మెయిన్ ఫీచర్

ఇదిగో ఉపాధిభాట...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** అరటాకు వచ్చి ముల్లు మీద పడినా, ముల్లు వచ్చి అరటాకు మీద పడినా అరటాకుకే నష్టం అట్లానే కిరాయిదారుకు కోపం వచ్చినా, ఇంటి ఓనర్‌కు కోపం వచ్చినా మారాల్సిందే కిరాయిదారే.
ఇల్లు మారాలి అంటే అబ్బా.. అనేవాళ్లే ఎక్కువ. ఎవరైనా ఎక్కడిక్కడ సొంత ఇళ్లు కట్టేసుకోలేరు. వారికి అనువుగా అద్దె ఇండ్లల్లో ఉంటుంటారు. కాని ఈ కిరాయిళ్లు మాటిమాటికి మారాల్సి వస్తుంది. ఇంటి ఓనర్‌కు కష్టం అనిపించినా , కిరాయిదారుకు కష్టం అనిపించినా ఇల్లు మారాల్సిందే.
అందులో పరుగెత్తే ప్రపంచంలో మాటిమాటికి ఇళ్లు మారడం అంటే చాలా కష్టం. అందులోను ఇంట్లో ఎంతో అపురూపంగా ఉన్న వస్తువులను ఏమాత్రం దెబ్బతగలకుండా తీసుకొని వేరే ఇంటికి వెళ్లడం కూడా కష్టమే.
మట్టిబొమ్మలు... గాజు పాత్రలు.. అరుదైన కళాఖండాలు ఇవి అన్నీ ఎంత జాగ్రత్తగా ప్యాకింగ్ చేసినా అవి లారీల్లోనో, వ్యాన్స్‌లోనో తీసుకెళ్లేటపుడు అవి పగలిపోవచ్చు. లేకపోతే వాటికి మళ్లీ బాగుచేయలేని రిపేరు రావచ్చు. అపుడు ఎంతో బాధనిపిస్తుంది.
అట్లాంటి బాధలు లేకుండా ఇల్లు మారాల్సి వస్తే ఎంత బాగుండు
---------------------------

అనుకొనేవారు నేటికీ ఉన్నారు... వారందరికీ ఓ శుభవార్తలాగా పీ.ఎం. రీలోకేషన్ ఇండ్రస్టీ ని ప్రారంభిస్తున్నాచ్చో అని ఆకాంక్ష భార్గవ అన్నారు. ఇది నిజమే. మీ వస్తువులకు తగినంత భద్రత తో మీరు కోరుకున్న ప్రదేశానికి చేర్చడం మా బాధ్యత అని ఆమె భరోసా ఇచ్చింది. ఇళ్లే కాదు ఆఫీసుల్లాంటివి కూడా మార్చాలంటే మా సిబ్బంది మీకు సంతృప్తి కల్గించేవిధంగా మీ వస్తువులను మీరు కోరుకున్న చోటుకు తెచ్చి ఇస్తారు అన్నారామె. ఈ ఆకాంక్ష పారిశ్రామిక వేత్తల కుటుంబం నుంచి వచ్చారు. ఎంబిఏ చదువుకున్నారు. అప్పటికే తండ్రి నడిపిస్తున్న సంస్థ బాధ్యతలు తీసుకోమని చెబుతున్నా తనకూ తీసుకోవాలని ఉన్నా కొత్తదనాన్ని ఆహ్వానించే ఆకాంక్ష మనసు మాత్రం పాత సంస్థనా అన్న దగ్గర ఆగిపోయింది.
అందుకే మార్కెటు బాగా అవగాహన చేసుకొన్నారు. మార్కెట్ అంటే కేవలం కొనుగోళ్లు అమ్మకాలు కాదు మనుష్యులు వారి అవసరాలు వాటిని దృష్టిలో పెట్టుకున్నారు. అంతే ఆకాంక్ష మనసు వేగంగా పరుగులెత్తింది. కొత్త అనుభవాలను చవి చూడడానికి ఉరుకులు పెట్టింది. అప్పటివరకు ప్యాకర్స్ మూవర్స్ అనే మనసున్న రీలోకేషన్ సంస్థను తరచి చూడడమే కాదు అందులో తనదైన శైలిలో మార్పులు చేపట్టింది.
వెంటనే పిఎంఆర్ సంస్థ విన్నూత్న స్టయల్‌ను అందరూ గుర్తించారు. కార్యాలయాలు.. ఇళ్లు, స్కూల్స్ కళాఖండాలు ఇలా ఏవైనా సరే మీరు మారాలనుకొన్న చోటుకు కొత్తగా అడుగు పెడదామనుకొన్న చోటుకు అతి జాగ్రత్తగా వినియోగదారులకు ఎలాంటి విసుగు వేసట లేకుండా సామన్లను గమ్యస్థానానికే చేర్చడమే కాక వాటిని అనువైన జాగాల్లో సర్దిపెట్టడం కూడా ఈ పిఎంఆర్ చేస్తుంది. ఆరంభంలో ఈ సంస్థకేవలం 40 మంది ఉద్యోగులతో ప్రారంభమైంది. ఇప్పుడు 370 మంది ఉద్యోగులు ఈ సంస్థలో ఉన్నారు. 21 ఏళ్లకే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఆకాంక్ష 29 ఏళ్లకంతా బాగా స్థిరపడిన సంస్థగా పిఎంఆర్‌ను తీసుకొని రావడం ఎంతో సంతృప్తినిస్తుందని అంటారు. ఈ సంస్థ ఇపుడు రెండు కోట్ల టర్నోవర్ నుంచి 30 కోట్ల టర్నోవర్ కు చేరింది. వినియోగ దారులకు సంబంధించి అన్ని పనులు ఈ సంస్థలోని సిబ్బందినే చూసుకొంటారు. దానివల్లనే మేము వినియోగదారులకు కావాల్సిన సంతృప్తిని కల్గిస్తున్నామని ఆకాంక్ష అంటారు. ఆమె మాటల్లో ‘.. నేను మహిళా పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చుకోవడం కన్నా దాదాపు 400మందికి ఉపాధి కల్పించగల్గుతున్నాననే అంశమే నన్ను ఎంతో సంతృప్తికి గురిచేస్తుంది.’ ఇదిగో ఈ మాటలే నాకు స్ఫూర్తినిచ్చాయి. ఈ సంస్థ షెల్ , అమెరికన్ ఎంబసీ, అమెరికన్ స్కూల్, యాండాక్స్, హెచ్‌పి. బ్రిటానియా,. సాప్ భాష్ , సిటీ బ్యాంక్ నోకియా, సీమన్స్ బార్ల్కేసీ ఇలాంటి కంపెనీలు వీరి సేవలను పొందుతున్నాయి. మరి నేడు మహానగరమైన హైదరాబాదులో కూడా ఎంతమందో వలస వచ్చిన వారున్నారు. వారందరికీ అనువైన ప్రదేశాల్లో సరియైన ఇళ్లు దొరకడం అక్కడ కుదురుకోవడం కష్టసాధ్యమైన పనే. అందుకే ఈ ఆకాంక్షను స్ఫూర్తిగా తీసుకొని ఔత్సాహిక మహిళాపారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి. కావాల్సిన వారిని వెదకటం... వారికి అనువైన ఇళ్లను చూపించడం. వారి వస్తువులను వాఎంతోమందినేడు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చేసుకొనే వారున్నారు. వారి వస్తువులకు తగిన మార్కెట్ చేసుకోనే నేర్పు లేనివారున్నారు. ఉత్పత్తి బాగా చేయగలరు. కాని మార్కెటు అవగాహన లేక అనుకొన్న లాభాలను పొందలేని వారున్నారు. అటువంటివారికి తగిన మార్కెట్ సదుపాయాలను కల్గంచడం, వారు ఉత్పత్తి చేసిన వాటికి అందమైన ప్యాకింగ్ చేయడం.. జనాకర్షణ కల్గేట్టుగా చేయడం లాంటివి చేపడితే వారు ఉపాధిని పొందడమే కాక ఇతరులకు కూడా ఉపాధినిచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ మార్గంలో మహిళలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ఆకాంక్ష గురించి స్టార్ట్‌ప్ స్టోరిస్ వెలువరించే యువర్స్‌స్టోర్టీ.కామ్ చదివి నాకుతోచిన అభిప్రాయాన్ని మీతో పంచుకుంటున్నాను.

-- జంగం శ్రీనివాసులు