మెయిన్ ఫీచర్

సమస్యలపై పోరాటం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రీతి హర్మన్ అంటే ఎవరూ.. అంటూ కాసేపు ఆలోచిస్తారేమో కానీ.. ‘ఛంజ్.ఆర్గ్..’ ప్రీతి హర్మన్ అంటే ఎవ్వరూ ఆలోచించరు. వెంటనే సమస్యలను పరిష్కరించే మన ప్రీతి కదూ.. అనుకుంటారు. ‘్ఛంజ్. ఆర్గ్’ సంస్థ ద్వారా ఇప్పటికే చాలా సమస్యలకు పరిష్కారం లభించింది. మరికొన్ని సమస్యలు త్వరలో పరిష్కారం కానున్నాయి. అలా ప్రజల సమస్యలను తీరుస్తూ,ప్రజల అవసరాలు, ఆర్థిక వ్యవస్థలకు అనుగుణంగా చట్టపరమైన మార్పులు తీసుకురావడం వంటి పనుల్లో బిజీగా ఉన్న ప్రీతి తాజాగా ‘ఒబామా ఫౌండేషన్ ఫెలోషిప్’కు భారతదేశం తరఫున ఎంపికైన మొట్టమొదటి యువతిగా రికార్డు సృష్టించింది. 191 దేశాల నుంచి 20 వేలమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో కేవలం 20 మంది మాత్రమే ఫెలోషిప్‌కు అర్హత సాధించారు. వారిలో 13 మంది మహిళలు ఉండగా.. మన దేశం నుంచి మాత్రం ప్రీతి హర్మన్ మాత్రమే ఈ ఘనత సాధించి చరిత్రను సఋష్టించింది. వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని ఊటీ దగ్గర్లోని ఒక చిన్న పట్టణానికి చెందిన యువతి ప్రీతి హర్మన్. ఈమె మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. చిన్నతనం నుంచీ వైద్యురాలు కావాలని కలలు కంది. పెరిగేకొద్దీ అది కుదరకపోవడంతో మాస్ కమ్యూనికేషన్స్‌లో చేరింది. దానిలో భాగంగానే కొన్ని సంస్థలతో కలిసి ఇంటర్న్‌షిప్ చేసే క్రమంలో మనదేశంలోని మారుమూల గ్రామాలు, అక్కడి ప్రజల జీవన పరిస్థితులను చాలా దగ్గరగా గమనించింది. ఒడిశాలోని దేవంగరి, హరపనహల్లి పట్టణంలో సాధారణ ప్రజలతో కలిసి జీవించింది. కనీస వసతులు కూడా లేని ఆ ప్రదేశంలో వారితో కలిసి దాదాపు రెండు నెలల పాటు గడిపింది. ఫలితంగా రెండుసార్లు మలేరియా బారినపడి మృత్యువు అంచుల వరకూ వెళ్లి చివరికి.. కష్టపడి ప్రాణాలను నిలుపుకుంది. తనే కాదు.. ఆ ఊర్లోని ప్రతి కుటుంబంలోని ఓ వ్యక్తి మలేరియా బారినపడి చనిపోవడం ఆమెను కలచివేసింది. అక్కడ అన్నిరకాల వనరులు ఉన్నప్పటికీ ఆర్థికవ్యవస్థ పటిష్టంగా లేకపోవడంతో వసతులు ఏర్పరుచుకోలేకపోవడం గమనించిన ఆమె.. వారి సమస్యలను పరిష్కరించేదిశగా ప్రయత్నాలు చేసింది. సఫలమయ్యింది. అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటూ అక్కడున్న సమస్యలపైప్రచారం చేసింది. దీనితోపాటు అక్కడ ప్రజల్లో కూడా కొంత సామాజిక చైతన్యం తీసుకువచ్చింది. అలా అలా అక్కడి సమస్యలకు ఆమె పరిష్కారాలు చూపుతూ వచ్చింది. కాలక్రమంలో కొత్త కొత్త సమస్యలు ఎదురుకావడంతో‘్ఛంజ్. ఆర్గ్’ అనే సంస్థను మొదలుపెట్టింది. ప్రజల సమస్యల పరిష్కారానికి మొదలుపెట్టిన ఆ సంస్థ ప్రస్త్తుతం లక్షల సమస్యలకు పరిష్కారాలు చూపే పెన్నిధిగా మారింది. ప్రస్తుతం ‘్ఛంజ్.ఆర్గ్’లో దాదాపు ఎనభై లక్షలమందికి పైగా వినియోగదారులున్నారు. ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా, ఎక్కడినుంచైనా ఒక ప్రదేశంలో ఉన్న సమస్య గురించి సవివరంగా పేర్కొంటూ దాని పరిష్కారమార్గాన్ని కనుక్కోవచ్చు. ఈ సంస్థ ద్వారా చాలా సామాజిక సమస్యలకు పరిష్కారం లభించింది. నెట్ న్యూటా లిటీ నుంచి సింగిల్ పేరెంట్స్‌కి సంబంధించిన పాస్‌పోర్ట్ నియమాల సడలింపు వరకు.. మహిళలకు సంబంధించిన శానిటరీ న్యాప్‌కిన్లపై ప్రభుత్వం విధించిన జీఎస్టీ, మహిళా భద్రతకోసం యాసిడ్ల అమ్మకాన్ని నిషేధించడం.. వంటి అంశాలను ప్రభుత్వం దృష్ట్టికి తీసుకెళ్లి తగిన పరిష్కారం అందేలా చేయడం వంటివి.. ఇలా చాలా విజయాలు ఈ సంస్థ ఖాతాలో ఉన్నాయి.
ఒబామా ఫెలోషిప్
ప్రజా సమస్యలకు పరిష్కారం అందిస్తూ, మహిళా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రీతి హర్మన్ విజయాలే ఆమెని ప్ర తిష్టాత్మకమైన ‘ఒబామా ఫౌండేషన్ ఫెలోషిప్’కి ఎంపికయ్యేలా చేశాయి. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళ ప్రీతి హర్మనే కావడం విశేషం. ప్రజాసమస్యలను పరిష్కరించడం ప్రజల అవసరాలు, ఆర్థిక వ్యవస్థలకు అనుగుణంగా చట్టపరమైన మార్పులు తీసుకురావడం.. మొదలైన అంశాల్లో తమ వంతు కృషి చేసినవారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి.. వారిలోని నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత వెలికి తీయాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటైందే ‘ఒబామా ఫౌండేషన్ ఫెలోషిప్’. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిందే ఒబామా ఫౌండేషన్ ఫెలోషిప్. రెండేళ్ళ ఫెలోషిప్‌లో భాగంగా 191 దేశాల నుంచి 20వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా చివరకు కేవలం 20 మంది మాత్రమే ఫెలోషిప్‌కు అర్హత సాధించారు. వారిలో 13 మంది మహిళలు ఉండగా అందులో మనదేశం నుంచి ప్రీతి మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇదే కాదు.. యునైటెడ్ నేషన్స్, మైగవ్. ఇన్, నీతి ఆయోగ్ వంటి సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో భారతీయ మహిళల స్థితిగతులను ప్రభావితం చేస్తోన్న 25 మంది మహిళల జాబితాలోనూ స్థానం సంపాదించుకుంది ప్రీతి హర్మన్.

--మహేశ్వరి