఉన్నదే. వారు వీరు అనే తేడా లేదు. ఎవరైనా దేనినైనా సాధించవచ్చు. కాకపోతే నేను చేయగలను అనే భావనను కలిగించుకోవాలి. మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి. ఎవరు చేస్తారు? ఏమి చేస్తాంలే.. ఎంత చేసినా అది అవుతుందా? అసలు మనం చేయగలమా అన్న నిరాశ పనికిరాదు. ఇట్లాంటి పొద్దుపుచ్చు మాటలు అసలే మాట్లాడకూడదు.
మాట్లాడక చేసే పని గురించి మంచి అవగాహనను కల్పించుకుని ముందుకు సాగితే చాలు అన్నింటిలోను గెలుపు మనదే అవుతుంది. ఇది అక్షర సత్యం. దీనే్న ఆత్మవిశ్వాసం అని చెప్తారు. అపజయం అన్నది లేకుండా విజయాలను సాధించాలంటే అందరిలో ఆత్మవిశ్వాసం ఉండితీరాలి.
దేనినైనా పాజిటివ్ వేవ్‌లో ఆలోచించి సంతోషాన్ని , ఆనందాన్ని ఎదుటివారితో పంచుకోగలిగే నేర్పు ఉంటేచాలు. జీవితంలో గెలుపు సాధించాలంటే సత్యము, ధర్మము అనే చక్రాలు గూడా పట్టుకోవాలి. నీతి నియమాలు ఉంటే చాలు అన్ని రంగాల్లో విజయావకాశాలు ఉన్నట్టుగా భావించవచ్చు. మరొక విషయం- మన విజయమే కాదు ఎదుటివారి సృజనను లేక వారి నైపుణ్యాన్ని గూడా గుర్తించి గలిగి ఉండాలి. వారిని మెచ్చుకునే విధంగా ఉండాలి. అపుడు మరింత అనుకొన్న పనిలో త్వరగా చేయడానికి వీలు ఉంటుంది. సమష్టిగా కలిసి చేసే పనులు సానుకూలం కావడానికి ఈ పద్ధతులు బాగుంటాయి. ఒక్కరు చేసే పనులు బాగా రాణిస్తాయి అనుకొన్నా కొన్ని కొన్ని పనులు నలుగురు కలసి నాలుగు రంగాల్లో వారి నైపుణ్యాన్ని జత చేసుకొని ఒక ప్రణాళికతో కొత్త రంగాన్ని లేక కొత్తపనులను ఆరంభిస్తే అనుకొన్న ఫలితాన్ని రాబట్టుకోవాలి అంటే ఈ పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ఈ రంగంలో ఇంతకుముందు నిష్ణాతులుగా ఉన్నవారిని, వారితో పాటు ఈ రంగంలో ఫెయిల్యూర్ అయినవారిని కూడా సంప్రదించాలి. ఎందువలన విజయానికి దూరం అయ్యారో లేక ఎందుకు అనుకొన్న విజయాలను పొందుతున్నారో అవి ఏవిధమైన చర్యలను వారు తీసుకొంటున్నారో కూడా చూడాలి. వారితో మాట్లాడి వారి అనుభవాలను పాఠంగా తీసుకోవాలి. అపుడు అనుకున్న విజయ పథం వైపు అడుగులు వేయొచ్చు. దీనిలో మహిళలే ముందుండాలి. ఒకవేళ ఎపుడైనా డిప్రెషన్‌గా ఉన్నట్టు ఉంటే వెంటనే దానినుంచి బయటపడాలి. మంచి సంగీతం వినాలి. రాబోయే రోజుల్లో జరిగే మంచిని గురించి ఆలోచించాలి. ముందు మనకు చేతనైనంత పనిని చేయాలి. ఫలితం దానికదే వస్తుంది.

- మురళీధర్