మెయిన్ ఫీచర్

ఈ డాక్టర్ సర్పంచ్ కూడా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజస్తాన్, హరియాణా కలిసి పంచుకున్న ప్రాంతం గడ్జన్ గ్రామం అది. ఈ రెండు రాష్ట్రాల ఫ్యూడల్ స్వభావం ప్రబలంగా ఉన్న ఊరు.. ఇక్కడి ఆడపిల్లలను స్కూళ్లకు పంపరు.. చిన్నవయస్సులోనే పెళ్లిళ్లు చేసేస్తారు. ప్రతి ఆడపిల్లకు తలపై గూంఘట్ ఉండాల్సిందే.. ఒకవేళ పొరపాటున గూంఘట్ తలపై నుండి జారిందా.. అంతే సంగతులు.. అలాంటి ఊరు ఒకటి మైనారిటీ వర్గం పాలనలో ఉంది.
హనీఫ్ ఖాన్ అనే యాభై ఐదు సంవత్సరాలు గడ్జన్‌కు ఊరి సర్పంచ్‌గా పనిచేశాడు. ఇంకా కూడా కొనసాగేవాడేమో.. కానీ కోర్టు మాత్రం అతను సర్పంచ్‌గా కొనసాగడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. కారణం.. సర్పంచ్ పదవిలో ఉండాలంటే కనీసం పదో తరగతి అయినా పాసై ఉండాలి. హనీఫ్‌ఖాన్ పదో తరగతి చదవకపోయినా చదివినట్లు దొంగ సర్ట్ఫికెట్ పెట్టి పదవిలో ఉన్నాడు. కోర్టులో ఈ విషయం రుజువు కావడంతో అతను రాజీనామా చేయక తప్పలేదు. ఈ సమయంలో ఆయన మనవరాలైన షహనాజ్ ఖాన్ సర్పంచ్‌గా ఎంపికైంది.
ఉత్తరప్రదేశ్, మొరాదాబాద్‌లోని తీర్థంకర్ మహావీర్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో షహనాజ్ ఖాన్ ఎం.బి.బి.ఎస్. నాలుగో సంవత్సరం చదువుతోంది. తరువాత ఇంటర్న్‌షిప్ చేసి అక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టకుండా పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ను పూర్తిచేయాలని ఆలోచిస్తోంది షహనాజ్. ఇలా చదువులో ముందున్న షహనాజ్ గడ్జన్ ఊరికి సర్పంచ్‌గా ఎన్నికైంది. ఆ ఊరిలో అతి చిన్న వయసున్న అమ్మాయి. అంత చిన్నవయసుల్లోనే ఊరి ఉన్నత పదవైన సర్పంచ్ పదవికి ఎంపికై అతి చిన్న వయస్సు మహిళా సర్పంచ్‌గా రికార్డు సృష్టించింది. గడ్జన్ ఊళ్లో ఇతర ఆడపిల్లల్లా పేరు వరకు రాయడం తెలిసిన అమ్మాయి కాదు షహనాజ్. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న అమ్మాయి. అమ్మాయిలు గూంఘట్‌తో కాదు వ్యక్తిత్వంతో గౌరవం అందుకోవాలనే మనస్తత్వం ఆమెది. ప్రజాసేవకు చదువు అడ్డుకాదు అంటూ.. చదువుతోపాటు సర్పంచ్ బాధ్యతలను కూడా నిర్వహిస్తోంది ఈ యంగ్ డైనమిక్ లేడీ.. తాను నేర్చుకున్న వైద్య విద్యను ప్రజాసేవలో భాగం చేయాలనుకుంటోంది.
షహనాజ్ తల్లి జహీదా కూడా రాజకీయ నాయకురాలే.. భరత్‌పూర్ జిల్లాలోని కమన్ నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే. తండ్రి జలీజ్ ఖాన్ కమన్ ప్రధాన్‌గా పనిచేశాడు. తాత, తండ్రి, తల్లి.. వీళ్లందరి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న షహనాజ్ గడ్జన్‌కు ఎంతో సేవ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ముఖ్యంగా ఆడపిల్లల చదువు, ప్రాథమిక అవసరాలైన తాగునీరు, ఆరోగ్యం, శానిటేషన్‌పై దృష్టి సారించింది. మేవాత్‌లో టి.బి. ప్రబలంగా ఉంది. ఆరునెలల్లో నయమయ్యే ఈ వ్యాధిని అవగాహన లేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అక్కడి ప్రజలు. ఇది గమనించిన షహనాజ్ టి.బి.ని పారద్రోలేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఏది ఏమైనా త్వరలో గడ్జన్ గ్రామం అన్ని వసతులున్న ఉత్తమ గ్రామంగా మారనుంది. యువత రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం. ఉత్సాహవంతులైన షహనాజ్‌లాంటి యంగ్ అండ్ డైనమిక్ అమ్మాయిలు రావడం మరీ మంచి విషయం.