మెయిన్ ఫీచర్

బహుభాషా సుందరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిస్ ఇండియా వరల్డ్ అనుక్రీతి వాస్. చెన్నైలో పుట్టి పెరిగిన ఈ చిన్నది చిన్నప్పటి నుంచీ చురుకే. మధ్యతరగతి అమ్మాయైన అనుక్రీతి చదువుల్లోనే కాదు, ఆటపాటల్లోనూ, ఇతర భాషలు నేర్చుకోవడంలోనూ, అందాల పోటీల్లోనూ ప్రతిభావంతురాలే.. అయితే కుటుంబ పరిస్థితులరీత్యా చిన్నవయస్సులోనే తండ్రి దూరం కావడంతో తల్లే ఆమెను కంటికి రెప్పలా కాపాడింది. ఆమెకు ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా వాటన్నింటినీ గుండెల్లో దాచుకుని క్రీతిని ప్రేమగా పెంచింది. అనుక్రీతి చెన్నైలోని ఆర్‌ఎస్‌కె హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుకుంది. ఇంటర్‌ను లయోలా కాలేజీలో పూర్తిచేసింది. తరువాత తల్లి కోరిక మేరకు ఫ్రెంచ్‌లో బీఏ చేస్తోంది. ఆమె అనువాదకురాలు కావలనేది క్రీతి తల్లి ఆశ. క్రీతికి కూడా భాషలు నేర్చుకోవడమంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆమె పది ప్రపంచ భాషల్ని నేర్చుకుంది. చదువు, భాషలతో పాటు డాన్సంటే కూడా చాలా ఇష్టం అనుక్రీతికి. వేదికలపై ఎన్నో ప్రదర్శనలిచ్చింది ఈమె. బైకన్నా, బైక్ రైడింగ్ అన్నా చాలా ఇష్టం అనుక్రీతికి. అందుకే ఏమాత్రం తీరిక దొరికినా బైక్ తీసుకుని రయ్‌మంటూ రైడింగ్‌కు వెళ్ళిపోతుంది. అంతేకాదు స్కూల్, కాలేజీల్లో ఉన్నప్పుడు రాష్టస్థ్రాయి అథ్లెట్‌గా చాలా పోటీల్లో పాల్గొంది. డిగ్రీ మొదలుపెట్టిన తరువాత అనుక్రీతి మోడలింగ్‌ను ఎంచుకున్నప్పుడు బంధువులు, స్నేహితులు అందరూ క్రీతి తల్లిని నానారకాలుగా విమర్శించారు, నిందించారు. అయినా ఆమె కూతురి లక్ష్యానికి ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహించింది. కూతురి లక్ష్యాన్ని సమర్థించింది. కొంతకాలం మోడలింగ్ చేసిన తరువాత అనుక్రీతి అందాల పోటీలవైపు మొగ్గు చూపింది. అందుకు స్ఫూర్తి మాత్రం ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయే. చిన్నతనంలో ఐశ్వర్యారాయ్‌ని ప్రపంచసుందరిగా టీవీలో చూసినప్పటి దృశ్యం ఆమె మనసులో నాటుకుపోయింది. అదే ఆమెను అందాలపోటీలవైపు నడిపించింది. ఈ నిర్ణయాన్ని మాత్రం బంధువులెవ్వరూ సమర్థించలేదు. కానీ క్రీతి తల్లి మాత్రం కూతురికే అండగా నిలిచింది. అలా అనుకున్న క్రీతి కొన్ని నెలలకే మిస్ తమిళనాడు, మరో అందాలపోటీలో విజేతగా నిలబడి చూపరుల్ని తన అందచందాలతో కట్టిపడేసింది. తరువాత ఈమె చూపు మిస్ ఇండియా పోటీలపై పడింది. అయితే ఈ పోటీల్లో క్రీతికి తన తల్లి ప్రోత్సాహంతో పాటు రకుల్‌ప్రీత్ సింగ్ చేసిన సూచనలు బాగా పనికొచ్చాయి. పోటీలకు వెళ్ళేముందు క్రీతి రకుల్ దగ్గరే శిక్షణ తీసుకున్నారు. ఎందుకంటే అందాలపోటీల్లోని సౌత్ జోన్ ఇన్‌ఛార్జ్‌గా రకుల్ వ్యవహరిస్తోంది. అందం, అభినయం, ఆత్మస్థయిర్యం, ఆహారం, నడక, నడత, హావభావాలు వంటి విషయాలన్నింటిలోనూ రకుల్ సలహాలు ఇచ్చింది. అలా పందొమ్మిదేళ్ళ అనుక్రీతి వాస్ ఇప్పడు మిస్ ఇండియా వరల్డ్ అనుక్రీతి వాస్‌గా మారింది.

-విశ్వ