మెయిన్ ఫీచర్

ఆడపిల్లకు అండగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూగజీవాలను ప్రాణం కన్నా మిన్నగా చూసుకునే కేంద్రమంత్రి మేనకాగాంధీ మానవత్వం ఉన్న మహిళగా గుర్తింపుపొందారు. ఎక్కడ ఏ మూగజీవిని హింసించినట్లు వార్త వచ్చిందంటే మొట్టమొదట స్పందించేది ఆమె. అలాంటి మేనకా గాంధీ నేడు ఆడపిల్లలను కాపాడుకుందాం అంటూ సామాజిక మాధ్యమాలలో సరికొత్త గళం వినిపిస్తున్నారు. ఆడపిల్లల పట్ల చూపుతున్న వివక్షతకు వ్యతిరేకంగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ‘్భటీ బచావో-్భటీ పడావో’ అని ప్రధాని మోదీ చేసిన నినాదంతో చాలామంది తండ్రులు తమ కుమార్తెలతో తాము దిగిన ఫొటోలను ట్వీట్ చేశారు. అలాగే సెప్టెంబర్‌లో జరుగనున్న ‘డాటర్స్ డే’ సందర్భంగా ఆడపిల్లల సంరక్షణ బాధ్యత మనందరిదీ అంటూ తాను, తన కోడలు, మనవరాలితో ఉన్న ఫొటోను మేనకాగాంధీ ట్వీట్ చేశారు. ఆడపిల్ల కుమార్తె కావచ్చు, కోడలు కావచ్చు, మనవరాలు కావచ్చు. వారితో ఉన్న ఏ ఫొటోనైనా ట్వీట్ చేయమని స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పిలుపునిచ్చారు. ‘‘దేశంలో నెలకొన్న లింగ వివక్షతను నిర్మూలిద్దాం..ఆడప్లిలను అక్కున చేర్చుకుందాం. మహిళలు తమ ఉనికిని కాపాడుకోవటానికి ఇదే సరైన సమయం. మహిళలు ఎందులోనూ తీసిపోరు. ఎంతో ఆత్మవిశ్వాసంతో వారి విధులను నిర్వహిస్తూ ముందడుగు వేస్తున్నారు. నేడు ఆడపిల్ల ఎంతో విలువైంది. రండి అందరం కలిసి ఆడపిల్లల దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకుందాం. ఈ బాధ్యత మనందరిపైన ఉందంటూ’’ ఆమె ట్వీట్ చేసిన ఫొటోకు విపరీతమైన స్పందన వచ్చింది. ఈ ప్రచారంలో మీరు కూడా భాగస్వాములవ్వండి. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమాలలో ఫొటోలను పంపండి అని మేనకాగాంధీ ఇచ్చిన పిలుపునకు స్పందించి వేలాది ఫొటోలు సామాజిక మాధ్యమాలలో వస్తున్నాయి. మగపిల్లలకు ప్రాధాన్యతనిచ్చి వేలాదిమంది ఆడపిల్లలను పురిట్లోనే చంపేస్తున్నారు. వరకట్నం వేధింపులకు ప్రతిరోజూ సగటున 22మంది మహిళలు చనిపోతున్నారు. ప్రతి 22 నిమిషాలకు ఓ మహిళపై అత్యాచారం జరుగుతుంది. ప్రతి ఐదు నిమిషాలకు ఒక మహిళ గృహ వేధింపులకు గురవుతోంది. నిత్యం సమస్యలు, సవాళ్ల మధ్య సహజీవనం చేస్తున్న మహిళల కోసం, ఆడపిల్లలను కాపాడుకుంటూ వారి గౌరవాన్ని ఇనుమడింపజేసేలా డాటర్స్ డే సందర్భంగా కుమార్తె, కోడలు, మనవరాలి ఫొటోలను సామాజిక మాధ్యమాలలో ఉంచాలని ఆమె కోరారు.

chitram.. కోడలు, మనవరాలితో ఉన్న ఫొటోను ట్వీట్ చేసిన మేనకా గాంధీ