మెయిన్ ఫీచర్

జీరోసైజ్‌కు మారండిలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మా! నువ్వు చాలా అందంగా ఉన్నావు.కాని లావుగా ఉన్నావు అని కూతురు రిషిత చేసిన పెదవి విరుపు కామెంట్ 32 ఏళ్ల అనిషా బెనర్జీని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. కూతురు చెప్పిన చేదు నిజాన్ని జీర్ణించుకోలేక మళ్లీ పాత అనిషాగా ఎలా మారాలా అనే ఆలోచనలో పడింది. ఎలాగైనా సన్నబడాలి అని సంకల్పదీక్ష తీసుకుంది. ఆరునెలల పాటు శ్రమించింది. మళ్లీ పాత అనిషా బెనర్జీగా మారిపోయింది. విచిత్రంగా 74 కిలోలు బరువు ఉన్న ఆమె 54 కిలోలకు తగ్గిపోయి జీరోసైజ్‌కు మారిపోయింది. కోల్‌కతాకు చెందిన ఈ అమ్మ తాను సన్నబడటానికి ఏమేమి తిన్నాను, ఎలాంటి వ్యాయమం చేశానో వివరిస్తూ ఫొటోలతో సహా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. దీనిని ఇపుడు అందరూ అమితాసక్తితో చదువుతున్నారు. లావు వల్ల వయసుకు మించినదాని వలే కనిపిస్తున్న ఆమె కోల్‌కతాలో ప్రసిద్ధిచెందిన స్వీట్ రసగుల్లా వలే మారటమే కాదు ఫిట్‌గా తయారైంది. అమె ఎలాంటి న్యూట్రీషియన్స్, ఫిట్‌సెంటర్ల నిర్వహకులు సలహాలు తీసుకోలేదు. తన ఆలోచనా ధోరణిలో మార్పుతెచ్చుకుని ఆచరణలో పెట్టింది. అదే ఆమెను మామూలు అనిషాగా మార్చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...
మంచినీరే ఆరోగ్యం
ఇంతకు ముందు నిద్రసరిగా పోయేదాన్ని కాదు. రోజూ సరిపడా మంచినీళ్లు కూడా తాగేదాన్ని కాదు. తొలుత ఈ రెండు అలవాట్లలో మార్పు తెచ్చుకున్నాను. ఏడు నుంచి ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోవటం అలవాటు చేసుకున్నాను. గంట గంటకు మంచీనీళ్లు తాగటం ప్రారంభించాను.
ఆహార నియమాలు ఇలా..
ఉదయం కప్పు అల్లం టీతో దినచర్య ప్రారంభమవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో పాలల్లో కలిపిన ఓట్స్, ఒక అరటిపండు, ఉడకబెట్టిన గ్రుడ్లు తీసుకుంటాను. మధ్యాహ్నాం భోజనంలో ఉడకబెట్టిన చికెన్ లేదా ఫిష్, కూరగాయలతో కలిపిన పప్పు, పెరుగు, పండ్ల ముక్కలు ఒక్కొక్క కప్పు చొప్పున తీసుకుంటాను. సాయంత్రం కప్పు అల్లం టీతో పాటు వైట్ బ్రెడ్ స్లయిస్ తీసుకుంటాను. రాత్రికి డిన్నర్‌లో మళ్లీ ఉడకబెట్టిన ఫిష్ లేదా చికెన్, ఒక బౌల్ సలాడ్ సేవిస్తాను. ఇలాంటి ఆహార నియమాలు నిష్టగా పాటించటంతో పాటు పూర్తిగా భోజనం మానేశాను.
నిత్య వ్యాయామం ఇలా..
గతంలో ఇంటి పనుల వత్తిడి వల్ల అసలు నడకనే మర్చిపోయాను. వారానికి ఒక్కసారి కుటుంబ సభ్యులతో నడిచేదాన్ని. ఇపుడు అలాకాకుండా వారంలో ఐదురోజులు తప్పనిసరిగా వ్యాయామం చేస్తున్నాను. అధిక రక్తపోటు, గుండెపోటు తదితర జబ్బుల బారిన పడకుండా వాటికి సంబంధించిన ఎక్స్‌ర్‌సైజులు చేస్తాను. ఉదయం మూడు కిలోమీటర్ల దూరం నడకతో పాటు రెండు గంటలు జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేయటం అలవాటుగా చేసుకోవటం జరిగింది. అంతేకాదు సినీనటి శిల్పాశెట్టి యోగా వీడియోను చూస్తు యోగా ను సైతం నేర్చుకోవటం జరిగింది. ఇలా ఆరునెలల పాటు చేయటంతో నా బరువు 74 కిలోల నుంచి క్రమేణా 54కిలోలకు తగ్గిపోయింది. ఇప్పటికీ వ్యాయామాన్ని మాత్రం వదిలిపెట్టకుండా ఇదే వెయిట్‌ను మెయింటెన్ చేసేందుకు అనిషా కృత నిశ్చయం తీసుకుంది. ఎవరైతే బరువు తగ్గాలని అనుకుంటారో షార్ట్‌కట్ మార్గాలను ఎన్నుకోవద్దు. ప్రతి అడుగు ఆరోగ్యకరమైన జీవితం కోసం అని వేస్తే నిదానంగా గమ్యానికి చేరుకోవటం ఖాయం. కృత నిశ్చయం తీసుకుంటే ఎలాంటి బరువునైనా ఎత్తవచ్చు, తగ్గించుకోవచ్చని చెబుతోంది.

chitram జీరోసైజ్‌కు మారిన అనిషా