మెయిన్ ఫీచర్

పొదుపుతో ఆత్మవిశ్వాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటికాలంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నా సరే ఒకటో తేది రాగానే గాబరా పడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అంతేకాదు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు, అనారోగ్యాలు దరిచేరినప్పుడో ఇక డబ్బుల గురించి చెప్పనక్కర్లేదు. ఎన్నో భీమా సంస్థలు అనారోగ్యాలున్నవారికోసం పథకాలు తెస్తున్నాయి. కాని చాలామందికి ఇవన్నీ ఉన్నాసరే... ఏదో ఒక బాధపడేవారే ఎక్కువ మనదేశంలో.
దీనికి కారణం మేమిటంటే సరియైన జీతాలు లేకపోవడం. వచ్చిన డబ్బులను క్రమబద్దీకరణ లేకపోవడంతో సరియైన టైములో డబ్బుకు అవస్థలు పడుతుంటారు.
కొంతమంది మహిళలు ఉద్యోగం చేస్తున్నా సరే... ఆర్థిక విషయాలను అంతగా పట్టించుకోరు. అందులో పొదుపు గురించి ఆలోచించరు. పైగా ఎవరైనా అడిగితే మావారు చూసుకొంటారు. నాకాబాధలేమీ అక్కర్లేదు అని ధీమాగా చెబుతుంటారు. పైగా తమకు వచ్చిన డబ్బులను ఎక్కువగా చీరలకు, నగలకు ఖర్చుపెట్టేస్తుంటారు. ఇది అంత మంచి విషయమేమీ కాదు. పురుషులకన్నా మహిళలే ఆర్థిక విషయాలను చూడాలి. వారే సరియైన పొదుపర్లు అంటారు మార్కెటు నిపుణులు.
ఇంకా ఇపుడు టీనేజ్‌లోనే ఉద్యోగంలో చేరే వారు కొందరుంటారు. వారికి కొత్త ఉద్యోగం.. కొత్త జీతం.. కాని కొత్త ఫ్రెండ్స్ దాంతో ఖర్చుపై అదుపు లేక అవసరాలకు డబ్బు వెదుక్కోవాల్సే వస్తోంది. పైగా వీరికిక్రెడిట్ కార్ట్స్ ఉంటున్నాయి. అవసరం లేకపోయినా ఎవరో ఫ్రెండ్స్ కొన్నారనో లేక ఆఫర్ బాగుందనో ఫోన్లు, బట్టలు, వాచీల్లాంటివి ఈ కార్డ్స్ లో కొంటుంటారు. కొన్నప్పుడు స్టైలిష్‌గా బాగుంటుంది. కాని నెలాఖరుకు డబ్బులు కట్టేటపుడు పెద్ద మొత్తంలో వడ్డీతో సహా కట్టాల్సి వుంటుంది. అపుడు బాధ వేస్తుంది. అందుకే కార్డ్స్ వాడేటపుడు ఒకటి పదిసార్లు ఆలోచించాలి.
అందుకే చిన్నప్పటినుంచే పొదుపు చేయడం నేర్చుకోవాలి.
కొత్త ఉద్యోగం లో చేరడంతోనే వెంటనే ఎక్కడెక్కడ పొదుపు చేస్తే మదుపు ఎలా ఉంటుందో అన్న విషయాలు అడిగి తెలుసుకోవాలి.వాటిల్లో పొదుపు కొంతైనా చేయాలి. అపుడే అవసరాల్లో ఆదుకునే హస్తం కోసం చూడనక్కర్లేదు.
పోస్ట్ఫాసుల్లో రికరింగ్ డిపాజిట్లు ఉంటాయి. వీటిల్లో పది రూపాయల దగ్గర నుంచి దాచుకోవచ్చు. వీటిల్లో ఏ ఇబ్బంది లేకుండా తిరిగి వడ్డీతో సహా పొందవచ్చు. దీంట్లో ఐదేళ్లపాటు కట్టుకొంటే తిరిగి 6.9 శాతం వడ్డీతో పొందవచ్చు. నెలవారీ గాని, మూడు నెలలకోసారి గాని కట్టుకోవచ్చు.
పబ్లిక్ ఫ్రావిడెంట్ ఫండ్ ఇది చాలా సురక్షితమైన పొదుపు.. ఇందులో దాచుకున్నవారికి ఆదాయపు పన్ను మినహాయింపుకూడా వస్తుంది. ఏడాదికి 500 నుంచి లక్షా యాభైవేల వరకూ పొదుపు చేసుకోవచ్చు. పదిహేనేళ్ల పాటు కట్టుకోవాలి. మధ్యలో దీని నుంచి రుణాన్ని కూడా పొందవచ్చు. వడ్డీ 7.6 శాతం వస్తుంది. 15 ఏళ్లకన్నా ఎక్కువ కాలం కట్టుకుంటామన్నా దీన్ని పొడిగించుకోవచ్చు.
అంతేకాదు దగ్గరల్లో ఉన్న ఏ బ్యాంకులోనైనా మహిళలకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పొదుపు ఖాతాలల్లో జమచేసుకోవచ్చు. తక్కువ వడ్టీలతో రుణాలు కూడా ఈ బ్యాంకులు ఇస్తాయి. భీమా అవకాశమూ ఉంటుంది. మ్యూచవల్ ఫండ్ ఈరో జుల్లో చాలాకంపెనీలు ఈక్విటీ షేర్స్ ఇస్తున్నాయి. ఆ షేర్లు కొనడానికి అంతగా అవేర్‌నెస్ లేదనుకుంటే మ్యూచువల్ ఫండ్ల ద్వారా స్టాక్ మార్కెటులో డబ్బులు పెట్టుకోవచ్చు. అందులో సిప్ అంటే సిస్టమాటిక్ ఇనె్వస్టిమెంట్ ప్లాన్ దీని ద్వారా ఎంతైనా మదుపు చేసుకోవచ్చు. నిర్ణీత మదుపు చేయాలి అనే నిబంధనలు లేవు కనుక మనం మన బడ్జెట్‌లో మదుపు చేయవచ్చు. కనీసం 500 రూపాయలతో దీన్ని మొదలుపెట్టవచ్చు.
ఇలా చేసారు అంటే మొదలు పెట్టేటప్పుడు కాస్త కష్టంగా అనిపించినా కొన్నాళ్లు డబ్బులు దాచడం అవగానే ఆ పొదుపు ఖాతాలో డబ్బు నిల్వ చూసేసరికి ఒకలాంటి సంతోషం వస్తుంది. మనసులో ధీమా పెరుగుతుంది. ఏ కష్టం వచ్చినా ఎదుర్కోగలను అన్న మనమీద మనకే నమ్మకం పెరుగుతుంది. దానితో కొత్త కొత్త ఆలోచన్లతో ముందుకు పోతారు. మీకు మీరే సంపాదించుకునే స్టేజీ నుంచి నలుగురికీ ఉపాధి చూపించడం.. అక్కడి నుంచి పదిమంది సాయంచేయగల సత్తాను పెంచుకొంటారు.
దీనితో మిమ్మల్ను ఇంట్లోనే కాదు వీధిలో సైతం ఆదర్శవంతులుగా గుర్తించబడుతారు.
ఇంతటి శక్తినిచ్చే పొదుపు గురించి ఆలోచించక ఎప్పుడూ కొత్త ఆకర్షణలకు పోయి నెట్‌లోనో లేక దుకాణాలిచ్చే ఆఫర్లుల్లోనో చీరలు నగలు కొంటారన్న అపవాదు మనకెందుకు అని ఒక్కసారి ఆలోచించండి. ఆలోచన ఉంటే చాలు అందలం మనదే అని రుజువు చేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు దాచే సొమ్ము ఆమె ఒక్కరికే కాదు ఆ కుటుంబం అంతా ఆర్థిక సమస్యలనుంచి దూరంగా మెలగవచ్చు.

- ప్రసన్న