మెయిన్ ఫీచర్

ఒత్తిడిని తగ్గిద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటికాలంలో డిజిటల్ పరికరాలు ఉపయోగించని పిల్లలు లేరంటే అతిశయోక్తి కాదు. దాదాపుగా అందరి పిల్లలూ ఫోన్‌లో ఆడే ఆటలతోనో, కంప్యూటర్ ఆటలతోనో, ప్లే స్టేషన్లతోనూ బిజీగా ఉంటున్నారు. అలాగే డిజిటల్ టెక్నాలజీ నేర్చుకోవడంలో వారు చాలా ముందుంటున్నారు. ఇది మంచి విషయమే కానీ ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల కళ్లమంటలు, కళ్లపై ఒత్తిడి పడుతున్నా పిల్లలు ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను వదిలేందుకు ఇష్టపడటం లేదు. పైగా ఈ అలవాటును చాలామంది తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు కూడా. కానీ పిల్లలు ఎక్కువ సమయంపాటు స్క్రీన్‌లను చూడటం వల్ల డిజిటల్ ఐ స్ట్రెయిన్ సమస్యలు వస్తున్నాయని పిల్లల కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇతర కండరాల వలె కంటి కండరాలు కూడా నిరంతరంగా పనిచేయడం వల్ల అలసిపోతాయి. టీవీ చూడటం, వీడియోగేమ్‌లు ఆడటం, గంటలకొద్దీ డిజిటల్ పరికరాలు వాడటం వల్ల వాటినుండి వెలువడే నీలం కాంతిని చూడటం వల్ల పిల్లలకు దఋష్టి సంబంధిత నీరసం వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఆప్టోమెట్రిక్ అసోసియేషన్ ప్రతిరోజూ డిజిటల్ స్క్రీన్ పరికరం లేదా కంప్యూటర్‌ను రెండు లేదా ఎక్కువ గంటలపాటు నిరంతరంగా ఉపయోగించే వ్యక్తుల్లో డిజిటల్ ఐ ఒత్తిడి సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటోంది. పిల్లలు వారికి వారు ఎప్పుడూ కళ్ల నొప్పులు ఉన్నాయని, కళ్లపై ఒత్తిడి పడుతుందని తల్లిదండ్రులకు చెప్పరు. పైగా వారి శరీరంలో, ముఖ్యంగా కంటిచూపుకు సంబంధించిన సమస్యలను వారు గుర్తించలేకపోవచ్చు. ఎందుకంటే సాధారణమైన కంటిచూపు ఎలా ఉంటుందో, కంటి కండరాలు లాగుతూ ఉండటం, కళ్ల మంటలు, కళ్ళ ఒత్తిడి.. వంటివాటి గురించి వారికి అస్సలు తెలియదు. కాబట్టి పిల్లల్లో కలిగే శారీరక అసౌకర్యాన్ని, కంటిచూపుకు సంబంధించిన సమస్యలను, వాటి సంకేతాలను, లక్షణాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రు లదే.
పిల్లల్లో డిజిటల్ ఐ ఒత్తిడి సంకేతాలు
ఇలా ఉంటాయి.
చాలాసార్లు కళ్లు మూసి తెరుస్తూ ఉండటం, కళ్లు పొడిబారడం
ద్వంద్వ చూపు
అస్పష్టమైన చూపు
తరుచూ తలనొప్పిగా ఉండటం
మెడ, భుజాల నొప్పి లేదా స్పాండిలైటిస్
ఏకాగ్రత లోపించడం
చికాకు, కోపం
కళ్లలో పోటు రావడం, కళ్లు మండుతూ ఉండటం
ఇలాంటి లక్షణాలు డిజిటల్ ఐ ఒత్తిడి వల్ల కలుగుతాయి. వీటిని తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.
చిట్కాలు
స్క్రీన్ ప్రకాశాన్ని తగ్గించాలి.
స్క్రీన్‌లో ఏదైనా చదువుతున్నప్పుడు అక్షరాల పరిమాణం పెద్దదిగా, సులభంగా చదవగలిగేలా ఉండాలి.
ల్యాప్‌టాప్‌లు మరియు కంప్యూటర్ స్క్రీన్‌లను చేతి దూరంలో, కంటికి దిగువన ఉండేలా చూసుకోవాలి.
పరికరాలను ఎప్పుడూ దూరంగా పట్టుకుని చూడాలి.
డిజిటల్ పరికరాన్ని చూసేటప్పుడు అదేపనిగా చూడకుండా తరచుగా కళ్లు ఆర్పుతూ ఉండాలి. ప్రతి పది నిముషాలకోసారి ఒక నిముషం పాటైనా కళ్లు మూసుకుని విరామం తీసుకోవాలి.
సహజకాంతిలో కొంత సమయం గడపడం వల్ల కళ్లకు విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది.
డిజిటల్ స్క్రీన్ చూస్తున్నప్పుడు 20/20/20 నియమాన్ని పాటించాలి. అంటే ప్రతి ఇరవై నిముషాలకు ఒకసారి ఇరవై సెకన్లపాటు ఇరవై అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడాలి.
ఆటలు ఆడేటప్పుడు పిల్లలు సరైన భంగిమలో కూర్చుని ఆడాలి. లేకపోతే చిన్నవయస్సులోనే స్పాండిలైటిస్ వచ్చే ప్రమాదం ఉంది.
ప్రతి ఆరునెలలకోసారి పిల్లలకు కంటి పరీక్షలు చేయించాలి.
డిజిటల్ పరికరాల వాడకాన్ని పరిమితం చేయాలి. మరీ చిన్న పిల్లలకు ఈ పరికరాలను ఇవ్వకూడదు.
ఇలా చిన్న చిన్న చిట్కాల ద్వారా పిల్లల కళ్లపై పడే ఒత్తిడిని తగ్గించవచ్చు. తరచూ కంటి పరీక్షలు చేయించడం ద్వారా త్వరగానే కంటిలోపల ఏర్పడే సమస్యను గుర్తించి తగు చికిత్సను కూడా చేయించవచ్చు. లేకపోతే కంటిచూపు సంబంధిత సమస్యలు మొదలైపోతాయి. ఇలా కాకుండా తల్లిదండ్రులు పిల్లల కళ్లను గమనిస్తూ సమస్య రాకుండా కంటిపాపను కాపాడటం వల్ల వారి చూపును, భవిష్యత్తును కాపాడినట్లవుతుంది.