మెయిన్ ఫీచర్

శిక్ష లతో పాటు... శిక్షణ అవసరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసుంటే మార్గం ఉంటుంది. అవసరాలే అభివృద్ధి పథంలో నడిపిస్తాయి. ఆకాంక్షలే అభివృద్ధి కారకాలు అవుతాయి. ఇవన్నీ కేవలం స్లోగన్స్ కాదు. తమపైన తమకు పూర్తిగా నియంత్రణ నమ్మకం ఉన్నవారికి నిలువెత్తు సాక్షాలు. నేడు అన్ని రంగాల్లోను స్ర్తిలు ఉన్నారు. స్ర్తిలు లేని రంగం స్ర్తిలు చేయలేని పనులు అంటూ ఇపుడు ఏవీ లేవు. కాని ఎక్కువగా స్ర్తిలే వంచింపబడుతున్నారు. స్ర్తిలే నడిరోడ్టులోనైనా, చీకటి నీడల్లోనైనా అవమానించబడుతున్నారు.
ప్రతిరోజు ఎక్కడో ఒకచోట స్ర్తి మృగాడి అరాచకానికి బలవుతున్నారు. నిన్న కాక మొన్న కథోవ నాటి దృశ్యం కనుమరుగు కాలేదు. మళ్లీ బీహార్‌లో నడిరోడ్డుపైన ఆకతాయిల అకృత్యం.
వీటిని చూస్తూ కూడా అక్కడ నడిచేవారు వీడియోలు తీసి మెసెజెస్ పెట్టడంలో తలమునకలైయ్యారట. కాని ఆ అకృత్యాన్ని ఆపలేకపోయారు. ఇదెంత విడ్డూరం. కాళ్లు చేతులు లేనివారా, అన్యాయాన్ని ఎదురించలేని మానసిక పరిపక్వత రానివారు ఆ దారిన పోతున్నారా, జరిగేది అర్థం కాక వౌనంగా ఉన్నారా, లేక మనకూ
చోద్యం లాగా ఉందని అనుకొని చూసారా.. పైగా వీడియోలు తీయడమా.. మీ మనసును ఒక్క సారి ప్రశ్నించుకోండి. ఇదేనా మీ వ్యక్తిత్వం. ఆ ప్రదేశంలో ఆ అకృత్యం బారిన మీ ఇంట్లో ఉన్న మహిళ ఉంటే మీరు వీడియోలు తీసేవారా ? ఆ అసురులను అడ్డుకునేవారా? ఒక్కసారి మనసుతో ఆలోచించండి..
ఇది ప్రతిచోట నేడు జరుగుతున్నదే..
మన దగ్గర పోలీసు వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చారు. స్ర్తిల ను కాపాడడానికి షీటీమ్స్‌ను పెట్టారు. క్యాబ్స్‌లోను, ఆటోల్లోను బస్‌ల్లోను ఎక్కడైనా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక నడిచే దారిలో కూడా ఇటువంటివి ఎదురైతే అసలు ఆడపిల్లలకు భద్రత లేకుండాపోతోంది. ఏ మూల నుంచి ఏ మృగం వచ్చి నాశనం చేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈ సమాజంలోని ఆడపిల్లలు నిత్యం భయంతో బతుకుతున్నారు.
ఈ పరిస్థితులకు తిలోదకాలు ఇవ్వాలంటే ప్రతిమహిళా కదలి రావాలి.
ప్రతివీధిలోను షీటీమ్స్ ఏర్పాటు చేయాలి. ప్రతి కూడలిలోను పోలీసు పహరా ను పెట్టాలి. ప్రతి నాలుగు అడుగులకు పోలీసులతో భద్రత కల్పించాలి. అంతేకాదు చోద్యం చూసేవాళ్లకు శిక్ష వేయాలి. నేరాన్ని ఆపకపోతే ప్రోత్సహించినట్టే అవుతుంది. అరాచకాలను చేసేవారికి మనలను ఎవరు ఏం చేయరు అన్న ధోరణి ప్రబలుతుంది. వారు ఇంకా ఉన్మాద చర్యలకు ఒడిగట్టుతారు.
ప్రభుత్వాలు 12 ఏళ్లలోపు బాలికలపైన అత్యాచారాలు చేస్తే మరణ శిక్ష విధించడం ఒకమాదిరి బాగుంది. వృద్ధులపైనా, మహిళలపై అంటే 12 ఏళ్ల పైబడిన వారిపైన అత్యాచారాలు జరిపితే మరణ శిక్ష ఎందుకు వేయరు? అవి నేరాలు కావా?
ఇటువంటి నేరాలకు ఒడిగట్టేవాళ్లకు శిక్షల కన్నా ప్రతిరోజు ప్రతి ఇంటిలోని మగాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చేప్రతిపాన తీసుకొని రావాలి. ఇప్పుడున్న స్ర్తి చైతన్య సంఘాలు, మహిళామండలులు ప్రతివారం చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి మగవారి దాకా ప్రతిఒక్కరిలో మార్పు తీసుకొని రావడానికి వారికి స్ర్తి పట్ల బాధ్యత ఏర్పడ్డానికి, అకృత్యాలకు, అఘాయిత్యాలకు, అత్యాచారాలకు పాల్పడ కుండా స్ర్తి అంటే ఏమిటో తెలిసేవిధంగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చే స్వచ్చంధ సంస్థలు బయలుదేరాలి.
నాడు స్ర్తి విద్య కోసం పత్రికలు ఏర్పడినట్టు నేడు మగాళ్లు మృగా
ళ్లలా మారకుండా ఉండడానికి పత్రికలే నడుం కట్టాలి. ఇటువంటి అకృత్యాలను చేసేవారిని మానసిక రోగులుగా గుర్తించి ఇంట్లో వాళ్లు, సమాజంలోని వాళ్లను వీళ్లను త్వరగా గుర్తించి వీరికోసం ప్రత్యేక వైద్యనిపుణుల సలహాలను వారికి ఇవ్వాలి. అపుడు కాని ప్రభుత్వాలు చేసే చట్టాలు అమలు చేసే పరిస్థితులు రావు. కనుక త్వరలో ఈ మృగాళ్ల మానసిక రోగుల ఆటకట్టించాల్సిన బాధ్యత ముఖ్యంగా మహిళాసంఘాలు తీసుకోవాలి.

- సి. విజయలక్ష్మి