మెయిన్ ఫీచర్

శనగతో వెరైటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెంతి పులిహోర
బియ్యం - 1 కప్పు, శనగపప్పు - 1 కప్పు
చింతపండు రసం - 1 కప్పు, ఎండుమిర్చి - 6
ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు,
మెంతులు - 2 చెంచాలు,
నూనె - తగినంత, పసుపు - 1 చెంచా
తయారీ విధానం: మెంతులు వేయించి పొడి చేసి ఉంచాలి. కుక్కర్‌లో పప్పు, బియ్యం ఉడికించి పళ్ళెంలో పోసుకోవాలి. దానికి మెంతిపిండి, కరివేపాకు కలుపుకోవాలి. ఆ తరువాత ఆవాలు, శనగపప్పు తో పోపు పెట్టండి పులిహోరా రెడీ
పాయసం
శనగపప్పు - 1 కప్పు, బియ్యం - 1 కప్పు
కొబ్బరి కోరు - 1/2 కప్పు, నెయ్యి - 5 చెంచాలు
ఏలకులు - 5, జీడిపప్పులు - 12
బాదం పప్పులు - 12, కిస్‌మిస్ - 24
పాలు చిక్కనివి - 1 లీటరు,
కుంకుమ పువ్వు - 1 చెంచా
బెల్లంతరుగు - 2 కప్పులు,
పంచదార - 1/2 కప్పు
తయారీ విధానం: పాలు బాగా కాయాలి. కుక్కర్‌లో బియ్యం, పప్పు, కొబ్బరి పెట్టి నాలుగు విజల్స్ రావాలి. నేతిలో కిస్‌మిస్‌లు, డ్రైఫ్రూట్స్ వేయించి పాలల్లో వేసి కలపాలి. కుక్కర్ మూత తీసి బెల్లం పంచదార పాలు చేర్చి సన్నని సెగని ఉడకనివ్వాలి. ఏలకులు వేసి దింపాలి. అమ్మవారికి ఇష్టమైన శనగపప్పు పాయసం రెడీ!
థోక్లా
కావలసిన పదార్థాలు:
శనగపిండి - 2 కప్పులు, నిమ్మరసం - 2 స్పూన్లు
పలుచటి మజ్జిగ - తగినన్ని, అల్లం వెల్లులి పేస్టు - 1 స్పూన్
బేకింగ్ సోడా - 1 స్పూన్, ఈనో- 1స్పూన్
ఉప్పు -తగినంత, నూనె - 3 స్పూన్స్
పచ్చిమిరప- మూడు, ఆవాలు - 1 స్పూన్
జీలకర్ర - 1 స్పూన్, కరివేపాకు - రెండు రెమ్మలు
కొత్తిమేర - సన్నని తరుగు రెండు స్పూన్స్
తయారీ విధానం: ముందుగా శనగపిండి ని జల్లించుకోవాలి. దానిలో అల్లం వెల్లులి పేస్టు, నిమ్మరసం, నూనె, ఉప్పు, పచ్చి మిరప సన్నగా తరిగిన ముక్కలు, వేసి మజ్జిగతో గరిట జారుగా కలుపుకోవాలి. దానిలో బేకింగ్ పౌడర్ చేర్చాలి. ఈనో కూడా చేర్చి ఐదు నిముషాలు మూత పెట్టి ఉంచాలి. తరువాత దానిని ఇడ్లీ స్టాండులో పెట్టి ఆవిరికి ఉడికించాలి. ఉడికిన తరువాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేటులో పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేపుకోవాలి. దానిలోకి కరివేపాకును, కొత్తిమేరను చేర్చి ప్లేటులో పెట్టుకున్న థోక్లా పై వేయాలి. దీనికి నిమ్మరసాన్ని కూడా కాస్త చేర్చాలి. ఇవి తింటే మెత్తమెత్తగా చాలా రుచిగా ఉంటాయి.
బూరెలు
శెనగపప్పు - 1 కప్పు, బెల్లం - 1 కప్పు
ఏలకులు - 8, నెయ్యి - 5 చెంచాలు
నూనె - 250గ్రా., శనగపిండి - 1 కప్పు
మైదా - 1 కప్పు, బియ్యం పిండి - 1 కప్పు
ఉప్పు - చిటికెడు
తయారీ విధానం: ముందుగా మైదా,శనగపిండి, బియ్యంపిండిలో ఉప్పు వేసి ముద్దగా బజ్జీల పిండిలా కలిపి ఒక ప్రక్కన పెట్టాలి. ఈ మూడు రకాల పిండిని తోపు పిండి అంటారు. శనగపప్పు మెత్తగా ఉడకబెట్టి, బెల్లం ఏలకులు వేసి ముద్దగా చేసుకోవాలి. నిమ్మకాయంత ఉండలు చేసి దీన్ని పిండిలో ముంచి కాగిన నూనెలో వదలాలి. ఇలా మొత్తం ఉండలన్నీ బూరెలుగా చేసుకోవాలి. ఈ పిండిలోనే మిర్చి ముక్కలు, అల్లం పేస్ట్, జీలకర్రా కలిపితే కారం బూరెలు తయారవుతాయి.
శనగ గారెలు
శనగపప్పు - 250 గ్రా.,
అల్లం మిర్చి పేస్ట్ - 5 చెంచాలు
నూనె - 250 గ్రా., ఉప్పు - 1 చెంచా,
కరివేప - కొంచెం
తయారీ విధానం: ముందుగా పెసరపప్పు నానబెట్టి మిక్సీ పట్టి, అల్లం పేస్ట్ కలిపి నూనె కాచి వడలుగ చేసుకుని వేయించాలి.

--వాణీ ప్రభాకరి