మెయిన్ ఫీచర్

తీరు మారాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటికాలంలో మహిళలు సాధికారత సాధించారు. అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఎవరు పోటికి వచ్చినా ఎందులోనూ తీసిపోము మేము అని మహిళలంతా ఆర్థిక, రాజకీయ, సామాజిక ఇలా అన్ని రంగాల్లోను కృషి చేస్తునే ఉన్నారు.
ఇది అంతా ఒక పార్వ్శమే. మరో పార్శ్వంలో మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఒకచోట మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడేవాళ్లు, మరో ప్రక్క గృహహింస, నలుగురి ఎదుట పెళ్లి చేసుకొన్న మగడు పెట్టే బాధలు పడేవారు, ప్రేమించామని హింసించేవారు, యాసిడ్ దాడులు, కత్తులతో, బ్లేడ్లతో నరికి పోగులు పెట్టేవారు, మరికొన్ని చోట్ల లైంగిక దాడులు అందులో కన్నతండ్రులు, అన్నదమ్ములే, మామలు బావలు ఇలా వావి వరుసలు లేకుండా అత్యాచారాలు చేసేవారు ఇలాంటి వన్నింటి నుంచి మహిళ ఎప్పటికప్పుడు ఎన్నో కష్టాలకు ఓర్చుకుంటూ రోజును గడుపుతోంది.
ఏవైపు నుంచి ఏ మృగం పంజావిసురుతుందో లేక ఏ అడవి జంతువు నమిలి మింగేస్తుందో కూడా తెలియని జనకీకారణ్యంలో ఆడపిల్ల బతుకీడుస్తోంది.
ఇన్ని బాధలు పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది కాని తగ్గుముఖం పట్టడం లేదు.
ఇన్ని బాధలు పడుతూకూడా తన మగడు తన సంసారం తన పిల్లలు బాగుండాలే ఎంతో మంది మహిళలు చిన్న చిన్న ఉద్యోగాలుచేస్తున్నారు.
ఇలాంటి ఉద్యోగాలు చేసేవారు యజమానుల దగ్గర నిత్యం ఎన్నో ఇబ్బందులను పడుతూ జీతంరాళ్లను తీసుకొంటున్నారు. ముఖ్యంగా బట్టల కొట్టులో పని చేసేవారు పడే బాధలు వర్ణనాతీతం. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లోనే పనిచేసే ఆడవారి పైన కాస్తంత జాలి కూడా లేకుండా యజమానులు తమ వ్యాపారం పైనే దృష్టి పెడుతున్నారు. కష్టమర్లు ఉన్నా లేకపోయినా రోజంతా నిలబడే ఉండాలని వారు రూల్ పెడుతున్నారు. కష్టమర్లు లేనప్పుడు కాసేపు కూడా కూర్చోవడానికి వీలును యజమానులు కల్పించడం లేదు.
ఇలా 8 లేక 10 గంటల సమయం నిల్చునే ఉంటే ముఖ్యంగా మహిళల్లో మూత్ర సంబంధ వ్యాధులు, వెరికోస్ పెయిన్స్, కాళ్లు ఉబ్బడం, నడుము నొప్పి, ఇలాంటి రోగాలు వస్తున్నాయి. చాలామంది ఎక్కువ సేపు నిలబడితే వారికి నడుమునొప్పి, కాళ్ల నొప్పితో అల్లాడి పోతున్నారు. చాలా బాధగా ఉంది కాసేపు కూర్చోటాం అని అడిగినా యజమానులు వీలుల్లేదు. మీకు కూర్చోవాలని ఉంటే ఉద్యోగం మానేయండి అని సలహా ఇస్తున్నారు. ఇది ఎంత ఇబ్బంది కరమో కేరళ రాష్ట్రం మాత్రం గుర్తించింది. ముఖ్యంగా సేల్స్ గర్స్ విషయంలో పని గంటలను, వారు కూర్చు ని ఉండే సమయాన్ని నిర్దేశిస్తూ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ చట్టం కోసం అక్కడి మహిళలు స్వచ్ఛంధ సంస్థలు 8 ఏళ్ల పాటు పోరాటం చేశారు. అపుడు కేరళ ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చి కచ్చితంగా మహిళకు స్టూల్ లేక కుఠ్చీ ఉండాలని,వారిని కూర్చోనివ్వాలని, వారిని 8 గంటలకన్నా ఎక్కువ సమయం పని చేయనివ్వకూడదని రూల్ తెచ్చారు.
ఇక మన రాష్ట్రంలో కూడా ఇటువంటి చట్టాలు తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కేవలం బట్టల కొట్టు లోనే కాదు బట్టల షాపింగ్ మాల్స్ లోనే కాదు బంగారం, వెండిషాపులు, స్టీలు, ప్లాస్టిక్ వస్తువులు అమ్మే చోట ఇలా ప్రతి దుకాణంలోనే ఇలాంటి వెర్రి ఉంటూనే ఉంది. మహిళలు నిలబడి కష్టమర్లకు వస్తువులు చూపించాలి. కష్టమర్లు ఉన్నంత వరకూ అంటే ఫర్వాలేదు. కాని ఎవరూ దుకాణంలో లేకపోయనా సరే సేల్‌స గర్ల్స్ మాత్రం నిల్చునే ఉండాలనే నిబంధనలు అనేక ఇబ్బందులకు గురిచేయడమే కని దాని వల్ల వచ్చే లాభం ఏమీ ఉండదు. యజమానుల దాష్టీకం ఇది అనిపిస్తుంది తప్ప కష్టమర్లు లేనపుడు కూర్చోకూడదనే నిబంధన వల్ల షాపు యజమానులు వచ్చే నష్టం ఏమీ ఉండదు. చాలా షాపింగ్ మాల్స్ పురుషులు, స్ర్తిలు నిలబడి ఉండడమే పరిపాటిగా వస్తున్నది.
కాని పురుషులకన్నా స్ర్తిలు ఎక్కువ సేపు నిలబడి ఉండడం వల్ల వారిలో అనేక రుగ్మతలు వస్తున్నాయి. పైగా నెలసరి ఇబ్బందులు కూడా వారికి ఉంటుంటాయి. వాటిని కూడా లెక్కలోకి తీసుకోకుండా అమానుషంగా నిలబడి ఉండాల్సిందే అనే నిబంధనలు బట్టల వ్యాపారాలు ఎవరికి వారు నియమాలు పెట్టుకోవడం మానవత్వానికి మచ్చ. కనుక ఇప్పటికైనా ఏ షాపింగ్ మాల్స్, లేదా చిన్న కొట్లు ఏవైనా సేల్స్ గర్స్ల్‌పనిచేసేచోట కాస్త మానవత్వంతో వ్యవహరించాలి.
అట్లాకాదని వారి దగ్గర పనిచేయకపోవడమే మేలు. మరో చోట ఉద్యోగం తప్పనిసరిగా దొరుకుతుంది అనే నమ్మకంతో అక్కడ పనిచేసే మహిళలు ఐకమత్యంతో మానవత్వం లేని యజమానులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది.

- ప్రసన్న