మెయిన్ ఫీచర్

ప్రేమించు ప్రేమకై..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఎవరైనా ప్రేమించకుండా ఉండలేరు. లోకమంతా ప్రేమమయం. ప్రేమకు ధనవంతులు, పేదవారు అన్న తేడాలుండవు. చదువుకున్న వారు, చదువుకోని వారు అన్న వ్యత్యాసం ఉండదు. ఒకానొక ప్రేమకు వయస్సు కూడా పెద్ద కారణం కాదు. మనసులు రెండు ఒక్కటైతే చాలు ప్రేమ అంకురిస్తుంది. అభిరుచులు, అలవాట్లు ఒక్కటిగా ఉంటే చాలు ప్రేమ బీజం త్వరగా పడుతుంది. ఆకర్షణీయంగా ఉంటే కూడా ఒక్కోసారి ప్రేమాంకురం మొదలవుతుంది. కానీ ఈ ప్రేమ కడదాకా సాగదు. ప్రేమించడం మంచిదే ! ప్రేమ యువత మధ్య అంకురిస్తే అది ఇబ్బందిగా మారనంతవరకూ ఫర్వాలేదు. ఇబ్బందులను తలకెత్తుతుంటే మాత్రం ప్రేమను గురించి ఆలోచించాల్సిందే.
టీనేజీలో ఉన్న వారు ప్రేమగురించి మాట్లాడుతుంటారు. యువతి, యువకుల మధ్య ప్రేమ చిగురించడానికి అట్టే కాలం పట్టదు. కానీ నిలుపుకోవడానికి చాలాకష్టపడాల్సి వస్తుంది. ఈమధ్య ప్రేమ పేరుతో ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతున్నాయ.
ప్రేమ ఎపుడూ వన్‌వే కాకూడదు. ఇద్దరూ ఒకే ఆలోచన గలవారైతే ప్రేమ ఫలిస్తుంది. ప్రేమ ఫలించడానికి చాలా కారణాలుంటాయి.
ఇరువురికి సంబంధించిన ప్రేమే అయినా అది పెళ్లికి దారితీస్తేమాత్రం ఇరుకుటుంబాలకు సంబంధించినదిగా మారిపోతుంది. కుటుంబ పద్ధతులు, వారి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, పట్టింపులు, వారు పెరిగిన పరిస్థితులు ఇవన్నీ ఆ ప్రేమ ఫలించడానికి కారణాలుగా మారుతాయి. కులం ఒక సమస్యగా తయారు అవుతోంది. అందుకే ప్రేమించేవారు కాస్త నిదానంగా ఆలోచించాలి.ప్రేమాంకురం మొదలవబోతుంది అనుకోగానే ప్రేమను పొందేవారి గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఒకవేళ అమ్మాయి ప్రేమిస్తున్నట్టు అయితే ముందుగా ఆప్రేమ గురించి పెద్దవారితో చర్చించాలి. తన మనసులో ఉన్నవిషయం ఏ భయం లేకుండా చెప్పాలి. వారి అభిప్రాయాన్ని పరిగణన లోకి తీసుకోవాలి. నిజమైన ప్రేమ ఎప్పుడూ ఒకరికి నష్టాన్ని కలిగించమని చెప్పదు. ప్రేమించడానికైనా, ప్రేమను పొందడానికైనా విశాల హృదయం ఉండాలి. అన్ని పరిస్థితులను ఎదుర్కొనే శక్తి ఉండాలి. ప్రేమతో అందరి మనసులనూ గెలవగలగాలి. అంతేకానీ దౌర్జన్యంతోనో, పొగరుతోనో ప్రేమ గొప్పది అని చెప్పడానికి వీలుపడదు. అందుకే ప్రేమించాలనుకొన్నవారు ముందుగా వినయం, తర్వాత విశాల హృదయం పెంచుకోవాలి. అందరినీ అప్యాయతతో ఆదరించేగుణాన్ని అలవర్చుకోవాలి. తల్లిదండ్రులూ పిల్లలకు ప్రేమ గురించి విపులంగా చెప్పాలి. కానీ వారిని కట్టడి చేసే ప్రయత్నాలు చేయకూడదు. ఒకవేళ పిల్లలు తప్పుదోవలో నడిచే ప్రయత్నం చేస్తేవారికి పరిస్థితులను విశదపర్చి వారిని మంచిదారిలోకి తెచ్చే ప్రయత్నం చేయాలి.

--మానస