మెయిన్ ఫీచర్

అలంకరణలో అతివలదే పైచేయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజులు మారాయి. వాళ్లు వీళ్లు అనే తేడా ల్లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంట్లోకి వచ్చేసరికి మాత్రం స్ర్తిలే ఎక్కువ బాధ్యత తీసుకుంటారు. సగం సగం అని ఎంత చెప్పినా చాలామంది స్ర్తిలే ఇంట్లో పనులను చక్కబెడుతారు. అట్లానే ఇంటిని అలంకరించడంలో కూడా స్ర్తిలదే ఎక్కువ పాత్ర ఉంటుంది.
ఎంత సమయం లేదనుకొన్నాసరే ఇంటిని అందంగా అలంకరించడం స్ర్తికి ఉగ్గుతో నేర్చిన విద్య లాగా ఇట్టే అందంగా మార్చేస్తుంది. ఇప్పుడు అందరికీ అపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. అయినా సరే డ్రాయింగ్‌రూమ్‌లో చక్కని పెయింటిగ్స్ అమర్చడమో, లేక మూలల్లో మంచి సువాసనలిచ్చే పూవులను సర్దడమో చేస్తే ఇంటికి వచ్చిన అతిథులకు ఆహ్వానం వేరే పలుకనక్కర్లేదు. వారు సంతోషంగా ఇంట్లో ప్రవేశిస్తారు. ఇంట్లోవారికి కూడా తీరుబాటుగా కూర్చున్నా, వచ్చిన వారితో మాట్లాడాలనుకొన్నా సరే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఈ రెండింటి వల్ల వచ్చేస్తుంది. అంతేకాదు ఇప్పుడు టీవీలు కూడా ముందుగదిలోనే పెట్టుకుంటున్నారు కనుక ఆ టీవికోసం మంచి అలంకరణ వస్తువులు ధర తక్కువలో మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఒకవేళ అవి మీకు నచ్చకపోతే టివీ గది మధ్యలో గోడకు పెట్టి అటు ఇటు చిన్న టేబుల్ అంటే ముక్కాలి పీటను వేసి దానిమీద మనీప్లాంట్, మరో ప్రక్క మర్వం మొలకలను పెట్టితే ఇల్లంతా సువాసనతో నిండిపోతుంది. టీవి పైన చిన్న అలమరలో మంచి పుస్తకాలు చదవాలనిపించేవి, మీ టేస్టును తెలిపేవి అందంగా అమర్చుకొంటే మీ భావాలను ఇంట్లోవారు ఇట్టే గ్రహించేసి మీకు ఏంకావాలో మీరు కోరుకోకుండానే తెచ్చి ఇచ్చేస్తారు.
ఇక బెడ్‌రూమ్స్‌లో కూడా బట్టల బీరువాలు ఉద్యోగస్తులు అయితే వారానికి సరిపడా ముందుగానే ఏమేమి కావాలో ఆ డ్రస్సులను అమర్చుకోవాలి. మిగతా బట్టలను చక్కటి మడతలు పెట్టి అందంగా అమర్చుకుంటే వాడ్‌రోబ్స్ అందంగా కనిపిస్తాయి. బట్టల్లో మగవారివి, పిల్లలివి,మీవి కూడా వేర్వేరుగా పెట్టుకోవాలి. అందులో కూడా అండర్‌వేర్స్ ఒక దగ్గర ప్యాంట్స్ షర్ట్స్ మరో ప్రక్క, అలానే చీరలు, వాటికి కావాల్సిన ఇంకా దుస్తులు వేరువేరుగా పెట్టుకోవాలి. అప్పుడు చూడడానికి ఎంతో బాగుంటాయి.
ఈ బట్టల బీరువాలు ఎంత సర్దినా వారాంతానికి కొంత గజిబిజిగా తయారు అవుతాయి. బద్దకించకుండా వారాంతంలో ఒక్కసారి తిరిగి సర్దుకోవాలి. ఇక తిరిగివారం అంతా చూసుకోనక్కర్లేదు.
అట్లానే వంటింట్లో పప్పుదినుసులు, ఇతర పోపు సామానులు, టిఫిన్స్ ఉపయోగపడే దినుసులు ఇవి అన్నీ వేటివాటికి ప్రత్యేకమైన డబ్బాలను పెట్టుకోవాలి. వీటిని అలమరల్లో చక్కగా సైజుల వారిగా సర్దుకోవాలి. వారానికి ఒక్కసారి ఏమేమి ఉన్నాయో వారంలో కావాల్సిన మేమిటో చూసుకొని అయిపోయిన వాటిని తెప్పించుకుని సర్దుకోవాలి.
పొద్దునే్న హడావుడిగా ఏదీ కనిపించడం లేదు అనుకోకుండా చేతికి అందుబాటులో చక్కగా సర్దుకోవాలి. ఇప్పుడు మార్కెటులో లోపల వస్తువులను కనిపించే డబ్బాలు దొరుకుతున్నాయి. వాటిని తీసుకొంటే మరీ బాగుంటుంది.
అట్లానే వంట చేసేటపుడు కావాల్సిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లులి ఇలాంటి వన్నీ ముందుగానే మిక్సీ పట్టుకొని ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలి. పొడులు కూడా ముందుగానే అంటే వారాంతంలో చేసి పెట్టుకొంటే వారం అంతా హాయిగా గడిపేయచ్చు.
ఇదేకాదు మరో ముఖ్యమైన విషయం ఏమంటే ప్రతివారం కూడా మర్చిపోకుండా బద్దకించకుండా ఏదైనా అనవసరమైనవి వుంటే వాటిని దూరం చేసేయండి. లేకపోతే అనవసర వస్తువుల వల్ల ఇల్లు ఇరుకుగా అవుతుంది. అవసరమైన వస్తువులు ఉంటేనే మంచిది. పాతవి, వాడనివి ఉండడం అంత లక్ష్మీకరం కూడా కాదు అంటారు. అందుకే వాడుకోవడానికి వీలు లేనివి వెంటనే దూరం చేసుకోండి. ఇలా ఇంటిని వీలుగా సర్దుకొంటే అటు సమయం ఇటు మనస్సుకు తృప్తి మిగులుతుంది.

- కూచిబొట్ల వెంకటలక్ష్మి