మెయిన్ ఫీచర్

ముఖ సౌందర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాతావరణం మారింది. ఈ మార్పు ముఖ చర్మంలో వెంటనే తెలిసిపోతుంది. ముఖం అంతా ఎండిపోయినట్టు కాంతి విహీనంగా, అసహ్యంగా తయారవుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఒకేరోజులో ఎండ, విపరీతమైన ఉక్కపోత.. వెంటనే వర్షం, చల్లని గాలులు.. ఇలా ముఖం తాజాదనాన్ని కోల్పోయి అందవిహీనంగా తయారవుతుంది. అలాకాకుండా వర్షాకాలంలో కూడా ముఖం కాంతులీనుతూ అందంగా ఉండాలంటే ఇంట్లోనే కొన్ని రకాల ఫేస్‌ప్యాక్‌లను తయారుచేసుకుని ముఖానికి వేసుకోవడం వల్ల ముఖం మళ్లీ తాజాదనాన్ని సంతరించుకుంటుంది. అవేంటో చూద్దాం..
ఓట్‌మీల్, గుడ్డుతో..
ఒక బౌల్‌లో మూడు స్పూన్ల ఓట్‌మీల్‌ను తీసుకోవాలి. దీనికి ఒక స్పూను గుడ్డులోని తెల్లసొనను వేయాలి. ఇందులో కొద్దిగా తేనె, ఒక స్పూను పెరుగును లేసి బాగా కలపాలి. ఇది బాగా కలిసిన తరువాత పక్కనపెట్టుకోవాలి. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడిగేయాలి. పక్కన పెట్టుకున్న ఓట్‌మీల్ మిక్స్‌ను ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. దీనివల్ల ముఖంపై ఉన్న ముడుతలన్నీ పోయి, ముఖం కాంతులీనుతుంది.
ఓట్‌మీల్, రోజ్‌వాటర్‌తో..
ఒక బౌల్‌లో మూడు స్పూన్ల ఓట్‌మీల్‌ను తీసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూను రోజ్‌వాటర్ కలపాలి. ఇందులోనే కొద్దిగా తేనె, ఒక టేబుల్ స్పూన్ పెరుగును వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. దీనివల్ల ముఖంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి, ముఖం కాంతులీనుతుంది. ఈ ఫేస్‌ప్యాక్‌ను వారానికోసారి వేసుకోవడం వల్ల ముఖం అందంగా, నునుపు తేలుతుంది.
ముల్తానీమట్టితో..
ఒక బౌల్‌లో రెండు స్పూన్ల ముల్తానీమట్టిని తీసుకోవాలి. అందులో సరిపడా రోజ్‌వాటర్‌ను కలిపి మెత్తని మిశ్రమంలా తయారుచేయాలి. దీన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత చల్లనినీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల వాడిపోయిన చర్మం తేమను పీల్చుకుని తాజాదనాన్ని సంతరించుకుంటుంది.
శనగపిండితో..
ఒక బౌల్‌లో రెండు, మూడు స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి. దీనిలో కొద్దిగా పసుపును వేయాలి. దీనికి కొద్దిగా నిమ్మరసాన్ని, రోజ్‌వాటర్‌ను కూడా చేర్చి మెత్తని మిశ్రమంలా కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి పదిహేను, ఇరవై నిముషాల తర్వాత కడిగేయాలి. ఇది అన్ని చర్మతత్త్వాలకు సరిపోతుంది. ఇలా తరచూ చేయడం వల్ల వాతావరణ మార్పుల వల్ల ముడుచుకుపోయిన ముఖం తాజాదనాన్ని సంతరించుకుని నిగనిగలాడుతుంది.
తాజాపండ్లతో..
ఒక బౌల్‌లో అరటిపండు చిన్న ముక్క, ఆపిల్ ముక్క, పీచ్ ముక్క, స్ట్రాబెర్రీ ఒకటి తీసుకోవాలి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ తేనెను వేసి స్పూన్‌తో పండ్లన్నింటినీ మెత్తగా చిదమాలి. ఇలా కాసేపు చిదుముతూ ఉండటం వల్ల, తేనె వేయడం వల్ల ఇది మెత్తని పేస్ట్‌లా తయారవుతుంది. ఆపిల్ ముక్క వేసేటప్పుడు తొక్కతీసుకోవాలి. అప్పుడు మెత్తగా అవుతుంది. అవసరమైతే బ్లెండ్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఈ మాస్క్ వల్ల వెంటనే ఫలితం ఉంటుంది. ముఖం తాజాగా మారుతుంది. వర్షాకాలంలో ఈ ప్యాక్ వల్ల నిర్జీవంగా మారిన చర్మం తేమను సంతరించుకుంటుంది. కాంతులీనుతుంది.
*