మెయిన్ ఫీచర్

ఆ సమయంలో ఆహారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా సహజంగా ప్రతినెలా మూడురోజుల ఇబ్బంది ఉండనే ఉంటుంది. కొంతకాలం క్రితం 15, 16 ఏళ్లకు రజస్వల అయ్యేవారు. ఇపుడు కాలం మారింది. కాలం తోపాటు మనుష్యులూ మారారు. ఒక అధ్యయనం ప్రకారం ఈ రజస్వల కావడం కూడా ప్రతి పదిహేనేళ్లకొకసారి మార్పు వస్తుంటుందట. అందుకేనేమో ఇపుడు 11,12 ఏళ్లకే రజస్వల అవుతున్నారు.
చాలా చిన్న వయస్సు. కానీ ఇబ్బంది ఇబ్బంది. ఎదుర్కోవలసిందే. ప్రతి నెలా వచ్చేదే అయినా ఎన్నో సమస్యలు, మరెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. అతిగాఅయినా, అసలు కాకపోయినా, సరిగా రాకపోయినా, మధ్యలో ఆగిపోయినా, ఏదైనా సమస్యగానే పరిణమిస్తోంది. వాటిని గురించి తెలుసుకోవాలంటే చాలానే ఉంది.
ముఖ్యంగా ఆహార విషయం ఈరోజు చూద్దాం.
ఈ మూడురోజులు ఇవి తినవచ్చా? ఇవి తినకూడదా అనే సందేహాలు చిన్న అమ్మాయిలకే కాదు పెద్దవాళ్లకూ ఈ సందేహం వస్తూనే ఉంటుంది. కొందరు నువ్వులు తినకండి బాగా వేడిచేస్తుంది. అతి సావ్రం జరుగుతుంది అంటారు. మరికొందరు బొప్పాయి పండు అసలు ముట్టుకోకుండా స్ర్తిలు అసలు తినకూడదు అంటారు.
మరికొంతమంది ఎక్కువ నీరసం వస్తుంది. ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి వస్తుందంటారు.
ఇలా రకరకాలుగా చెప్పేవాళ్లు చాలామందే ఉంటారు. ఈ చెప్పేవిషయాల్లో ఏది నిజం ఎంత వరకు వీటిని నమ్మవచ్చు అంటే డాక్టర్ను సంప్రదించాల్సిందే.
నువ్వులు, కొబ్బరి, బెల్లం తీసుకోవడం సంప్రదాయమే కావచ్చు. కానీ వీటిల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది కనుక మోతాదుకు మించకుండా తీసుకుంటే మంచిదే.
నెయ్యి ఎక్కువగా తీసుకోవాలనే విషయంలో నెయ్యి కన్నా వెన్న తీసుకోవడం ఎన్నో విధాలుగా మంచిది. నెయ్యి చేసే క్రమంలో కొన్ని పోషకాలు తక్కువ అయిపోతాయి.
ఒకవేళ మీరు మాంసాహారులైతే రోజువారీ ఆహారాన్ని తీసుకోవడమే మంచిది. ఒకవేళ మాంసాహారం తీసుకోవాలి అనిపిస్తే వేట మాంసం, చేపలు, చికిన్ లాంటివి తీసుకోవడం మేలు.
కోడిగుడ్డు తినేవారైతే ప్రతిరోజు ఈ గుడ్డును ఈ సమయంలో తీసుకోవడం వల్ల హానికరమైన కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది.
వీటితో పాటుగా విటమిన్ సి, ఐరన్ లాంటివి శరీరానికి అవసరమై ఉంటాయి. కనుక తాజాపండ్లు అందులోను విటమిన్ సి ఉండేవాటిని నిమ్మ, నారింజ, బత్తాయి లాంటి పండ్లు తీసుకోవడం మంచిది.
ఎక్కువ కొబ్బరినీళ్లు, మంచినీరు తీసుకోవాలి. కొవ్వులుంటే ఆహారాలు మితంగా తీసుకొంటేనే మంచిది. బేకరీ ఐటమ్స్ అంటే బర్గర్లు, పిజ్జాలు మాత్రం మంచివి కావు.
చాలామంది ఈ మూడు రోజులు వ్యాయామాలు మంచిది కాదంటారు. కానీ మరీ ఎక్కువగా కాకుండా వారి శరీర స్థితిని బట్టి కొద్దిపాటి వ్యాయామం లేకపోతే నడక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది.

- మానస