మెయిన్ ఫీచర్

ప్రయత్నంతో విజయం తథ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీటి ప్రవాహానికి ఏదైనా కొండ అడ్డువస్తే ఆ కొండను అధిగమించో లేక ఆ కొండ పక్కనుంచే చిన్న వాగులా మారి ప్రవాహం సాగిపోతూ ఉంటుంది. ప్రవాహానికి ఏది అడ్డు వచ్చినా తన రూపం మార్చుకుంటూ కురచగానో, ఉవ్వెత్తునో, విశాలంగానో ఏదో ఒక విధంగా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అట్లానే తరుణుల జీవితాలు ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని అధగమించో లేక వాటిని పక్కన పెట్టో ఏదో ఒకవిధంగా జీవితాన్ని సాగిస్తుంటారు మహిళలు.
ఏ మహిళా తన జీవితంలో ఏర్పడిన అడ్డంకులు చూసి జడసి పోయి నిమ్మకు నీరెత్తిన్నట్టు ఊరుకుండదు. తనవంతు ఆలోచనలు చేసి కొద్దిగా ఆలస్యమైనా సరే అణగారిపోయిన తన ఉనికిని మళ్లీ రాజేస్తుంది. ఉవ్వెత్తున ఎగిసేలా చేస్తుంది. తననే కాదు తనను నమ్ముకున్నవారినీ లేక తన చుట్టుపక్కల ఉన్నవారికీ చేదోడు వాదోడుగా మారుతుంది. ఇదే మహిళల్లో ఉండే ప్రత్యేకత అంటారు మానసిక శాస్తవ్రేత్తలు.
అట్లాంటి మహిళనే మెకానిక్ మీరాబాయ్.
మీరాబాయ్ లో గొప్పతనం ఏమంటారు. అలనాటి మీరాబాయి అయితే చక్కని సంగీతంతో శ్రీకృష్ణుని మెప్పించి తన చెంతకు చేర్చుకోగలిగింది. ఆ మీరాబాయినే ప్రేరణగా తీసుకొన్న ఈ మీరాబాయి తన జీవితంలో ఏర్పడ్డ వెలతిని తనకు తానే పూడ్చుకుని పక్కవారి కళ్లల్లో వెలుగును చూసి సంతృప్తి చెందుతోంది.
మీరాబాయి సాధారణ మహిళ. ఉదయపూర్‌కు 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరావళి పర్వతశ్రేణుల దగ్గర ఉన్న గ్రామం పధూన లో ఈమె నివసిస్తుంటుంది. మీరాబాయి కూడా అందరి ఆడపిల్లల్లాగే వారి తల్లిగారింటి వారు వివాహం చేశారు. కాకపోతే రెండోపెళ్లి. మద్యతరగతికి చెందిన మీరాబాయి తన వివాహ జీవితాన్ని సర్దుబాటుతోనే ఆరంభించింది. కాని విధి వెక్కిరించింది. వివాహం అయిన నాలుగేళ్లకే భర్తను కోల్పోయింది మీరాబాయి. తిరిగి తన అన్న దగ్గరకు వచ్చేసింది.
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పధూన గ్రామం లో అమ్మాయిలు అబ్బాయిలతోపాటు చదువుకోవడానికో, ఉద్యోగం చేయడానికి ముందుకు వెళ్లే సదుపాయాలు ఇంకా అక్కడ రాలేదు. దానితో ఎంతో బాధతో ఇంట్లోనే ఉండిపోయింది మీరా. కాని, మీరా మనసు మాత్రం ఆలోచనల సుడిగుండాన్ని మథించడం మొదలెట్టింది. తన బతుకునేవిధంగా నెట్టుకురావచ్చో అని రోజంతా ఆలోచించేది మీరాబాయి.
అదిగో అపుడే వెక్కిరించిన విధినే తిరిగి అవకాశాన్ని చూపింది. ప్రభుత్వం వారు ఉత్సాహవంతులకు చేతిపంపుల రిపేరుకు శిక్షణ ఏర్పాటు చేశారు. తాను ఆ శిక్షణను నేర్చుకుంటే బాగుండు కదా అనుకొంది మీరాబాయి.
దీనికి కారణం వారి గ్రామ పరిస్థితులే. ఆ గ్రామానికే కాదు చుట్టు పక్కల గ్రామాల వారికి కూడా అక్కడ వేసవిలో నీటి ఎద్దడితోఅవస్థలు పడేవారు. చాలా దూరాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకునేవారు. ఒక్కోసారి వారికి ఎంత దూరం వెళ్లినా నీరు దొరికేది కాదు. ఆ పరిస్థితులను తట్టుకోవడానికి ప్రభుత్వం వారు రోడ్ల పక్కన చేతి పంపులను ఏర్పా టు చేశారు. కాని అవి రెండుమూడునాళ్లకే పనిచేసేవి కావు. తిరిగి మెకానిక్ వచ్చి బాగు చేసేదాకా మరలా నీటి కొరత నే అక్కడి వారికి.
అందుకే మీరాబాయి తానే ఆ రిపేరుచేయడం నేర్చుకుంటే బాగుంటుంది కదా అనుకొంది. వెంటనే అన్నయ్య తో చెప్పింది. గ్రామంలో ఆడపిల్లలు బయటకు వెళ్లే సంప్రదాయం లేకపోయినా నలుగురికి మంచిని చేయవచ్చు అని మీరాబాయి తన అన్నయ్యకు నచ్చచెప్పింది. చెల్లెలి మంచి మనసును చూసి శిక్షణలో చేర్పించాడాన్నయ్య.
మీరాబాయి చేతిపంపుల రిపేరు చేయడంలో సుశిక్షితురాలైంది మూడు నెలల్లోనే. అంతే ఇక అప్పట్నుంచి ఎక్కడ ఏ చేతి పంపు పాడైనా సరే మీరాబాయి చేయి తగిలితే ఆ పంపు భూగర్భంలోని నీటినైనా పైకి విరజిమ్ముతుంది అనే నమ్మకం ఆ గ్రామ వాసులకు కలిగింది. అప్పటిదాకా మూతి విరిచిన వారే మీరాబాయి పనితనాన్ని చూసి మెచ్చుకున్నారు. రిపేరుతో బాగైన పంపులనుంచి నీటిని పట్టుకున్నవారి కళ్లల్లో ఆనందాన్ని చూసి తన కళ్లల్లో ఆనందాన్ని నింపుకుంటుంది మీరాబాయి. నలుగురి దాహార్తిని తీర్చగలుగుతున్నానన్న ఆత్మసంతృప్తి నాకు ఉందని గుండెల నిండా ఊపిరి పీల్చుకుని చెబుతుంది మీరాబాయి.
ఆమె ప్రతి మహిళా తానుబతకడమే కాక మరో నలుగురికి చేదోడువాదోడుగా ఉండాలి. అపుడే మహిళలు అభివృద్ధి పథంలో ఉన్నట్టు అంటారు మీరాబాయి. తన జీవితానే్న ఒక ప్రేరణగా తీసుకుని ప్రతి మహిళ ఆమెకు ఎదురయ్యే సమస్యలను అధిగమించాలని ఆమె కోరుకుంటారు.

-చివుకుల రామమోహన్