మెయిన్ ఫీచర్

సంప్రదాయానికి సాక్ష్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో గాజులకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. పసుపు, కుంకుమ, గాజులు, తాంబూలం, పళ్ళు ముతె్తైదువుకి ఇవ్వడంలో ఎంతో విశిష్టత ఉంది. దీన్ని ఐదోతనంగా భావిస్తారు. ఇదేగాక సీమంతంలో గర్భిణీ స్ర్తిలకి, గర్భానికి కడుపు తో వున్న బిడ్డకి దిష్టి తగలకుండా ఈ గాజులు పట్టించి గాజులతన్ని సత్కరించి పేరంటాళ్ళకు గాజులు వేయిస్తారు. ఇది ఒక వేడుకగా బంధువుల్ని, స్నేహితుల్ని, ఇరుగు పొరుగును పిలిచి పేరంటం చేస్తారు. భోజనాలు పెట్టి ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఏ మతం వారైనా సరే గాజుల్ని తప్పక వేసుకుంటారు.
నేటితరం అమ్మాయిలకి ఎన్నో రకాల గాజులు, ఆధునిక పోకడలతో, గంటలు, గొలుసులు, రాళ్ళు, ముత్యాలు, అలంకరణలు, అద్దాల అలంకరణలు, దారాల అలంకరణలతో వినూత్న శైలిలో వచ్చాయి. నిత్యం తప్పక ధరించవలసిన ఆభరణము. గోల్డ్ త్రెడ్‌తో రాళ్లు పొదిగి గాజులు బంగారు గాజులను పోలి ఉంటున్నాయ.
ఏనుగు దంతం, లోహాలు, మెటల్, ఇత్తడి, వెండి, బంగారం, రబ్బరు, ప్లాస్టిక్- ఇలా రకరకాల పదార్థాలతో గాజుల తయారీ ఉన్నది. గాజులు అన్నివేళల పసిపిల్లలకి 11వ రోజున పురిటి స్నానం రోజే గాజులు వేస్తారు. నల్లచుక్క పెడతారు. ఇవి పిల్లకి దిష్టిని దూరం చేస్తాయని తరతరాల నమ్మకము. ఇప్పటికి పాటిస్తున్నారు. బంగారు గాజుల మధ్యలో మట్టి గాజుల్ని తప్పక వేసుకునే సత్ సాంప్రదాయం సదాచారం ఉంది. నోములకి ప్రత్యేకము. గాజుల వాడకం అనాదిగా ఉంది. మొదట్లో ఇనుప గాజులు వచ్చేవట. రాను రాను మెటల్ గాజులు విభిన్న రంగులలో అలంకారాలతో వస్తున్నాయి. గతంలో మగవారు కంకణాల మాదిరి వేసుకొనేవారు. ఇపుడు కూడా కొంతమంది రాగి కంకణాలను ధరిస్తుంటారు. దీనిలో ఆరోగ్య సూత్రాలున్నాయి.
గతంలో ఘోషా కాలంలో పరదాల వెనుక గాజుల సవ్వడిని గమనించి స్ర్తీలు వచ్చారని వారితో మాట్లాడేవారట.
గాజులు వల్ల వచ్చే శబ్దంలోను కూడా ఎన్నో భావాలున్నాయ. ఎక్కువ శబ్దం చేస్తే గాజులు వేసుకొన్న ఆమె లోతుగా ఆలోచించగలదని ఒక గట్టి నమ్మకము. తక్కువ శబ్దం చేసే గాజులు వేసుకొన్న ఆడవాళ్లు సామరస్యంతో సర్దుకుని పోతారనే నమ్మకాలు కూడా ఉన్నాయ. జానపదులు డజన్ల లెక్కలో గాజులు ఇష్టంగా వేసుకొంటారు. పూర్వకాలంలో కన్యలు బంగారు గాజులు ధరించేవారు. వివాహం, మతపరమైన కార్యక్రమాలలో అన్ని యుగాలలో గాజులు ధరించేవారు. దీనిలో కంకణాలు, కడీలు రకాలున్నాయి. ఈ తరం మహిళలకు ఇది ఉపాధి కూడా పనికివస్తోంది.

- లక్ష్మీ ప్రియాంక