మెయిన్ ఫీచర్

అసలెందుకిలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నానాటికీ పెరిగిపోతోంది జనంలో అశాంతి, అసంతృప్తి. నిరుద్యోగికి సుఖంలేదు, ఉద్యోగికి సంతృప్తి లేదు, విద్యార్థుల్లో శాంతీ సహనం లేదు. గృహంలో వున్న యజమానికీ, ఇల్లాలికీ సహనం లేదు, సంతోషం లేదు. భార్యాభర్తల మధ్య రసానుభూతినీ ఆస్వాదించలేకపోతున్నారు. ఎందుకని? అని ప్రశ్నించుకుంటే, సమాధానాలు, మనని పూర్తిగా సమాధానపరచలేవు.
డబ్బుకి లోటా? ఈ రోజున అందరి దగ్గర ఎంతో కొంత డబ్బుంది. ఏదో ఒక లోనుంది, చెయ్యాలనే చిత్తశుద్ధీ సంకల్పం ఉండాలే తప్ప. మరేమిటి? ఆశ దురాశగా మారుతోంది. తమకున్నవాటిని వాడుకుని తృప్తిపడడం పోయి పొరుగమ్మ చీరలతో నగలతో పోటీలు ఆడవాళ్లకి, పొరుగయ్య అభివృద్ధి మీదే కన్ను మగవాళ్లకి. పిల్లల ధోరణీ అలాగే వుంటోంది. పైగా తమకి లేదన్న బాధకన్నా, ఉన్నవాళ్లమీద కోపం, కక్ష పెంచుకోవడం జరుగుతోంది. పొరుగింటివారు ఒక అంతస్థు బంగళా కడితే మీరు రెండతస్థులు కట్టవలసిందే.. వారు కొనుక్కున్నకారు కన్నా మన కారు ఇంకా పెద్దదిగా లేటెస్టుగా వుండాలి. ‘అంతా స్టేటస్ సింబల్స్’. ఇంట్లో వంట్లో ‘స్టేట్ ఆఫ్’ పరిస్థితి పట్టించుకోరు. వీటితో అందరిలో పెరిగేవి అసంతృప్తి, ఒత్తిళ్లు. ఒత్తిళ్లు తట్టుకునే శక్తి యుక్తీ లోపిస్తే హత్యలూ, ఆత్మహత్యలూ... మధ్య మధ్యలో అనారోగ్యాలూ, యాక్సిడెంట్లు రకరకాల సమస్యలు. ఈ దురాశలవల్ల కలిగే నిరాశలు, మిగిలే నిట్టూర్పులూ. దురాశలో దురపిల్లడం దేనికి? దేముడున్నాడా లేడా వితండవాదాలు.
దేముణ్ణి నమ్మకపోతే నమ్మకండి, నీతినీ నియమాలనీ నమ్మకపోవడం విజ్ఞానమా? విర్రవీగడమా? దానివల్ల కలిగేది కూడా అశాంతే. అశాంతి ఎందుకు? ఉన్నదానితో సంతోషంగా భార్యాభర్తలూ పిల్లలూ, వచ్చేపోయే బంధువులూ, స్నేహితులూ ఆనందానికి మూలస్తంభాలు. ఉపయోగించుకోవడం, ఇంటిని స్వర్గసీమగా, శాంతి నిలయంగా మార్చుకోవడం మన చేతుల్లో వుంది. చిల్లర తిరుగుళ్లూ, చెత్త సినిమాలూ దేనికి చూడాలి? ఏం నేర్చుకోవాలి? చూశాక ఏం పొందుతున్నాం, మనని మనం ప్రశ్నించుకోవాలి. ఆ ఖర్చుతో ఇంట్లో అందరూ కబుర్లతో, జంక్‌ఫుడ్ టిఫిన్లు కాక, ఆరోగ్యకరమైన భోజనాలతో హాయిగా గడపడం అసాధారణం కాదు కదా? అలా చెయ్యడంలేదెందుకు? యువతలో పెళ్లిమీద అభద్రతాభావం. మరి ప్రేమలో లేదా? సహజీవనంలో లేదా? చచ్చేంత వుంది. అయినా ఒక ఫాషన్ కింద చేస్తున్నారు. సర్దుబాటుతనాన్ని చంపేస్తున్నారు.
సర్దుబాటుతనం భార్యాపిల్లలమధ్యా, స్నేహితులమధ్యా, ఇరుగు పొరుగులమధ్య హెల్పర్స్ మధ్యా అంతటా అత్యంత అవసరమని గుర్తించడం లేదు. అందరికీ షార్ట్‌కట్ సక్సెస్ కావాలి. అదీ వెంట వెంటనే కావాలి. ఆడా మగా అందరిలో వచ్చిన ఈ మార్పులే ఒత్తిడికి కారణాలనిపిస్తుంది. మనం మారాలి. మన సంస్కృతిని పాటిస్తే మనం మహారాజుల్లా బతకచ్చు. ఆధ్యాత్మికత కాదు అనాగరిగత, గుర్తుంచుకోవాలి. మనుషులుగా బతకాలి, మనీషులుగా ఎదగాలి, మానవత్వమే మనుగడకి నాంది. అవునా?

-శారదా అశోక్‌వర్థన్