మెయిన్ ఫీచర్

అందం ఆనందం మీదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగా కాలేజీలకు వెళ్లే అమ్మాయిల్లో కాస్త బెరుకు మరికాస్త ఉత్సాహం ఉంటుంది. ఉత్సాహానికి తగ్గట్టుగా డ్రస్సులు, బ్యాగ్స్, వారి స్టైల్ ఇవన్నీ చక్కగా నప్పాయి అని వారు అనుకుంటే చాలు ఇక బెరుకు గిరుకు లేకుండా ముందుకు దూసుకెళ్తారు.
ఎవరికైనా వారు వేసుకొనే దుస్తుల ప్రభావం వారిపైన తప్పక ఉంటుంది. మనం ధరించిన దుస్తులు ఎదుటివారికి మనపై ఒక అభిప్రాయాన్ని కలిగిస్తాయి అనేది ఒక మాట. కాని, దానికన్నా ముందే ఆ దుస్తుల మన మనస్సుపై ప్రభావాన్ని చూపుతాయి.
అందుకే ముందుగా అమ్మాయిలు వారికి నప్పే కలర్స్, వారికి నప్పే డ్రస్ లనే ధరించాలి. ఎక్కడో చూశామని మరెవరో వేసుకొన్నారని వీరు ధరించడానికి ముందుకు రాకూడదు. ఆ దుస్తులు ధరిస్తే కంఫర్ట్‌బుల్‌గా ఉన్నాయాలేదా ముందు చూసుకోవాలి. అవి ఎబెట్టుగా ఉన్నాయా లేక నలుగురికీ ఆదర్శంగా ఉన్నాయా అన్నదాని చూడాలి. ఇక ఆ రెండూ ఒకే అనుకొంటే ఆ డ్రస్‌లో మీ అందం రెట్టింపే. రెండో ఆలోచనే లేదు.
ఇక భుజాన వేలాడే బ్యాగ్. ఆ బ్యాగ్స్ నేడు విపరీతమైన స్టైల్స్‌లో, కలర్స్‌లో బజారంతా నిండి ఉన్నాయి. వాటిలో మీకు అనువైనవి ఏవో మీరు గుర్తించాలి. మొదట మీరు ఆ బ్యాగ్‌నే ఎందుకు ఎన్నుకొంటున్నారో తెలుసుకోవాలి. మీరు తీసుకెళ్లాల్సిన వస్తువులను బట్టి ఆ బ్యాగ్‌ను ఎన్నుకోండి. సైజు, కలర్, అందులో జిప్స్ ఇవన్నీ సరిగా ఉన్నాయా లేదా చూడండి. ఆ పైన మీరు వేసుకొన్న డ్రస్‌కు ఆ బ్యాగ్ నప్పుతుందా లేదా సరిచూసుకోండి. కాలేజీలో చదువుకోవడానికి వెళ్లేటపుడు వేసుకొనే బ్యాగ్ వేరుగాను, ఫ్రెండ్స్ తో వెళ్లేటపుడు లేక సినిమాకో షికారుకో వెళ్లేటపుడు వేసుకొనే బ్యాగ్ ట్రెండీ గా ఉండేట్టు చూసుకోండి. ఆ బ్యాగ్‌ను బట్టి మీ మనసును చదివేయగలిగేట్టుగా ఉండాలి. ఆధునికతతో పాటుగా అరలతో సౌకర్యంగా ఉండాలి. డబ్బులతో పాటుగా కాటుక, బొట్టు, హెయిర్ పిన్స్, బాండ్స్ చిన్న అద్దం, లిప్‌స్టిక్ , పెన్ , వైట్ పేపర్ ఇలాంటివి పెట్టుకోవడానికి వీలుగా ఉండే బ్యాగ్స్‌ను ఎన్నుకుంటే బాగుంటుంది.
ఇకమీరు ధరించే చెప్పులు.. ఇప్పుడు వానలు వంగడి ఆ తరువాత ఎండ దారిలో మీరు కాలేజీకి వెళ్లేటపుడు బైక్‌మీదనా, లేదా బస్సులోనా లేదా మెట్రోనా ఇలా దేనిమీద వెళ్తున్నారో వాటిని బట్టి కూడా పాదరక్షలను ఎన్నుకోవల్సి ఉంటుంది. మీ పాదాలను రక్షించాలి. అట్లాగే మీరు ధరించిన డ్రస్సుకు నప్పేవిధంగా కూడా ఉండాలి. అటు డ్రస్సు, బ్యాగ్ రెండింటికీ సరైన జోడిగా చెప్పులుండేలా చూసుకోవాలి. ఇక మీ హెయిర్ స్టైల్... ఇది కూడా మీ ముఖానికి తగ్గట్టు గా ఉండేలా చూసుకొంటే అందంలో మీకు సాటి ఎవరూ రారు. జుట్టు వదిలేసినా, జడ అల్లుకున్నా, పిన్స్ పెట్టి అందంగా పేర్చుకున్నా సరే అది మీ ముఖాకృతి అందాన్ని రెట్టింపు చేసేలా చూసుకోండి. మీ బ్యాగ్‌లో నాలుగైదు రకాల హెయిర్‌బ్యాండ్స్ పెట్టుకోండి. అవసరానికి తగ్గట్టు ఈ హెయిర్‌కు పెట్టండి. ఇక రోజంతా మీ కేశాలు మీ మాటను కాదనవు.

-లక్ష్మీ ప్రియాంక