మెయిన్ ఫీచర్

కేన్స్ కళకళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ సంవత్సరం ఈ నెల ఎనిమిది నుండి పందొమ్మిది వరకు జరగనుంది. ఈ 71వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్‌కి చెందిన ముద్దుగుమ్మలు ఎవరెవరు వెళ్ళనున్నారో, పొడవాటి గౌనులు ధరించి, మతిపోగొట్టే అందాలతో ఎప్పుడెప్పుడు ఎర్ర తివాచీపై అడుగులు వేయనున్నారో ఖరారైంది. కేన్స్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అద్భుత సౌందర్యవతి అయిన ఐశ్వర్యారాయ్. ఎప్పటిలాగే ఈసారి కూడా నీలి కళ్ల ఐశ్వర్యారాయ్‌బచ్చన్ రెడ్ కార్పెట్‌పై నడవనుంది. గడిచిన పదిహేడు సంవత్సరాలుగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కళ్లు చెదిరే అందాలతో తళుకులీనే ఈ అందగత్తె ఈసారి మే 12, 13 తేదీల్లో రెడ్‌కార్పెట్‌పై నడవనుంది. గత ఏడు సంవత్సరాల మాదిరిగానే ఈసారి కూడా సోనమ్‌కపూర్ కేన్స్ ఎర్రతివాచీపై నడవనుంది. ట్రెండ్‌కు తగినట్లుగా ఎప్పటికప్పుడు మారిపోతూ తనదైన ఫ్యాషన్స్‌తో కుర్రకారు మనసులను కొల్లగొట్టే ఈ భామ ఈ నెల 14, 15వ తేదీల్లో రెడ్‌కార్పెట్‌పై నడవనుంది. అయితే సోనమ్‌కపూర్ తాజాగా తన వివాహ మహోత్సవ తేదీలను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.. అదే కనుక జరిగితే వివాహానంతరం ఆమె పాల్గొననున్న తొలి ఫిల్మ్ ఫెస్టివల్, మొదటి కేన్స్ సంబరం ఇదే కానుంది.
ఇక గత సంవత్సరం తొలిసారిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దీపికా పదుకొణె మెరిసిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే ఈసారి కూడా దీపిక కేన్స్ వేడుకల్లో పాల్గొననుంది. దీపిక రెడ్‌కార్పెట్‌పై 10, 11 తేదీల్లో నడవనుంది.